TampaChinnodu Posted December 13, 2017 Report Posted December 13, 2017 అవినీతిలో ఆజాదూ ఏసీబీకి పట్టుబడిన దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ ఏపీ, తెలంగాణల్లోని మొత్తం 18 చోట్ల ఏకకాలంలో సోదాలు అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ.150 కోట్లపైనే సోదరుడు, కారుడ్రైవర్... అతడి బంధువులే బినామీలు సౌరవిద్యుత్తు ప్లాంట్లపై రూ.కోట్ల పెట్టుబడులు అవినీతిలో ఆరితేరి కోట్లకు పడగలెత్తాడు. సోదరుడిని, కారు డ్రైవర్‌ను, బంధువులను బినామీలుగా పెట్టుకున్నాడు. సౌర విద్యుత్తు ప్లాంటుపై రూ.కోట్లల్లో పెట్టుబడులు పెట్టాడు. పనిచేసిన ప్రతిచోటా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. చివరకు అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కాడు. ఆయనే కాకినాడ మల్టీ జోన్-1 దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం చంద్రశేఖర్ ఆజాద్. ఈనాడు - అమరావతి చరాస్తులిలా... * గృహోపకరణాలు: రూ.10 లక్షలు * ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాలో: రూ.1.25 లక్షలు * బ్యాంకులో నిల్వ: రూ.5 లక్షలు * రికరింగ్ డిపాజిట్లు: రూ.6 లక్షలు దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం చంద్రశేఖర్ ఆజాద్ ఇళ్లపై మంగళవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఏసీబీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు ఏలూరు రేంజికి చెందిన ప్రత్యేక బృందాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మొత్తం 18 చోట్ల సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరు, రాజమహేంద్రవరం, అనంతపురంజిల్లా ఉబిచర్లలోని ఆజాద్ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లపైన దాడులు జరిపాయి. ఈ సందర్భంగా మార్కెట్‌విలువ ప్రకారం రూ.150కోట్ల అక్రమాస్తులను గుర్తించాయి. విజయవాడలోని సోదరుడి నివాసంలో ఆజాద్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు అక్కడి నుంచి రాజమహేంద్రవరంలో ఆయనుండే నివాసానికి తరలించారు. అక్కడ కనీసం మంచం కూడా లేకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది. ఇటీవల దేవాదాయశాఖ సహాయకమిషనర్ విజయరాజు పట్టుబడిన నేపథ్యంలో తనపై కూడా దాడులు చేసే అవకాశం ఉందన్న భావనతో ముందే అప్రమత్తమయ్యారని, అందుకే నగదు, బంగారం వంటివి చిక్కకుండా జాగ్రత్తపడినట్లు ఏసీబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. * ఆజాద్... తన సోదరుడు శీలం దేవివివేకానందతో పాటు తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసే మర్రాపు సాంబశివరావు... ఇతని బంధువులు సిరికొండ సత్యవతి, అవలరెడ్డి లక్ష్మణరావు, అవలరెడ్డి రంగమ్మ, మిరియాల విజయభానులును బినామీలుగా పెట్టుకున్నాడు. తెల్లరేషన్‌కార్డులు కలిగిన వీరంతా పనిమనుషులుగా, రోజుకూలీలుగా పనిచేస్తూ కుటుంబపోషణ చేసుకునే వారు. వీరి పేరిట అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఉబిచర్లలో 32.1 ఎకరాలు కొనుగోలు చేశాడు. దీని పుస్తకవిలువ రూ.17.16 లక్షలు. * ఆజాద్ తండ్రి కోటిలింగం విజయవాడ ఆటోనగర్ సమీపంలో ఆటోమొబైల్ మరమ్మతు కార్మికుడిగా పనిచేసే వారు. 