SonyKongara Posted December 14, 2017 Report Posted December 14, 2017 ఈ డిజైన్‌కే అత్యధికుల మొగ్గు 250 అ. ఎత్తు..750 అ. వెడల్పు ప్రజాభిప్రాయం కోసం డిజైన్లు నేటి సాయంత్రం వరకూ నెట్‌లో అభిప్రాయం చెప్పొచ్చు ఆ వెంటనే తుది ఎంపిక అమరావతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ కోసం నార్మన్ ఫోస్టర్ రూపొందించిన టవర్ డిజైన్‌వైపే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ కోసం ఇచ్చిన రెండు డిజన్లలో పొడవాటి సూదిమొన ఆకారంలోని టవర్ డిజైన్ ఒకటి. అయితే ప్రజాభిప్రాయానిదే తుదిమాట కావాలన్న సీఎం చంద్రబాబు, ఆ 2 డిజైన్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, వారి అభిమతాన్ని తెలుసుకుని, తదనుగుణంగా నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. గురువారం వరకూ ఇంటర్‌నెట్‌లో అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత, సాయంత్రం మరొకసారి సమావేశమై, అసెంబ్లీకి ఫైనల్ డిజైన్ ఖరారు చేస్తారు. ఆ వెంటనే టెండర్ ప్రక్రియను చేపట్టి, నిర్మాణ పనులనూ త్వరగా మొదలయ్యేలా చూసి, 2019 కల్లా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బుధవారం నిర్వహించిన ఏపీసీఆర్డీయే 13వ సమావేశంలో డిజైన్లపైనే ప్రధానంగా చర్చ సాగింది. టవర్ డిజైన్‌కే నూటికీ 99 శాతం మంది ఓటేశారు. దర్శకుడు రాజమౌళి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ, హైకోర్టు తదితరాల డిజైన్ల తయారీ ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకుంటున్న రాజమౌళి ఈ భేటీలో కీలక సూచనలు చేశారు. రాజమౌళి త్రీడీ చిత్రాలతో అందించిన చతురస్రాకార డిజైన్‌ను కూడా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సీఆర్డీయేకు చెందిన వెబ్‌సైట్, ట్విట్టర్, యూట్యూబ్‌లో ఉంచాలని చంద్రబాబు అధికారులతో చెప్పారు. ఉడతలాంటి వాడిని: రాజమౌళి ‘రామసేతు నిర్మాణంలో పాలుపంచుకున్న వేలాదిమంది వానరవీరులతోపాటు తన శక్తికొలదీ తోడ్పడిన ఉడుత’లా అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నట్లు దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. డిజైన్ల తయారీ ప్రక్రియలో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత ఇంతవరకూ విలేకరులతో మాట్లాడని రాజమౌళి బుధవారం మధ్యాహ్నం మాత్రం ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో ముచ్చటించారు. ‘నా కృషితో డిజైన్ల ప్రక్రియ వేగం పుంజుకుందని కొందరంటున్నారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. ఈ భగీరథ ప్రయత్నంలో ఎందరో అవిరళ కృషి సాగిస్తున్నారు. నేను చేసిందల్లా అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఏ విధంగా రూపుదిద్దుకోవాలని సీఎం ఆకాంక్షిస్తున్నారనే విషయాన్ని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో స్పష్టంగా చెప్పడమే. ఫోస్టర్‌కు స్పష్టమైన అవగాహన వచ్చేందుకు మన సంస్కృతి, వారసత్వాలకు నిదర్శనాలుగా నిలిచే రాచరిక చిహ్నాలు, పూర్ణకుంభం, పురాతన నాణేలు, నెమలి ఈకలతోపాటు మనది సన్‌రైజ్ స్టేట్ అయినందున ఉదయించే సూర్యుడు చిత్రం వంటివి అందజేశా. అసెంబ్లీ సెంట్రల్ హాలులో తెలుగుతల్లి రమణీయ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దానిపై సూర్యుడి కిరణాలు పడేలా చేయాలని సూచించా’ అని తెలిపారు. 