shango Posted November 10, 2017 Report Posted November 10, 2017 ఏపీలో కొరియా పారిశ్రామికవాడ అనంత లేదా నాయుడుపేటలో ఏర్పాటు కొరియన్ పారిశ్రామికవేత్తల సంసిద్ధత భూములు, ప్రోత్సాహకాలపై స్పష్టతకై వినతి అదే దారిలో మరో 800 కంపెనీలు ఏపీని రెండో రాజధానిగా చేసుకోండి బుసాన్ తరహాలో కొరియన్ సిటీ ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన రాష్ట్రంలో ఆంధ్ర-కొరియన్ వర్సిటీ త్వరలోనే శిక్షణ అకాడమీ ఏర్పాటు కొరియన్ కాన్సుల్ జనరల్ స్పష్టీకరణ అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడుల సానుకూల వాతావరణం ఉందని.. భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలపై స్పష్టతను ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చేస్తామని దక్షిణ కొరియాకు చెందిన బుసాన్ పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు. బుసాన్ నుంచి 200 కంపెనీలు తక్షణమే రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ఈ పెట్టుబడుల విలువ రూ.10,000 కోట్లు ఉంటుందని వివరించారు. తాము మాత్రమే కాకుండా.. మరో 800 మంది పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రానికి తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. గురువారం బుసాన్ కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్‌తో పాటు 30 మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందం విజయవాడకు వచ్చింది. వీరు గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. రాష్ట్రాన్ని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ భారీ సంఖ్యలో పరిశ్రమలను స్థాపించాలని సీఎం ఈ సదర్భంగా వారిని ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. బుసాన్ తరహాలో అమరావతిలో గానీ, రాష్ట్రంలో అన్ని అనుకూలతలూ కలిగిన మరో ప్రాంతంలో గానీ కొరియన్ సిటీని ఏర్పాటు చేస్తామని, అక్కడ పారిశ్రామికాభివృద్ధి పార్కును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. డిజైన్, ఇతర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలతో వస్తే అవగాహనా ఒప్పందాలు చేసుకుందామన్నారు. దక్షిణ కొరియాతో ఏపీకి అనేక అంశాలలో సారూప్యత ఉందని తెలిపారు. జనాభా, విస్తీర్ణంలో రెండూ సమానంగా ఉన్నాయని, అక్కడిలాగే రాష్ట్రంలోనూ సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని చెప్పారు. దక్షిణ కొరియా వేరుపడి స్వల్ప కాలంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే బాటలో ఉందని అన్నారు. బుసాన్ పారిశ్రామికవాడలో ఉన్న 3 వేల కంపెనీలు తరలివచ్చినా అందరికీ ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, అపార సహజ వనరులూ.. మానవ వనరులూ అందుబాటులో ఉన్నాయని వివరించారు. నిర్దుష్ట ప్రతిపాదనలతో ముందుకొచ్చిన పెట్టుబడిదారులకు.. పరిశ్రమల ఏర్పాటుకు సత్వరం, సులభతరంగా అనుమతులిస్తామని, భూమి, నీరు, నిరంతర విద్యుత్ తదితర రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఓడరేవుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారమందించాలని కొరియా బృందానికి విజ్ఞప్తి చేశారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్.. అంతకుముందు అమరనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కొరియన్ పారిశ్రామికవేత్తలు భేటీ అయినప్పుడు.. ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక సంస్థలకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి అహ్మద్‌బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం 23,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. అనంతపురం జిల్లాలోని కియ మోటార్స్ సమీపంలోనే ప్లాంట్లను స్థాపిస్తామంటే.. ఆ సంస్థకు ఇచ్చిన ధరకే భూములను అప్పగిస్తామని తెలిపారు. కొరియాలో డిసెంబరు 6,7 తేదీల్లో రోడ్ షోలను నిర్వహించనున్నట్లు చెప్పారు. 