Jump to content

Nissan Motors files law suite against India for 700 million Dollars

Recommended Posts

Posted
రూ.5,000 కోట్ల పరిహారం ఇప్పించండి 
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో నిస్సాన్‌ ఫిర్యాదు 
మోదీకి లీగల్‌ నోటీస్‌! 
ఈ నెల మధ్యలో విచారణకు అవకాశం 
30-business-news-1a.jpg 30-business-news-1b.jpg

భారత్‌ నుంచి రూ.5000 కోట్లకు పైగా (700 మిలియన్‌ డాలర్ల) పరిహారం రావాల్సి ఉందని, ఆ మొత్తం ఇప్పించాలని కోరుతూ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని జపాన్‌ వాహన దిగ్గజం నిస్సాన్‌ మోటార్‌ ఆశ్రయించిందని వార్తాసంస్థ రాయిటర్స్‌ తెలిపింది. భారత్‌లో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటు చేసినందుకు ఇస్తామన్న ప్రోత్సాహకాలు అందచేయనందున, ప్రధాని నరేంద్ర మోదీకీ నిస్సాన్‌ మోటార్‌ లీగల్‌ నోటీస్‌ జారీ చేసింది. తమిళనాడులో ప్లాంటు ఏర్పాటు చేస్తే, ప్రోత్సాహకాలు ఇస్తామని 2008లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తూ, వాటిని ఇప్పించాలని కోరుతూ గతేడాది ప్రధానమంత్రికి నిస్సాన్‌ లీగల్‌ నోటీస్‌ జారీ చేసింది. 2015 వరకు తమకు రావాల్సిన ప్రోత్సాహకాల బకాయిల గురించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని వివరించింది. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ 2016 మార్చిలో ప్రధానికి తమ సంస్థ ఛైర్మన్‌ కార్లోస్‌ ఘోస్‌ ఇచ్చిన వినతికీ స్పందన రాలేదని తెలిపింది. అనంతరం 2016 జులైలో నిస్సాన్‌ న్యాయవాదులు ప్రధానికి నోటీస్‌ పంపారు. తరవాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, నిస్సాన్‌ ఉన్నతాధికారుల మధ్య 12 సార్లకు పైగా సమావేశాలు జరిగినా, ఏమీ తేలలేదని ఈ వివాదం గురించి తెలిసిన వ్యక్తి వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ‘ప్రోత్సాహకాలు ఇప్పిస్తామని, కేసును న్యాయస్థానాలకు తీసుకెళ్లవద్దని’ కేంద్రప్రభుత్వానికి చెందిన పలు విభాగాల అధికారులు నిస్సాన్‌కు హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో, ఆర్బిటర్‌ను నియమించాలని కోరుతూ గత ఆగస్టులో నిస్సాన్‌ కోరింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో ఈ కేసుపై తొలి విచారణ ఈనెల మధ్యలో జరగొచ్చు. తగిన పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని నిస్సాన్‌ మోటార్‌ ప్రతినిధి పేర్కొన్నారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం వరకు వెళ్లకుండానే, పరిష్కరించుకోగలమని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పరిహారం విషయంలోనూ తేడాలేమీ లేవని పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించలేదు.

20 కేసుల పెండింగ్‌ 
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరిస్తోందని, చెల్లింపు వివాదాలు, పాత లావాదేవీలపై పన్ను విధిస్తోందని తదితర కారణాలతో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాల్లో భారత్‌పై 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెట్టుబడిదారులు పెట్టిన ఇన్ని కేసులు మరే దేశంపైనా లేవు.

Posted

Ila aithe inka investors ela vastaru..._%~

idi next level all together...sFun_duh

Posted
4 minutes ago, Demigod said:

bl@st

Posted

jujubi case lu ivanni...

aina idi nothing...vodafone double taxation case aithe highlight...transfer pricing policies ni motham biscuit chesindi a case...

Posted

OKKADAINA ASALU MATTER CHADIVAARA... TAMILNADU GOVT 2008 LO MAA STATE LO COMPANY PEDITHE TAX EXEMPTION AND OTHER GOODIES ISTAMU ANI  CHEPPI BISCUIT ICHINDI... VADEMO CENTER MEEDA PADDADU.... REPPODDUNA MUKKODU..PILLI GADDAMODU KUDA IDE CHEYABOTUNARU...!

Posted
1 hour ago, JaMbU said:

oyamma mari feel aai poku... akkada edo gov india dabbu kadutunadu... country ki anta sthomata ledu...

oka vela money Katina.. TN ki return lo ivalsina money lonundi cut chestaru... center is waste shittt... 

Posted
2 hours ago, Demigod said:

Ila aithe inka investors ela vastaru..._%~

20 కేసుల పెండింగ్‌ 
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరిస్తోందని, చెల్లింపు వివాదాలు, పాత లావాదేవీలపై పన్ను విధిస్తోందని తదితర కారణాలతో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాల్లో భారత్‌పై 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెట్టుబడిదారులు పెట్టిన ఇన్ని కేసులు మరే దేశంపైనా లేవు.

idi next level all together...sFun_duh

@3$%&J&@3$%&J&@3$%&J&@3$%&J&@3$%&J&@3$%&J&@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...