Kool_SRG Posted December 6, 2017 Report Posted December 6, 2017 పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే బాలయ్య - రవికుమార్ ల కాంబోలో `జై సింహా ` షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ కథా రచయిత చిన్ని కృష్ణ చెప్పిన కథ బాలయ్య కు నచ్చడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందిన వార్తలు వస్తున్నాయి. బాలయ్య హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన 'నరసింహనాయుడు` చిత్రం ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. 2001లో బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ కథను చిన్నికృష్ణ రాసుకున్నారట. అ కథను బాలయ్యకు వినిపించడంతో ఆయన కూడా ఓకే చెప్పారట. ఈ కథ బాగా నచ్చడంతో - తప్పకుండా సినిమా చేద్దామని బాలకృష్ణ అన్నారని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సీక్వెల్ పై అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశముంది. బహుశా ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య ఈ సినిమా ప్రారంభించవచ్చని ఫిల్మా నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. Quote
Kool_SRG Posted December 6, 2017 Author Report Posted December 6, 2017 ప్రముఖ కథా రచయిత చిన్ని కృష్ణ చెప్పిన కథ బాలయ్య కు నచ్చడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందిన వార్తలు వస్తున్నాయి. Chinni Krishna back anamaata.. Quote
aakathaai Posted December 6, 2017 Report Posted December 6, 2017 Aa rojul poinaai sinni gadu script ni jagratthaga fold chesi under arm lo ettukovachu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.