11 లక్షల చదరపు అడుగులు! విశేష మద్దతు పొందుతున్న టవర్ డిజైన్‌లో అసెంబ్లీ భవంతి 750 చదరపు అడుగుల వెడల్పు కలిగి ఉండాలని ప్రతిపాదించారు. సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.210 అడుగుల వద్ద వాచ్ టవర్‌ను నిర్మించి, అక్కడి నుంచి ప్రజలు రాజధాని మొత్తాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. తెలుగువారి సంస్కృతి, భాష, వారసత్వం, ఘన చరిత్ర ఇత్యాది అంశాలకు అద్దం పట్టే మ్యూజియంను ఈ టవర్‌లో ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ప్రత్యేకతలతో కూడిన నిర్మాణం ప్రపంచంలో ఇదేనని ఫోస్టర్ ప్రతినిధులు తమ ప్రజెంటేషన్ సందర్భంగా పేర్కొన్నారు. హైకోర్టు కోసం ఇప్పటికే ఆమోదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచి ఈ సమావేశంలో ప్రదర్శించారు. పరిపాలనా నగరపు మాస్టర్ ప్లాన్‌లోనూ కొన్ని మార్పులు చేశారు. అమరావతి నిర్మాణంపై వివిధ అంశాలపై నిపుణులతో విజయవాడలో గురు, శుక్రవారాల్లో భారీ వర్క్ షాపు నిర్వహిస్తున్నామని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. హైకోర్టు అంతర్గత స్వరూపంపై ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలు, అసెంబ్లీ ఫంక్షనల్ స్ట్రక్చర్‌పై స్పీకర్, ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ నిర్మాణాలను ఎట్టి పరిస్థతుల్లోనూ 2019కల్లా పూర్తి చేస్తామన్నారు. డిజైన్ల ప్రక్రియలో అసాధారణ జాప్యం జరిగిందన్న విమర్శలను తోసిపుచ్చారు. Quote
SonyKongara Posted December 14, 2017 Author Report Posted December 14, 2017 ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం ఆకృతి దాదాపు ఖరారైంది. భవనంపై సూది మొనలాంటి (సైక్) పొడవైన టవర్‌తో సిద్ధం చేసిన ఆకృతి ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ చతురస్రాకారంలో, భవనంపై ఎత్తైన టవర్‌తో రూపొందించిన రెండు ఆకృతుల్ని మరింత మెరుగుపరిచి తీసుకువచ్చింది. వీటిపై సుదీర్ఘంగా చర్చించారు. సినీదర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. రెండు ఆకృతుల వీడియో చిత్రాలను సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోను, సామాజిక మాధ్యమాల్లోను ఉంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గురువారం సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి తుదినిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఎక్కువ మంది నుంచి స్పందన రాకపోతే, శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ విలేఖరులకు తెలిపారు. హైకోర్టు, శాసనసభ భవనాలను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. దేనికదే ప్రత్యేకం..! శాసనసభ భవనానికి సంబంధించి చతురస్రాకార భవనాన్ని తెలుగువారి ఘనచరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కలబోస్తూ...