1986లో 2000 చదరపు గజాలుండగా అందులో 400 చదరపు గజాలు ఈయనకు వచ్చింది. ఇతరత్రా ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 2000లో ఆయన సహాయకమిషనర్‌గా చేరారు. ఈ ఉద్యోగం రాకముందు వారంతా చిన్నచిన్న పనులు చేసుకునేవారు. ఇదే విషయాన్ని పార్టిషన్ డీడ్‌లో కూడా రాయించుకున్నారు. ఆ తర్వాత 17ఏళ్ల వ్యవధిలో ... ప్రధానంగా 2012-15 మధ్య భారీగా అక్రమాస్తులను కూడబెట్టారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ ఆలయాల్లో కార్యనిర్వాహక అధికారిగా పనిచేశారు. * ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఆజాద్ సోదరుడు దేవివివేకానంద 2008లో డేర్ టూ డ్రీమ్ సంస్థ పేరిట స్థిరాస్తి వ్యాపారం నిర్వహించినట్లు తేలింది. 2012లో అభేద్య పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థను కూడా ప్రారంభించారు. అనంతపురంజిల్లా నల్లచెరువు మండలం ఉబిచర్లలో బినామీల పేరిట కొన్న భూమిని తన పేరిట మార్పించుకుని సౌరవిద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేశారు. కెనరా బ్యాంకు నుంచి రూ.3 కోట్లు రుణం తీసుకున్నారు. ఆజాద్‌సహా కుటుంబసభ్యులు అందరూ కలిసి రూ.18 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. * తరచూ కుటుంబసభ్యులతో విదేశీ విహారాలకు వెళ్లేవాడు. గత మూడేళ్లలో దాదాపు 60రోజుల పాటు ఆజాద్ విదేశాల్లోనే గడిపినట్లు తేలింది. 2015 ఏప్రిల్ 30-మే 23 మధ్య ఐరోపా దేశాలకు, ఈ ఏడాది మే 12-27 మధ్య చైనా, మలేషియాల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగపూర్‌కు కూడా వెళ్లినట్లు గుర్తించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారా? అనేదానిపైన ఆరాతీస్తున్నారు. * విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయాల్లో పనిచేసినప్పుడు వచ్చిన అభియోగాలపై విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం విచారణ జరిపి అతనికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం అతనిపై ఆరు శాఖాపరమైన విచారణలు జరుగుతున్నాయి. శ్రీశైలం దేవస్థానంలో ఇంజినీరింగ్ సిబ్బందికి అక్రమ పదోన్నతులు ఇచ్చారని, కాకినాడ కేంద్రంగా ఉన్న ప్రాంతీయ సంయుక్తకమిషనర్ కార్యాలయాన్ని తన వ్యక్తిగత అవసరాలకు రాజమహేంద్రవరానికి మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. గుర్తించిన అక్రమాస్తులు ఇవే... * విజయవాడలోని గుణదలలో 404 చదరపు గజాల్లో 2128 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో భవనం, గొల్లపూడిలో 606 చదరపుగజాల్లో జీ ప్లస్ 2 భవనం, పెనమలూరులో 200.44 చదరపుగజాల ఇంటి స్థలం, కంకిపాడు మండలం గొడవర్రులో 0.30 సెంట్ల వ్యవసాయ భూమి. * హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారంలోని నూతన్ రమ్య అపార్ట్‌మెంటులో 665 చదరపు అడుగుల ఫ్లాటు, దిల్‌సుఖ్‌నగర్‌లో 1735 చదరపు అడుగుల ఫ్లాటు. ఆర్‌జేసీ అరెస్టు.. ఏలూరులో విచారణ ఏలూరు, న్యూస్‌టుడే: దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్తకమిషనర్(ఆర్‌జేసీ) చంద్రశేఖర్ ఆజాద్‌ను రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మంగళవారం అరెస్టు చేసిన అధికారులు రాత్రి 10గంటల సమయంలో పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులోని అనిశా కార్యాలయానికి తీసుకువచ్చారు. డీఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సీఐ యూజీఏ విల్సన్ ఆయనను విచారిస్తున్నారు. బుధవారం కొన్ని బ్యాంకు లాకర్లను తెరిచాక ఆస్తుల వివరాలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. Quote
