Jump to content

South Korea City in Anantapur !


Recommended Posts

Posted
అనంతలో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ!
05-12-2017 03:39:45
 
636480419864425833.jpg
బీటీఎన్‌ కంపెనీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వైకిమ్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్‌ ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీని అనంతపురంలో ఏర్పాటు చేయడంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దక్షిణ కొరియా-ఇండియా మధ్య రూ.64405 కోట్ల(10 బిలియన్‌ డాలర్ల) ఆర్థిక సాయానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ సిటీని నిర్మించనున్నారు. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు స్మార్ట్‌సిటీపై ప్రతిపాదనలు అందించాలని బీటీఎన్‌ సంస్థకు సీఎం సూచించారు. అనంతరం పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూ సీబీతో సీఎం సమావేశమయ్యారు. ఇండియాలో ఎల్‌ఎన్‌జీ వాల్వ్‌ చెయిన్‌ బిజినెస్‌ పట్ల పోస్కో ఆసక్తి కనబరిచింది. ఉక్కు, రసాయనాలు, ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగాలతోపాటు కమోడిటీ ట్రేడింగ్‌లో పోస్కోకు విశేషానుభవం ఉంది. ఆ తర్వాత హ్యోసంగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జెజూంగ్‌లీతో సీఎం భేటీ అయ్యారు.
Posted
కొరియా పథం
రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో  ‘కొరియా నగరం’
మూడు దశల్లో రూ.10వేల కోట్ల పెట్టుబడి
తొలిరోజు కుదిరిన రెండు ఒప్పందాలు
అనంత, అమరావతిల్లో ‘లొట్టె’ పెట్టుబడులు
దక్షిణకొరియాలో పలుసంస్థలతో చంద్రబాబు భేటీ
ఈనాడు - అమరావతి
4ap-main4a.jpg

వ్యాంధ్రలో పెట్టుబడులకు దక్షిణకొరియాకు చెందిన పలు పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయి. మూడురోజుల పాటు ఆ దేశంలో పర్యటించడానికి సియోల్‌ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ దేశ అధికారులు, పలు పరిశ్రమలు ఘనస్వాగతం పలికాయి. పలు సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తొలిరోజు రెండు ఒప్పందాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటవనున్న కొరియా నగరం, కియాకు-విక్రేత సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రికి, రాష్ట్ర అధికారుల బృందానికి కియా కార్ల ప్రత్యేకతను సంస్థ అధికారులు వివరించారు. సోమవారం జరిగిన ప్రత్యేక విందులో కియా సీఈఓ హ్యూంగ్‌ కీన్‌ లీ, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు గ్యూన్‌ కిమ్‌ తదితరులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణకొరియా రెండో రాజధానిగా భావించి అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నారు. మీకు ఎలాంటి వ్యాపార అవరోధాలు తలెత్తవని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కొరియా ప్రాథమిక విద్యా వ్యవస్థపై తమ ప్రభుత్వం అధ్యయనం చేయదలిచిందన్నారు. కీన్‌ లీ మాట్లాడుతూ తమ సంస్థ విద్యుత్తు వాహనాల తయారీ కూడా ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం ఒక్కసారి ఛార్జి చేస్తే 170 కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలు తయారు చేశామని, దాన్ని సామర్థ్యం 200 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. అమరావతిలో విద్యుత్తు వాహనాలను వినియోగించనున్నామని, తమకు సహకరించాలని సీఎం కోరారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, ఎన్‌. అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌, పరిశ్రమలశాఖ  ప్రతినిధి ప్రీతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