టవర్ ఆకృతిని నవ్యతకు అద్దంపట్టేలా రూపొందించారు. * సూది మొన ఆకృతిలో రూపొందించిన భవనం ఎత్తు టవర్‌తో కలిపి 250 మీటర్లు ఉంటుంది. వెడల్పు కూడా అంతే. చుట్టూ ఉన్న తటాకంలో దీని ప్రతిబింబం కనపడుతుంది. ఈ టవర్‌లో 70 మీటర్ల ఎత్తు వరకు (70 అంతస్తులు) సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడొక వ్యూయింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. * చతురస్రాకారపు భవనం కుఢ్యాలపై దర్శకుడు రాజమౌళి అందజేసిన త్రీ డైమెన్షన్ చిత్రాలు పెద్ద పరిమాణంలో కనిపించేలా తీర్చిదిద్దారు. నాలుగు పక్కల నుంచి చూస్తే ఉదయిస్తున్న సూర్యుడు, పురివిప్పిన నెమలి, బౌద్ధచక్రం... నాట్యం, సంగీతం, మూలల నుంచి చూస్తే ఏనుగు, లేపాక్షి బసవన్న, మన శిల్పసంపదను ప్రతిబింబించే చిత్రాలు కనపడతాయి. * శాసనసభ భవనం సెంట్రల్‌హాల్‌లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. సూర్యకిరణాల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతారు. * హైకోర్టుకు సంబంధించి రూపొందించిన బౌద్ధ స్థూపాకార ఆకృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ వెళ్లినప్పుడు కొన్ని మార్పులు సూచించారు. దానికనుగుణంగా మార్చి తీసుకువచ్చారు. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, న్యాయమూర్తులకు ఈ సంస్థ ప్రతినిధులు దానిని వివరించి ఆ ఆకృతికి వారి నుంచి అనుమతి తీసుకుంటారు. రామసేతువు నిర్మాణంలో ఉడత పాత్ర నాది: రాజమౌళి అమరావతి ఆకృతుల రూపకల్పనలో పాలుపంచుకోవడం మీకెలా అనిపిస్తోందన్న విలేకరుల ప్రశ్నకు సినీదర్శకుడు రాజమౌళి స్పందిస్తూ...‘‘రామసేతువు నిర్మాణంలో వందలసంఖ్యలో వానరసైన్యం పాల్గొన్నా... వారందరి పేర్లూ ఎవరికీ తెలియవు. ఉడత పేరే అందరికీ తెలుస్తుంది. నా పరిస్థితి కూడా అదే...’’ అని పేర్కొన్నారు. అమరావతిపై తాను లఘుచిత్రం ఏదీ రూపొందించడం లేదని స్పష్టం చేశారు. ‘‘రాజధాని ఆకృతులకు నేను మూడుదశల్లో సలహాలు, సూచనలు అందజేశాను. తెలుగువారికి గర్వకారణంగా, నిరుపమానంగా, దిగ్గజ భవనంలా, భారతీయత ఉట్టిపడేలా, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సీఎం చెప్పడంతో నేను ఒక అధికారిక డాక్యుమెంట్ తయారుచేశాను. నాకు అందించిన చిత్రాల్లో తెలుగువారికి ఇంత గర్వపడే గొప్ప చరిత్ర ఉందా? అని సందర్శకులు ఆశ్చర్యపడేలా కొన్నింటిని ఎంపిక చేశాం. శాసనసభకు టవర్ ఆకృతిని ఎంపిక చేస్తే, ఈ చిత్రాలను మీడియా లేదా కల్చరల్ సిటీల్లో నిర్మించే భవనాలకు వినియోగిస్తారని అనుకుంటున్నాను. టవర్ ఆకృతికి నేను ఇచ్చిన సలహాలేమీ లేవు...’’ అని వివరించారు. Quote
SonyKongara Posted December 14, 2017 Author Report Posted December 14, 2017 ప్రపంచబ్యాంకు రుణానికి మార్గం సుగమం అమరావతి నిర్మాణంలో అభ్యంతరాలపై ‘లోతైన దర్యాప్తు’నకు ఆర్నెల్ల విరామం ఈనాడు అమరావతి: అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం మంజూరు దిశగా ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుపై కొందరు రాజధాని ప్రాంత రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మరింత లోతైన దర్యాప్తు అవసరమా? లేదా? అన్న అంశంలో తన సిఫార్సుల్ని ఆర్నెల్లపాటు వాయిదా వేయాలని ప్రపంచబ్యాంకు తనిఖీ విభాగం నిర్ణయించింది. దీన్ని మంగళవారం జరిగిన ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో, వారి ఆందోళనలు తొలగించే దిశగా తాము మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రపంచబ్యాంకు