SonyKongara Posted November 28, 2017 Report Posted November 28, 2017 28-11-2017 08:27:53 ఆంధ్రజ్యోతి - అమరావతి: రాజధాని నగరాన్ని వనవ నందనవనంగా అభివృద్ధి చేసేందుకు ఉద్యానాల పెంపకంలో శిక్షణ పొందిన అమరా వతి వాసులు తోడ్పడాలని ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి తెలిపారు. అమరావతిలో పచ్చదనాన్ని పెంచేందుకు ఏడీసీ- ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ)ల సంయుక్త ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల్లో ఒకటైన శాకమూరుకు చెందిన సుమారు 30 మంది యువతీ యువకులకు నెల రోజులుగా విజయవాడలో జరుగుతున్న గార్డెనర్స్ శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ప్రతిపా దించిన శాకమూరు రీజియనల్ పార్క్ సహా గ్రీనరీ ప్రాజెక్టులన్నింటినీ ఆశించిన రీతిలో అభివృద్ధి పరచేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదప డతాయన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో ప్రావీణ్యం కనబరచిన వారికి ఆయా పనుల్లో తప్పకుండా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీయూజీబీసీ ఎండీ ఎన్. చంద్రమోహనరెడ్డి ప్రసంగిస్తూ మెరుగైన ఉపాధికి బాటలు వేసే గార్డెనింగ్‌లో శిక్షణ పొందేందుకు రాజధాని యువత ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. అనంతరం శిక్షణార్ధులకు సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షణ తరగతుల్లో విశేష ప్రతిభ కనబరచిన ఎం.రమాదేవి, వి.నరసింహారావు, ఇ.శ్రీనివాసులరెడ్డిలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కొందరు అభ్యర్థులు శిక్షణ తరగతులతో తమకు ఒనగూరిన ప్రయోజనాలను వివరించారు. పచ్చదనం అభివృద్ధితో కలిగే ఉపయోగాలు అవగతమయ్యాయని, ఇళ్ల ఆవరణలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉద్యానవనాలను పెంచే విధానం, పుష్పగుచ్ఛాల తయారీ తెలుసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీయూజీబీసీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.ముస్తఫా, కోర్స్ డైరెక్టర్ శివప్రసాద్, ఏడీసీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.చంద్ర ఓబుల్‌రెడ్డి, సీనియర్ ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్ కె.పుండరీకాక్షుడు పాల్గొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.