4ap-main4b.jpg

తొలి రోజు
కొరియా నగరం: అనంతపురం జిల్లాలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. తొలిదశలో 700 ఎకరాలు సేకరిస్తారు. మూడుదశల్లో మొత్తం రూ.10వేల కోట్ల పెట్టుబడులకు 37 కొరియా సంస్థలు ముందుకొచ్చాయి. పారిశ్రామిక నగరం, టౌన్‌షిప్‌, నక్షత్రాల హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్‌కోర్సు లాంటివి ఏర్పాటు చేస్తారు. ప్రాథమికంగా 9వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. మూడుదశలయ్యేటప్పటికి 40 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో పలు కొరియా సంస్థలు అంగీకార పత్రాల (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)పై సంతకాలు చేశాయి. ఇక్కడ కనీసం వంద కొరియా సంస్థలు వస్తాయని అంచనా.
కియా విక్రేత సంస్థలు: కియాకు చెందిన 17 విక్రేత పరిశ్రమలు, ఏపీఐఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థలు ఇక్కడ రూ.4,995 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. 7,171 మందికి ఉపాధి లభించనుంది.
లొట్టె: 1.80 లక్షల మంది ఉద్యోగులున్న ఈ సంస్థ అతిపెద్దదైన వాటిల్లో 8వది. చాక్లెట్‌ తదితర రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చంద్రబాబుతో లొట్టె సీఈఓ వాంగ్‌ కాగ్‌ జు భేటీ అయ్యారు. అనంతపురం, అమరావతిలో హోటళ్లు, ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

4ap-main4c.jpg

దాసన్‌: దాసన్‌ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ నామ్‌ మెయిన్‌తో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి ఏపీ ఫైబర్‌నెట్‌పై ప్రదర్శన ఇచ్చారు.  ఫిబ్రవరిలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. భారత్‌లో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసింది.
జుసంగ్‌: ఇంధన రంగ ఉత్పత్తుల్లో ప్రసిద్ధ సంస్థ. సీఎంతో సీఈఓ వాంగ్‌ చుల్‌ జు భేటీ అయ్యారు. 2022కల్లా భారత్‌లో 100 గిగావాట్‌ల సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 3.4 గిగావాట్‌ల కేంద్రాలు భారత్‌లో ఉన్నాయి. నవశకం ఎల్‌ఈడీ బల్బుల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు వాంగ్‌ తెలపగా...ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
ఐరిటెక్‌: ఐరిస్‌ ఆధారిత సొల్యూషన్స్‌ సంస్థ సీఈఓ కిమ్‌ డెహోన్‌తో భేటీ. ఇప్పటికే రాష్ట్రంలో కలసి పనిచేస్తున్న ఐరిటెక్‌. ఈ నెల 10 తర్వాత రాష్ట్రానికి వస్తానన్న కిమ్‌ డెహోన్‌. ఏపీ ప్రభుత్వం అమలు చేయదలచిన భూదార్‌ను సీఎం వివరించారు.
పోస్కోదేవూ: భారత్‌లో ఎల్‌ఎన్జీ వాల్వ్‌ చెయిన్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు జుసీబో వెల్లడి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వివరించిన సీఎం.
హ్యోసంగ్‌: నైలాన్‌ పాలిస్టర్‌ రంగంలో అనుభవమున్న ఈ సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఆంధ్రాకు వస్తే ఏ రాష్ట్రం ఇవ్వలేనంత రాయితీలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
కోకమ్‌: ఎనర్జీ స్టోరేజీలో ప్రసిద్ధ సంస్థ. జీవితకాలం పనిచేసే అత్యాధునిక బ్యాటరీల తయారీపై పరిశోధనలు చేస్తున్నట్లు చంద్రబాబుకు ఆ సంస్థ సీఈఓ జేజే హాంగ్‌ వివరించారు. భారత్‌తో తమకు అనుబంధం ఉందని, కొరియా భాషలో పది శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని వెల్లడించారు.
హెనోల్స్‌ కెమికల్స్‌: ఆంధ్రాలో నీటిశుద్ది పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గెనెబోక్‌ కిమ్‌ ఆసక్తి. స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే పెయింట్‌ను కూడా తయారు చేసే ఈ సంస్థను విశాఖ భాగస్వామ్య సదస్సుకు సీఎం ఆహ్వానించారు. గ్రాన్‌ సియోల్‌ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.

 
Posted

inkenduku anantapur...

sappuda kakunta district peru andhra korea ani pettesthe aipotadi kada...

 

Posted
11 minutes ago, Android_Halwa said:

inkenduku anantapur...

sappuda kakunta district peru andhra korea ani pettesthe aipotadi kada...

 

korhra.. or andrea better name.

Posted
17 minutes ago, Android_Halwa said:

inkenduku anantapur...

sappuda kakunta district peru andhra korea ani pettesthe aipotadi kada...

 

tg anukunava erri puvvu la 31 districts cheyaniki??

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...