summer27 Posted November 15, 2017 Report Posted November 15, 2017 సంచలనం: ఆదేశానికి రాజుగా భారతీయుడు 15 Nov, 2017 16:28 IST|Sakshi భారతీయులు ఎక్కడ ఉన్నా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. తాజాగా మరో 24ఏళ్ల భారతీయ యువ వ్యాపారవేత్త మరో సంచలన ప్రకటన చేశాడు. రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగానికి రాజుగా ప్రకటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఈజిప్టు, సుడాన్ దేశాల సరిహద్దులో వివాదాస్పంగా ఉన్న బిర్‌తావిల్ ప్రాంతానికి స్వయం ప్రకటిత రాజుగా ప్రకటించుకున్నాడు ఓ భారతీయుడు. ఈజిప్టు, సుడాన్‌ల మధ్య 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొంత భూభాగం ఉంది. ఆప్రాంతం తమది కాదంటే తమది కాదంటూ రెండు దేశాలు పరస్పరం వాదించుకుంటున్నాయి. అది ఉగ్రవాదులు సంచరించే ప్రాంతం కావడంతో రెండు దేశాలు ఆప్రదేశంపై వెనక్కి తగ్గాయి. ఇండోర్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త సుయాష్ దీక్షిత్ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి బిర్‌తావిల్‌కు రాజుగా ప్రకటించుకున్నాడు. ఆప్రాంతానికి 'కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్' అని పేరుకూడా పెట్టకున్నాడు. అంతేకాదు దేశంగా ప్రకటించుకున్న సందర్భంగా అక్కడ ఓ విత్తనం నాటి నీరు కూడా పోశాడు. ఇక నుంచి ఈ ప్రాంతానికి రాజును నేనేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాకుండా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆదేశానికి అధ్యక్షుడిగా తన తండ్రి పేరు ప్రకటించాడు. హ్యాపీ బర్త్‌డే పప్పా అంటూ తన వాల్‌పై రాసుకున్నాడు. అనంతరం కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్‌ను దేశంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితికి ఆన్‌లైన్‌లో ఓదరఖాస్తు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తనకు 800 మంది మద్దతు పలికారని పేర్కొన్నాడు. కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్ వివరాలు దేశం పేరు: కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్ జెండా: పైన చిత్రంలో ఉంది ప్రస్తుత జనాభా: 1 రాజధాని: సుయాష్‌పూర్ పాలకుడు: సుయాష్ రాజు ఏర్పాటు తేది: నవంబర్ 5, 2017 జాతీయ జంతువు: బల్లి Quote
nandananditha Posted November 15, 2017 Report Posted November 15, 2017 భారతీయులు ఎక్కడ ఉన్నా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. Quote
argadorn Posted November 15, 2017 Report Posted November 15, 2017 akada unna annalaki telistahy g lo pelustharu ... appudu india lo apt theskuntadu Quote
Piracy Raja Posted November 15, 2017 Report Posted November 15, 2017 jagan gadiki akkadaki pampanidi... kanisam akkada ayyina CM/PM/President/King avutadu Quote
uttermost Posted November 15, 2017 Report Posted November 15, 2017 Just now, argadorn said: akada unna annalaki telistahy g lo pelustharu ... appudu india lo apt theskuntadu refugee status lo edanna european country ki elthadu ley. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.