TampaChinnodu Posted December 13, 2017 Author Report Posted December 13, 2017 Dec 13, 2017, 02:09 IST విద్యాధరపురంలో ఆజాద్ బంధువు ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ సీఐ, ఆజాద్ దేవాదాయశాఖలో ఆ‘జాదు’ ఆస్తులు.. రూ.50 కోట్లపైనే 18 చోట్ల 21 ఏసీబీ బృందాల దాడి ‘అధర్మా’దా యం కూడబెట్టారన్న అభియోగంపై దేవాదాయశాఖ రాజ మహేంద్రవరం రీజనల్ జాయిం ట్ కమిషనర్(ఆర్‌జేసీ) శీలం సూర్యచంద్రశేఖర్ ఆజాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, బినామీ లకు చెందిన ఆస్తులపై 18 చోట్ల ఏసీబీ 21 బృందా లతో ఆకస్మిక సోదాలు జరిపింది. హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపి బ్యాంక్ పాస్ పుస్తకాలు, రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్‌కు రూ.50 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఏసీబీ ఏలూరు డీఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. ఆజాద్‌ను మంగళవారం రాత్రి ఏలూరులోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా 2000లో బాధ్యతలు చేపట్టిన ఆజాద్ శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేశారు. ఆజాద్ పేరిట విజయవాడ గుణదలలో రూ.2 కోట్ల విలువైన భవనంతోపాటు హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారంలో న్యూటన్స్ రమ్య అపార్టుమెంట్‌లో ప్లాట్, భార్య పేరుతో దిల్‌సుఖ్‌నగర్‌లో ప్లాట్ ఉన్నాయి. ఆజాద్ ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి సామగ్రిని గుర్తించారు. రూ. 18 కోట్లతో సోలార్ పవర్‌ప్లాంట్ ఆజాద్ తన కుటుంబ సభ్యుల పేరుతో అనంతపురం జిల్లా ఊబిచర్లలో 32.1 ఎకరాల్లో ఆబేధ్య సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు. ఆజాద్ సోదరుడు వివేకానంద వద్ద డ్రైవర్‌గా పనిచేసే సాంబశివరావు, ప్లాంట్‌లో పనిచేస్తున్న లక్ష్మణరావు, రంగమ్మల పేరుతో రైతుల నుంచి 36.63 ఎకరాలను కొనుగోలు చేసి తర్వాత వివేకానంద పేరుపై బదిలీ చేయించుకున్నారు. ఆ భూముల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అలాగే ఆజాద్ విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆజాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. దాడుల్లో రాజమహేంద్రవరం ఏసీబీ సీఐ సూర్య మోహనరావు, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Quote
Demigod Posted December 13, 2017 Report Posted December 13, 2017 చంద్రశేఖర్ ఆజాద్ anduke chinnapude names pettakudadu... Quote
TampaChinnodu Posted December 13, 2017 Author Report Posted December 13, 2017 7 minutes ago, Demigod said: చంద్రశేఖర్ ఆజాద్ anduke chinnapude names pettakudadu... Freedom fighter peru pettukoni devudi sommu kottesadu Quote
TampaChinnodu Posted December 13, 2017 Author Report Posted December 13, 2017 ilanti employees vunnnatha varaku nippu CBN enni dash board lu , realtime governance ani pedda pedda monitor lu pettina , tax payers dabbulu dandaga thappite paisa labam ledu Quote
SonyKongara Posted December 13, 2017 Report Posted December 13, 2017 3 hours ago, TampaChinnodu said: ilanti employees vunnnatha varaku CBN enni dash board lu , realtime governance ani pedda pedda monitor lu pettina , tax payers dabbulu dandaga thappite paisa labam ledu Quote
perugu_vada Posted December 13, 2017 Report Posted December 13, 2017 Odiyamma ah aasthula count enti asalu 1c earn cheyali ante naana sankalu naakithe kani kudaradhu , e pundakor gallu sunaayaasam ga earn chesestunaru ga Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.