Jump to content

Recommended Posts

Posted
Debate-Between-NV-Prasad-and-Bandla-Ganesh-over-Nandi-Awards-1510896114-1875.jpg

మూడేళ్ల నంది అవార్డుల్ని హోల్ సేల్ గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. నంది అవార్డుల ఎంపిక ఎలా ఉందంటే రెండే రెండు మాటల్లో తేల్చేస్తున్నారు. లెజెండ్ కు అన్ని అవార్డులా?  రుద్రమదేవి.. రేసుగుర్రం.. మనం సినిమాలకు ఒక్క అవార్డు లేదా? అన్న ప్రశ్న రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

ఒక ప్రముఖ ఛానల్ లో నిర్వహించిన డిబేట్కు నిర్మాత నల్లమల బుజ్జి.. బండ్ల గణేశ్.. సి. కల్యాణ్.. కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి వాళ్లు పాల్గొన్నారు. హాట్ హాట్ గా సాగిన ఈ డిబేట్ లో చర్చకు వచ్చిన అంశాలపై ఒకరికొకరు ఒప్పుకోకున్నా.. ఒక విషయంలో మాత్రం ఎవరూ కాదనలేనిది. 

గురి చూసి వదిలిన బాణంలో బండ్ల గణేశ్ లేవనెత్తిన ప్రశ్నకు అందరూ అవుననే మాట తప్పించి మరేం మాట్లాడలేని పరిస్థితిని కల్పించింది. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ కథా చిత్రం అన్న కేటగిరిని ఎత్తేశారని.. ఇదెందుకు జరిగిందంటూ బండ్ల క్వశ్చన్ చేశారు.

అప్పటివరకూ సాగిన చర్చకు కొత్త మలుపు తిప్పేలా ఈ ప్రశ్న తెర మీదకు వచ్చింది.ఈ విషయాన్ని తాను గుర్తించలేదని.. తనకు తెలీదని డిబేట్ నిర్వహించిన ఛానల్ కు చెందిన రజనీకాంత్ చెప్పి.. ఎందుకు లేపేశారంటూ చర్చను ఆ అంశం మీద ఫోకస్ చేశారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ కు.. నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ మధ్యల ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. ఈ ఇష్యూను ఓపెన్ చేసిన బండ్ల గణేశ్ ను ఉద్దేశించి రజనీకాంత్ ప్రశ్నిస్తూ.. ఆ అవార్డును ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. అదే తాను అడుగుతున్నట్లుగా చెప్పారు. కారణం ఏమై ఉంటుందంటారంటూ ఆరాగా అడిగిన రజనీ.. కావాలనే చేశారంటారా అంటూ బండ్ల నోట మాట చెప్పించే ప్రయత్నం చేశారు.

దీనికి బదులిచ్చిన గణేశ్.. మీకు తెలీదా గురువుగారు? అంటూ సమాధానం చెబుతూ.. ముల్లు గుచ్చటంలో మీరు మొనగాళ్లు సార్.. అంటూ అనునయంతో కూడిన ఆవేశాన్ని ప్రదర్శించారు. అంటే.. నాగార్జున.. బాలకృష్ణ మధ్యన ఉన్న విభేదాల కారణంతోనే అవార్డు ఎత్తేశారంటారా? అంటూ ప్రశ్నించిన రజనీకాంత్ ను.. మీకు తెలీదా గురువుగారు? ప్రశ్న మమ్మల్ని వేయటం ఎందుకు?  మీరే చెప్పేయొచ్చుగా గురువుగారు అంటూ బండ్ల దూకుడుతో.. రజనీ కామ్ అవ్వాల్సి వచ్చింది. మామూలుగా అయితే.. ఓ రేంజ్ లో చెలరేగిపోయే రజనీ.. తనకు సినిమాల మీద తక్కువ అవగాహన ఉందంటూ బండ్లకు ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు. అవగాహన తక్కువైనప్పుడు.. అదే అంశం మీద చేసే డిబేట్ ను ఎలా నిర్వహిస్తారు రజనీ?

Posted

kingcasanova mothaaniki anni angles lo 10ngaadu anna maata rajani gaadni, ilaiah episode nunchi veedu konchem over chestunnaadu, inko rendu moodu rounds veyyaali eeediki

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...