SonyKongara Posted November 28, 2017 Report Posted November 28, 2017 Amaravati heart project మంగళగిరి: రాజధాని అమరావతి నగరంలో తమ గ్రామానికి ఓ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నీరుకొండ గ్రామస్థులు పట్టుబడుతున్నారు. ఇందుకోసం తమ గ్రామంలోని కొండను విశాఖలోని కై లాసగిరి కన్నా మిన్నగా అన్నిహంగులతో తీర్చిదిద్దాలని ప్రణాళికను రూపొందిస్తున్నా రు. ఈ మేరకు తమ మనోభావాలను ప్రభుత్వం దృష్టికి కూడ తీసుకువెళ్లారు. భూసమీకరణ ప్రక్రియలో భాగంగా పలుమార్లు గ్రామానికి వచ్చిన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పీ నారాయణ గ్రామస్థుల ఆలోచనలను అభినందిస్తూ కచ్చితంగా రాజధానిలో నీరుకొండకు ఓప్రత్యేకత కల్పిస్తామని హమీలను ఇచ్చారు. ఎన్టీఆర్ శిఖరం పేరుతో నీరుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండుతో గ్రామస్థులు ఎన్టీఆర్ ఫౌండేషన్ పేరుతో ఓ కమిటీగా ఏకమయ్యారు. ఈ ఫౌండేషన్‌కు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, గ్రామానికి చెందిన ముప్పవరపు వెంకట్రావు, చలమలపల్లి బుల్లియ్య, దిండు వెంకటేశ్వరరావు, తోట పార్ధసారధి, మొవ్వా ధనకుమార్, దేశిబోయిన శ్రీను సభ్యులుగా ఉన్నారు. నీరుకొండ ప్రత్యేకతలివి... నీరుకొండలోని కొండ మొత్తం 172 ఎకరాల విస్తీర్ణంలో సముద్రమట్టానికి 150మీటర్ల ఎత్తులో ఉంది. దీని ఉపరితలంలో సుమారు 30నుంచి 40 ఎకరాల వరకు విశాల మైదానం ఉంది. కొండ శిఖరం అంచుల వెంబడి ఎత్తుపల్లాలను చదును చేసి సరిదిద్దితే మరో ఐదారు ఎకరాల వరకు తోడయ్యే అవకాశం ఉంది. కొండమీదకు ఈశాన్యం వైపు నుంచి ఘాట్‌రోడ్డును సులువుగా నిర్మించేందుకు అనుకూల సరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా ఓ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీరుకొండను రాజధానికి హృదయం (గుండె)గా మలచాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం హార్ట్ అనే సమ్మిళిత ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. హార్ట్ అంటే....! హార్ట్ అనేపదంలో హెచ్ అంటే...హెరిటేజ్ (వారసత్వ గుర్తింపు), ఇ అంటే ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం), ఏ అంటే...ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్ (కళలు, సాంస్కృతిక మందిరం), ఆర్ అంటే... రిక్రియేషన్ (వినోదం) టీ అంటే...టూరిజం (పర్యాటకం). ఈ రీతిగా నీరుకొండను ఐదు అంశాల అభివృద్ధి సమాహారంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ గ్రామానికే చెందిన డాక్టర్ మాదల శ్రీనివాస్ బీజేపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా వ్యవహరిస్తున్నారు. ఈ హార్ట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయించారు. నీరుకొండ పర్వత శిఖరంపై తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని ప్రాంతమంతా కనిపించే విధంగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని ఆ ప్రాజెక్టులో ప్రతిపాదించారు. సందర్శకుల వినోదం కోసం కైలాసగిరిలో మాదిరి రోప్‌వే, కొండ చుట్టూ సర్య్యూట్ రైలు, ఇతర వినోద కార్యక్రమాలను చేపట్టాలని సూచిస్తున్నారు. దీంతోపాటు కొండ దిగువన కొండవీటివాగు పరిసరాలను గ్రీనరీతో అభివ్దృద్ధి చేసి బోటు షికారు సౌకర్యం కల్పించవచ్చునంటున్నారు. మొత్తంగా ఈ ఆహ్లాదభరితమైన ప్రాజెక్టును రాజధాని ప్రాంతంలోనే ఓపెద్ద పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయవచ్చునన్నది గ్రామస్థుల ఆలోచన. దీనివలన నీరుకొండతో పాటు పరిసర గ్రామాల యువతకు మంచి ఉపాధి అవకాశాలు కూడ పెరుగుతాయని అంటున్నారు. నీరుకొండ, కురగల్లు గ్రామాల నుంచి రాజధానికి పెద్దఎత్తున భూములను ఇప్పించడంలో విశేషంగా కృషి చేసిన డాక్టర్ మాదల శ్రీనివాస్ రాజధాని ఏరియాలో నీరుకొండకు ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని కృషి చేస్తున్నారు. Quote
KammaNiMaata Posted November 28, 2017 Report Posted November 28, 2017 1 hour ago, SonyKongara said: Quote
KammaNiMaata Posted November 28, 2017 Report Posted November 28, 2017 1 hour ago, SonyKongara said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.