Jump to content

Recommended Posts

Posted
జహంగీర్‌ పీర్‌ దర్గా అభివృద్ధికి రూ.50 కోట్లు 
100 ఎకరాలు సేకరించి ఇస్తాం 
సీఎం కేసీఆర్‌ వెల్లడి 
మొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి 
10ts-main2a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా జహంగీర్‌ పీర్‌ దర్గాను అభివృద్ధి చేస్తామని. ఇందు కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సుమారు 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి దర్గాకు ఇస్తామన్నారు. హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఛాదర్‌ సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ దర్గాకు వస్తానని గతంలో సీఎం మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో దర్గాకు వచ్చిన ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, దర్గా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఛాదర్‌ను తలపై పెట్టుకొని దర్గాలోకి వెళ్లిన కేసీఆర్‌ అక్కడ కొద్దిసేపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ మంత్రివర్గ సహచరులు, మత పెద్దలు, స్థానిక నాయకులతో కలసి భోజనం చేశారు.

మంత్రులు, జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, వక్ఫ్‌ బోర్డు అధికారులు, దర్గా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దర్గాకు 100 ఎకరాల మేర స్థలం సమకూర్చాలని ఇందులో నిర్ణయించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా స్థల సేకరణ జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై సమీక్షించారు. దర్గా సమీపంలో ఉన్న దుకాణాలు తొలగించకుండా అభివృద్ధి జరిగేందుకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. దేశం నలుమూలల నుంచి ఈ దర్గాను సందర్శించేందుకు పర్యాటకులు, భక్తులు వచ్చేలా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌కు వరాలు.. 
స్థానిక షాద్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ కొద్ది సేపు విడిగా మాట్లాడారు. నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు, శివారు గ్రామాలకు, తండాలకు రూ.5 లక్షలు చొప్పున కేటాయిస్తామని.. ఇందుకు సంబంధించి సోమవారం నాటికి ఉత్తర్వులు వెలువడతాయని సీఎం పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఎత్తిపోతల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరిందిస్తామని కొందర్గు మండలంలో సుమారు 670 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్‌ నిర్మిస్తామన్నారు. ముంపు తక్కువగా ఉండేలా చూస్తామని చెప్పారు. పాలమూరు పథకం పనులు ఆమూలాగ్రం పరిశీలించేందుకు తాను త్వరలోనే పర్యటిస్తానని సీఎం తెలిపారు. కొత్తూరు మండలంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

10ts-main2b.jpg
Posted
Quote

నియోజకవర్గానికి పలు వరాలు ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు, శివారు గ్రామాలకు, తండాలకు రూ.5 లక్షలు చొప్పున కేటాయిస్తామని.. ఇందుకు సంబంధించి సోమవారం నాటికి ఉత్తర్వులు వెలువడతాయని సీఎం పేర్కొన్నారు. 

varalu anta , ha ha. 5 lacs ki commissions , corruption poyaka okka kilo meter road kooda raadu naa matta. 

Posted
3 hours ago, perugu_vada said:

baboye entha posthaado e thurakolla ki veedu .. 

7 seats in hyd vaadiki plus avutai and migitha chota all muslim votes.

Posted
3 hours ago, perugu_vada said:

baboye entha posthaado e thurakolla ki veedu .. 

naakenduko vaadu slow ga mim ke rod pedtunnadu anipistudi, oka vela pothu unte he might ask malakpet and goshamahal seats in 2019.

Posted

Muslim votes kosam ika assembly sakshi ga Owisi brothers ki BJ evvadam okkate migili undi...

};_};_

Posted
52 minutes ago, Akkumm_Bakkumm said:

Muslim votes kosam ika assembly sakshi ga Owisi brothers ki BJ evvadam okkate migili undi...

};_};_

dora eam sesina 200% correct

Posted
3 minutes ago, boeing747 said:

Kummu KCR kummu. bangar telangana kosam ilantivi seyyali tappadu

Kontekurradu

Posted
2 hours ago, Kontekurradu said:

dora eam sesina 200% correct

 

1 hour ago, Kontekurradu said:

Kontekurradu

Fans enti kush avaledu aa kanipistaleru @3$%

Posted
1 hour ago, 4Vikram said:

 

Fans enti kush avaledu aa kanipistaleru @3$%

busy in finding links to post about AP and CBN 

Posted
41 minutes ago, Kontekurradu said:

busy in finding links to post about AP and CBN 

correst ga cheppav baa

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...