6న సియోల్‌లో, 7న బుసాన్‌లో ఇవి ఉంటాయన్నారు. ఆలోగా పారిశ్రామికవేత్తలు ఏయే సంస్థలు స్థాపిస్తారో.. వారికి కావలసిన భూములు, మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కియ ప్లాంటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, దీనిని గమనించిన మరో 39 అనుబంధ సంస్థలు.. యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి చెప్పారు. రొయ్యల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో వైవీ ప్రసాద్ కోరారు. షరతులపై కంపెనీల ఆరా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే విదేశీ సంస్థలకు లైసెన్సుల జారీ సమయంలో.. ఈక్విటీలను కోరడం వంటి షరతులు ఉంటాయా అని కొరియా కంపెనీలు పరిశ్రమల శాఖను ఆరా తీశాయి. నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉన్నారా అని తెలుసుకోగోరాయి. ఈ సందేహాలను పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ తీర్చారు. రాష్ట్రంలో కియ కంపెనీకి భూ కేటాయింపుల్లోనూ.. మౌలిక సదుపాయాల కల్పనలోనూ రాయితీలిచ్చామన్నారు. ఈక్విటీలు కోరే సంస్కృతి రాష్ట్రంలో లేదన్నారు. నైపుణ్యంతో కూడిన యువత అందుబాటులో ఉన్నారని, కార్మిక సంఘాల సమస్యలూ లేవని.. ఇందుకు శ్రీసిటీ పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. శ్రీసిటీలోనే.. ఫాక్స్‌కాన్ సంస్థ తమ ఉత్పత్తులను తయారుచేస్తోందని.. ఈ కంపెనీలో 18,000 మంది మహిళలు పనిచేస్తున్నారన్నారు. తమకు రోడ్డు కనెక్టివిటీతో పాటు.. విమానాశ్రయం, ఓడరేవు కూడా సమీపంలోనే ఉండాలని కొరియా ప్రతినిధులు కోరగా.. అలాంటప్పుడు అనంతపురం కంటే.. నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చింది. దీర్ఘకాలిక అనుబంధం: జియాంగ్ రాష్ట్రంలో పారిశ్రామిక అనుబంధాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని భావిస్తున్నామని.. ఇందులో భాగంగా ఏపీ-కొరియన్ వర్సిటీని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని కొరియన్ కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్ చెప్పారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని కియకు ఇచ్చిన ప్రాధాన్యంతోనే గుర్తించామని చెప్పారు. తాము ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించామని, వాటితో పోల్చితే ఆంధ్రలో పారిశ్రామిక సానుకూల వాతావరణం కనిపించిందని స్పష్టంచేశారు. 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం తాము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్, స్టీల్, లాజిస్టిక్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్ కాంపోనెంట్స్, బ్యాటరీ, మాంసం ప్రాసెసింగ్ , లిక్కర్, నౌకానిర్మాణం. మెడికల్, మెరైన్ అక్విప్ మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. చంద్రబాబు గురించి కొరియన్లకు తెలుసు పాలనాదక్షత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబును కొరియా దేశీయులంతా గుర్తుపడతారని జియాంగ్ వెల్లడించారు. తెల్లని గడ్డం, గంభీరమైన చిరునవ్వు ఆయన ప్రత్యేకతలన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి... సంప్రదాయాలకూ, కొరియన్ సంప్రదాయానికీ చాలా సారూప్యం ఉందని తెలిపారు. ఆంధ్రలో తల్లిని అమ్మా అని పిలుస్తారని.. తమ దేశంలోనూ అమ్మా అనే పిలుస్తామని.. నాన్నను అప్పా అని అంటామని చెప్పారు. Quote
BaabuBangaram Posted November 10, 2017 Report Posted November 10, 2017 @TampaChinnodu already cry chesi velladu Quote
TampaChinnodu Posted November 10, 2017 Report Posted November 10, 2017 23 minutes ago, BaabuBangaram said: @TampaChinnodu already cry chesi velladu Happiness lo cried man. Evaru ina city ni capitol gaa chestharu , alantidi state mothani korea ki second capitol gaa chesthunnaru. Thank You CBN and Chinna babu. ఏపీని రెండో రాజధానిగా చేసుకోండి Quote
shango Posted November 10, 2017 Author Report Posted November 10, 2017 చంద్రబాబు గురించి కొరియన్లకు తెలుసు పాలనాదక్షత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబును కొరియా దేశీయులంతా గుర్తుపడతారని జియాంగ్ వెల్లడించారు. తెల్లని గడ్డం, గంభీరమైన చిరునవ్వు ఆయన ప్రత్యేకతలన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి... సంప్రదాయాలకూ, కొరియన్ సంప్రదాయానికీ చాలా సారూప్యం ఉందని తెలిపారు. ఆంధ్రలో తల్లిని అమ్మా అని పిలుస్తారని.. తమ దేశంలోనూ అమ్మా అనే పిలుస్తామని.. నాన్నను అప్పా అని అంటామని చెప్పారు. Quote
aakathaai Posted November 10, 2017 Report Posted November 10, 2017 7 hours ago, TampaChinnodu said: Happiness lo cried man. Evaru ina city ni capitol gaa chestharu , alantidi state mothani korea ki second capitol gaa chesthunnaru. Thank You CBN and Chinna babu. ఏపీని రెండో రాజధానిగా చేసుకోండి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.