TampaChinnodu Posted December 4, 2017 Report Posted December 4, 2017 ఏసీబీలో ఇంటిదొంగ అవినీతి అధికారులకు ఆయనే ‘కీ’లకం రహస్య విభాగం మేనేజర్ శోభన్‌బాబు పట్టివేత అవినీతి అధికారులకు ముందే సమాచారం చేరవేత 50మందికి పైగా అవినీతిపరులతో సంప్రదింపులు విచారణ నివేదిక ఆధారంగా కేసు నమోదు, సస్పెన్షన్ ఈనాడు - అమరావతి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రహస్య విభాగంలో అత్యంత ‘కీ’లకమైన అధికారి అవినీతి అధికారులతో కుమ్మక్కై కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. ఏసీబీకి అందే ఫిర్యాదులు, వారిపై సాగుతున్న విచారణలు, నమోదైన కేసుల దర్యాప్తు సమాచారాన్ని ముందుగానే చేరవేస్తూ ప్రతిఫలంగా వారి నుంచి భారీగా ఆర్థిక, ఇతర ప్రయోజనాలు పొందారు. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డ ఓ అవినీతి అధికారి సెల్‌ఫోన్‌లో ఈయన ఫోన్ నెంబరును, అతనితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సోదాలు నిర్వహించిన అధికారులు గుర్తించడంతో ఆ ఇంటి దొంగ బండారం బయటపడింది. ప్రాథమికంగా లభించిన ఆధారాలపై ఏసీబీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ విచారణకు ఆదేశించడంతో రహస్య విభాగం మేనేజర్ శోభన్‌బాబు అవినీతి వ్యవహారాలు అనేకం వెలుగుచూశాయి. అవినీతి ఆరోపణలున్న 50 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. విచారణాధికారులు నివేదిక సమర్పించడంతో శోభన్‌బాబుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. జూన్ 17న కేసు...15వ తేదీనే లీకు విశాఖపట్నం జిల్లా గాజువాకలో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన దొడ్డపనేని వెంకయ్యనాయుడుపై ఈ ఏడాది జూన్ 17వ తేదీన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. అదే నెల 15వ తేదీన అంటే రెండు రోజుల ముందే శోభన్‌బాబు ఆయనకు సంబంధిత సమాచారాన్ని లీక్ చేశారు. వాణిజ్యపన్నుల శాఖలో పనిచేసే ఓ అధికారి ద్వారా శోభన్‌బాబు వివరాలు తనకు తెలిశాయని, ఆ క్రమంలోనే తనపై ఏవైనా ఫిర్యాదులు ఉన్నాయా? అనే అంశాన్ని తెలుసుకునేందుకు అతన్ని గ్రీన్‌పార్కు హోటల్‌లో ఓ సారి కలిసినట్లు వెంకయ్యనాయుడు ఏసీబీ అధికారులకు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఏడాది మే నెల 18 నుంచి 21వ తేదీ వరకూ శోభన్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలోని ఈ గ్రీన్‌పార్కు హోటల్‌లో బస చేశారు. దీని బిల్లును సహాయ ఇంజినీర్ జీఎంఎస్ కుమార్‌రాజు చెల్లించారు. మహానగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన జయరామిరెడ్డి చెబితేనే ఈ హోటల్ బిల్లు రూ.18,993లను చెల్లించినట్లు ఆయన విచారణలో ఏసీబీ అధికారుల ఎదుట అంగీకరించారు. మా అబ్బాయికి సీఆర్‌డీఏలో ఉద్యోగం ఇప్పించండి ‘‘నేను ఏసీబీలో చాలా కీలక స్థానంలో పనిచేస్తున్నా. మా అబ్బాయి ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. అతనికి సీఆర్‌డీఏలో ఉద్యోగం ఇవ్వండి...’’ అని శోభన్‌బాబు గతంలో సీఆర్‌డీఏలో పని చేసి, ప్రస్తుతం పురపాలక శాఖలో పనిచేస్తున్న ఓ అధికారితో సంప్రదింపులు జరిపారు. ఇలా ... విజయవాడ వాణిజ్యపన్నుల శాఖ ఉపకమిషనర్ కార్యాలయం, ఖజానాశాఖలో రాష్ట్ర స్థాయి అధికారితో తరచూ సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది. ఇటీవల ఏసీబీకి పట్టుబడిన పాము పాండురంగారావుతో మాట్లాడి తనకు తెలిసిన ఓ డీఈని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి బదిలీ చేయాలని కోరారు. చనిపోయిన వ్యక్తి పేరిట సిమ్‌కార్డు శోభన్‌బాబు ఎక్కువగా వ్యక్తిగత ఫోన్ నెంబరునే వినియోగించేవారు. చనిపోయిన ఓ వ్యక్తి పేరిట సిమ్‌కార్డు తీసుకోవడం గమనార్హం. ఆయన వినియోగించిన వ్యక్తిగత ఫోన్ నెంబరు 86881 32957 గుంటూరు జిల్లాకు చెందిన ఈటుకూరి వేణు పేరిట ఉన్నట్లు విచారణలో తేలింది. వేణు 2013 ఆగస్టు 20వ తేదీనే మృతి చెందినట్లు దర్యాప్తులో గుర్తించారు. పలువురు అవినీతి అధికారుల సెల్‌ఫోన్లలో ఈ నెంబరు నమోదైంది. అప్పటి నుంచి...ఇప్పటి వరకూ 1989లో జూనియర్ స్టెనోగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన శోభన్‌బాబు దాదాపు తొమ్మిదేళ్లు విశాఖపట్నం ఏసీబీ రేంజిలోనే పనిచేశారు. 1997లో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఇక్కడే సీనియర్ అసిస్టెంట్‌గా, మేనేజర్‌గా పదోన్నతి పొంది రహస్య విభాగంలో పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఈ హోదాలోనే ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ అనుభవంతోనే ఆయన విశాఖపట్నం పరిధిలో పని చేసిన అధికారులతోనే తరచూ సంప్రదింపులు జరిపేవారు. 8 మంది అధికారులతో.. ఫోన్‌లో 275 సార్లుఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ 8 మంది అధికారులతో శోభన్‌బాబు గత ఏడాదిన్నర వ్యవధిలో 275 సార్లు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడారు. వీరిలో గతంలో తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎం.బాలప్రకాశ్‌తోనే ఆరు నెలల వ్యవధిలో 74 సార్లు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపల్‌గా పనిచేసిన వై.సత్యనారాయణతో 45 సార్లు, ఏసీబీలో ఫిర్యాదులున్న 21 మంది అధికారులతో 733 సార్లు మాట్లాడారు. ఈ జాబితాలో పురపాలక, వాణిజ్యపన్నులు, రహదారులు, భవనాలు, రవాణా, అటవీ, రిజిస్ట్రేషన్లు శాఖలోని వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ఉన్నారు. Quote
TampaChinnodu Posted December 4, 2017 Author Report Posted December 4, 2017 manalni evadu baagu seyyaledu. Quote
Demigod Posted December 5, 2017 Report Posted December 5, 2017 Welcome to the land of Nirvana... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.