Jump to content

రాష్ట్రంలో కొరియా పారిశ్రామికవాడ

TampaChinnodu

Recommended Posts

రాష్ట్రంలో కొరియా పారిశ్రామికవాడ 
ఈనాడు - అమరావతి 
10ap-main4a.jpg

వ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి దక్షిణ కొరియా కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశంలోని బూసాన్‌లో ఉన్న పారిశ్రామికనగరం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ పారిశ్రామికవాడను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. దక్షిణ కొరియాకు చెందిన 30 మంది పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. కొరియాలోని బూసాన్‌లో ఒకేచోట 3వేల పరిశ్రమలతో పారిశ్రామికవాడ ఉందని, అలాంటిదే ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నామని... భారత్‌లో ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణ ప్రాంతాలను కూడా తమ బృందం పరిశీలించి వచ్చిందని, అయితే ఆంధ్రప్రదేశ్‌ తమకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా భావిస్తున్నామని చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతోఅనుకూల వాతావరణం ఉందని, బూసాన్‌ తరహా పారిశ్రామికనగరం ఇక్కడికి వస్తే దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాన్నారు. నవ్యాంధ్రను కొరియా సంస్థలు రెండో రాజధానిగా భావించి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతకు మునుపు కొరియా పారిశ్రామికవేత్తల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి, ఆ శాఖ అధికారులతో విజయవాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కొరియాపరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. కొరియా పరిశ్రమలతో రాష్ట్రానికి దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

విశ్వవిద్యాలయం ఏర్పాటు 
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ‘ఏపీ-కొరియా విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేయనున్నట్లు కొరియా కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌ తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు స్థలం, తగిన ప్రాంతం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దానికంటే ముందు రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి కొరియా పరిశ్రమల్లో వారు పని చేయడానికి సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని, ఇందుకోసం ఆరు నెలల్లోపు ‘నైపుణ్యాభివృద్ధి అకాడమీ’ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

6న సియోల్‌లో రోడ్‌షో 
కొరియా పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డిసెంబరు 6 నుంచి రెండు రోజుల పాటు ఆ దేశంలోని బూసాన్‌, సియోల్‌ నగరాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ రోడ్‌షో నిర్వహించనుంది. ఈ మేరకు గురువారం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొరియా, పరిశ్రమల శాఖ అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేసి, ఈ లోపు ఏఏ కంపెనీ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నది తెలుసుకుని, వారికి కావాల్సిన స్థలం తదితరాలను పూర్తి చేసి, రోడ్‌షో సందర్భంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

23వేల ఎకరాలు సిద్ధం 
దక్షిణ కొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఇప్పటికిప్పుడు పరిశ్రమలకు కేటాయించడానికి తమ వద్ద 23,500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండీ ఎ.బాబు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే భూముల ధర తక్కువన్నారు. పరిశ్రమల కార్యదర్శి ఆరోఖ్య రాజ్‌ మాట్లాడుతూ పరిశ్రమలు, వాటి పెట్టుబడి, ఉద్యోగాల కల్పనను బట్టి భూమి ధరలోనూ సడలింపులుంటాయని, పలు ఇతర రాయితీలు కల్పిస్తామన్నారు.

10ap-main4b.jpg
‘మీకు (తెలుగువారు), మాకు చాలా దగ్గర పోలికలున్నాయి. మీలాగే మేం కూడా తల్లిదండ్రులను కొరియా భాషలో అమ్మా, అప్పా అనే పిలుస్తాం. ఈ ప్రాంతమంటే మాకు చాలా ఇష్టం. ఇప్పటికే ఇక్కడ కియా వచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి. చంద్రబాబు అంటే కొరియా ప్రజలకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంతో మేం సుదీర్ఘ బంధం కోరుకుంటున్నాం’’
-జియాంగ్‌ డియోక్‌ మిన్‌, భారత్‌లో కొరియా కాన్సుల్‌ జనరల్‌
Link to comment
Share on other sites

దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే భూముల ధర తక్కువన్నారు.

@idibezwada @psycopk ankul innaallu mammalni amaravati lo land konanivvakunda chesi anni meere konnaru ga

Link to comment
Share on other sites

9 hours ago, TampaChinnodu said:

North Koria aithe super vundu kada 

Link to comment
Share on other sites

8 minutes ago, tables said:

Replies chustunte aslau ee news ni evaru serious ga teesukoledu anipistundi,credibility ee poindi :( 

Endhi vaa credibility .. land rates cheap dhi a .. Koreans podhhunlechi thank you cbn antarannadha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...