Jump to content

Recommended Posts

Posted
636483254545826827.jpg
మైసూర్: ఇన్నాళ్లు అక్కడ చిన్నారుల సందడి లేదు. బుడిబుడి నడకలు అసలే లేవ్. ఇన్నాళ్లకు ఆ బాధ తీరింది. మైసూర్ ప్యాలెస్‌కు కొత్త కళ వచ్చింది. మైసూర్ రాజవంశానికి నాలుగు వందల ఏళ్లనాటి శాపానికి విముక్తి లభించింది.
 
రాజులు, రాజ్యాల గురించి చెప్పే.. ప్రజాస్వామ్యంలో ఇంకా ఏంటని జోకులేసేవాళ్లున్నా.. రాజులకు సంబంధించిన ప్రతీ విషయం తెలుసుకునేందుకు మాత్రం ఉత్సాహం చూపించేవాళ్లు చాలామందే ఉంటారు. మైసూర్ రాజవంశం గురించి కూడా ఇప్పుడదే మాట్లాడుకుంటున్నారు. రాజ్యం సంగతి ఎలా ఉన్నా.. వాళ్ల వంశానికి శాపం ఉందని.. ఇన్నాళ్లకు అది తీరిందని అంటున్నారు.
 
ఒకటి కాదు.. రెండు కాదు.. 4 వందల సంవత్సరాలు. మైసూర్ వంశంలో ఏ ఒక్కరికి కూడా సంతానం కలగలేదు. ప్రతీసారి బంధువుల్లో ఒకరిని దత్తత తీసుకోవడం.. అతనికి పట్టాభిషేకం చేయడం.. పెళ్లి చేయడం ఇదే జరుగుతోంది. 4వందల ఏళ్లుగా ఆ ఇంట్లో చిన్నారుల సందడి లేదు. ఈసారి మాత్రం శాపం తొలగింది. మైసూర్ ప్యాలెస్‌లో ఇకపై చిన్నారి బోసినవ్వులు కనిపించబోతున్నాయ్.
 
మైసూరు రాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా దంపతులకు కుమారుడు జన్మించాడు. దీంతో రాజవంశంతో పాటు మైసూరు అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. యుదువీర్‌ దంపతులకు కుమారుడు జన్మించడంతో సుమారు 400 ఏళ్ల నాటి శాపానికి విముక్తి కలిగిందని మైసూరు రాజ కుటుంబ వర్గాలు చెప్తున్నాయ్. ఇన్నాళ్ల తర్వాత వారసుడు వస్తుండడంతో.. మైసూర్ రాజవంశీయులు ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.
 
2015 మేలో మైసూర్ రాజ్యానికి యుదువీర్ రాజుగా పట్టాభిషేకం చేశాడు. జూన్ 2016లో రాజ‌స్థాన్ యువ‌రాణి త్రిషికాతో వివాహం జరిగింది. ఒడియార్ రాజవంశానికి శాపవిముక్తి కలగబోతుందని.. వంశంలో కుమారుడు జన్మిస్తాడని పెళ్లి సమయంలో జ్యోతిషుల జోస్యం నిజమైంది. ఒడయార్ వారింటి కోడలు త్రిషికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
 
రాజులు, రాజ్యాల సంగతి ఎలా ఉన్నా.. శాపాల గురించి సినిమాల్లో, కథల్లో చూస్తాం అనుకున్నవాళ్లు కూడా.. ఒడయార్ వంశంలో జరిగింది చూసి ఆశ్చర్యపోతున్నారు. 4వందల ఏళ్ల తర్వాత ఆ ఇంటి కోడలుకు సంతానం కలగడం.. ఇది జరుగుతుందని ముందే జోస్యం వినిపించడం.. ప్రతీ ఒక్కరిని సర్ ప్రైజ్ చేస్తోంది.
 
ఇంతకీ మైసూర్ రాజవంశానికి ఉన్న శాపమేంటి ? నాలుగు వందల ఏళ్ల క్రితం శాపం పెట్టింది ఎవరు ? ఈ 4వందల ఏళ్లలో శాపం పెట్టినవాళ్లు చెప్పినట్లే జరిగిందా ? ఇక్కడితో శాపం విముక్తి జరిగినట్లేనా ? చరిత్ర చెప్తున్నదేంటి ?
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా మైసూర్ సంస్థానం పాలన కొనసాగింది. తర్వాత అది ఇప్పటి కర్ణాటక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అయితే మైసూర్‌లో రాజవంశీయుల ప్యాలెస్, వారి ధనం, దర్పం అన్నీ చెక్కుచెదరకుండా వున్నాయి. ప్రతీ దసరాకు విద్యుత్ వెలుగుల్లో ధగధగలాడే ప్యాలెస్ ఇప్పటికీ ప్రతీ ఒక్కరి మనసు దోచేస్తుంటుంది. అందంగా కనిపించే మైసూర్ ప్యాలెస్ లోలోపల దాగిన చాలా రహస్యాలు ఎవరికీ తెలియవు! 
4వందల ఏళ్లనాటి శాపం కారణంగా.. మైసూర్ వంశంలో ప్రతీ తరంలోనూ సింహాసనం అధిష్టించే వారసుడు లేక నానా తంటాలు పడ్డారు. అయితే ఇప్పుడు వారసుడు రావడంతో ఆ కష్టాలు తీరిపోయాయ్. నిజంగానే శాపవిముక్తి జరిగినట్లేనా.. ఇంకా పర్యవసానాలు ఏమైనా ఉండబోతున్నాయా.. అసలు 4 శతాబ్దాల క్రితం ఏం జరిగిందని తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు.
 
ఇది 400 సంవ‌త్సరాల క్రితం జ‌రిగిన కథ. 1399 నుంచి 1950 వ‌ర‌కు అంటే ఇండియా రిప‌బ్లిక్ అయ్యేంత‌ వ‌ర‌కు మైసూర్‌ను ఒడియార్స్ ఫ్యామిలీనే ప‌రిపాలించేది. అయితే.. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాన్ని ప‌రిపాలిస్తున్న తిరుమ‌ల రాజా రాజ్యాన్ని... మైసూర్‌ను ప‌రిపాలించే రాజా ఒడియార్ అన్యాయంగా లాక్కొన్నాడు. దీంతో కోపోద్రికురాలైన రాజు తిరుమ‌ల‌రాజా భార్య అల‌మేల‌మ్మ రాజా ఒడియార్ మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంది. త‌ర్వాత ఆమె రాజ్యం వ‌దిలేసి త‌న ఆభ‌రణాల‌ను తీసుకొని త‌ల‌కాడు అనే గ్రామానికి వెళ్లిపోయింది. ఆమెను బంధించేందుకు సైనికులు చుట్టుముట్టగా అలమేలమ్మ శాపం పెడుతుంది.
 
మైసూర్ రాజ్యం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌ద‌ని.. ఆ రాజ్యాన్ని ఏలే రాజుల‌కు పిల్లలు పుట్టరని... త‌ల‌కాడు ఎడారిలా మారుతుంద‌ని... యుక్త వ‌య‌సులోనే రాజులు చ‌నిపోతారని శ‌పించి కావేరీ న‌దిలో దూకింది అలమేల‌మ్మ. ఈ ఘ‌ట‌న జ‌రిగిన సంవ‌త్సరం 1612 అని చ‌రిత్రకారులు చెప్తున్నారు. అల‌మేల‌మ్మ శ‌పించిన‌ట్టుగానే త‌ల‌కాడు ఎడారిలా మ‌రిపోయింది. మైసూర్‌ను ఏలే రాజుల‌కు పిల్లల భాగ్యం క‌ల‌గ‌లేదు. ఇంకా.. యుక్త వ‌య‌స్సులోనే చాలా మంది ఒడియార్ రాజులు మ‌ర‌ణించారు. ఇదంతా అల‌మేల‌మ్మ శాపం ఫ‌లిత‌మేన‌ని భావించారు ఒడియార్ రాజులు.
 
బంధువుల‌లో ఎవ‌రో ఒక‌రిని ద‌త్తత తీసుకొని వారికి ప్రత్యేక పూజ‌లు నిర్వహించి మైసూరు రాజుగా ఇన్నాళ్లు ప‌ట్టాభిషేకం చేసేవారు. ప్రస్తుత రాజు యుదువీర్‌ను కూడా ద‌త్తత తీసుకున్నారు. అయితే ఇప్పుడు కుమారుడు పుట్టడంతో.. ఆ వంశానికి శాపవిముక్తి జరిగినట్లేనని కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు.
Posted

Antha matter chadavatam kashtam kani, glossary ga 2-3lines lo brief chey if u can :)

Posted
11 minutes ago, KABALI said:

Murari Cinema lekka undhi gaaa.....

Vuncle matter in two lines please

Posted
3 minutes ago, 4Vikram said:

Vuncle matter in two lines please

one line lo cheppina gaa UNCLE MUrari cinema ani....family curse...on offsprings of mysore royal family...now the curse is pacified it seems..

Posted
1 hour ago, KABALI said:

one line lo cheppina gaa UNCLE MUrari cinema ani....family curse...on offsprings of mysore royal family...now the curse is pacified it seems..

ohh nice happened to them, thanks Rajini thatha man 

Posted
Just now, 4Vikram said:

ohh nice happened to them, thanks Rajini thatha man 

OK ..muthaathaa...jejayyyaa.

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...