యాజమాన్యం ఇటీవల తనిఖీ విభాగానికి తెలియజేసింది. అందుకే దర్యాప్తుపై తమ సిఫార్సుల్ని ఆర్నెల్లు వాయిదా వేయాలని అది నిర్ణయం తీసుకుంది. అప్పటి లోగా రుణం మంజూరుకి సంబంధించిన ప్రక్రియలన్నీ యథావిధిగా కొనసాగుతాయని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. అమరావతికి తొలి దశలో ప్రపంచబ్యాంకు సుమారు రూ.3200 కోట్లు రుణం ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు వల్ల తమ జీవనోపాధి పోతోందని, పర్యావరణానికి హాని జరుగుతోందని, రుణం మంజూరు ప్రక్రియ ప్రపంచబ్యాంకు పర్యావరణ, సామాజిక విధానాలకు అనుగుణంగా జరగడం లేదని రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు తనిఖీ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ విభాగ ప్రతినిధులు సెప్టెంబరు 12 నుంచి 15 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించి ఫిర్యాదుదారులు, రాజధానికి అనుకూలంగా ఉన్న రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సెప్టెంబరు 27న ప్రపంచబ్యాంకు బోర్డుకి ఒక నివేదిక అందజేశారు. ఫిర్యాదుదారుల అభ్యంతరాలపై, ముఖ్యంగా పునరావాసానికి సంబంధించి వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. నవంబరు 27న బ్యాంకు యాజమాన్యం తనిఖీ విభాగానికి తమ వివరణ తెలియజేసింది. రైతుల ఆందోళనల పరిష్కారానికి మరిన్ని చర్యలు చేపడతామని తెలిపింది. అందుకే తనిఖీ విభాగం ప్రపంచబ్యాంకు బోర్డుకి తాజాగా మరో నివేదిక అందజేసింది. బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందామని, లోతైన దర్యాప్తు జరపాలన్న తమ సిఫార్సుని ఆర్నెల్లు వాయిదా వేస్తున్నామని తెలిపింది. Quote
SonyKongara Posted December 14, 2017 Author Report Posted December 14, 2017 ప్రపంచంలో ఎత్తయిన వాటిల్లో మూడోది సమగ్ర పరిశీలన తర్వాతే అసెంబ్లీ భవనం ఆకృతి రూపకల్పన ఈనాడు, అమరావతి: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాల్లో అమరావతి శాసనసభ భవనం మూడోది కానుంది. ప్రఖ్యాత నిర్మాణాలను పరిశీలించిన నిపుణులు అదే స్థాయిలో ఏపీ అసెంబ్లీ భవన ఆకృతిని రూపొందించారు. లండన్‌లో ది షార్డ్ టవర్‌ను 308 మీటర్ల ఎత్తులో 95 అంతస్థులతో...ప్యారిస్‌లోని సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్‌పై 301 మీటర్ల ఎత్తులో ఈఫిల్ టవర్‌ను నిర్మించారు. ఇప్పుడు భారత్‌లోని అమరావతిలో 250 మీటర్ల ఎత్తులో శాసనసభ భవనం టవర్ నిర్మాణ ఆకృతిని రూపొందించారు. Quote
jalamkamandalam Posted December 14, 2017 Report Posted December 14, 2017 Okatemo lechina mrodda laaga vundhi. Inkotemo adukkunevaadi chippa laaga vundhi. Well done. Quote
Vintha Posted December 14, 2017 Report Posted December 14, 2017 15 minutes ago, jalamkamandalam said: Okatemo lechina mrodda laaga vundhi. Inkotemo adukkunevaadi chippa laaga vundhi. Well done. edupu shuru chesara velli Janna U, P tinandi santistaru. mushti M k's Quote
Odale Posted December 14, 2017 Report Posted December 14, 2017 1 hour ago, jalamkamandalam said: Okatemo lechina mrodda laaga vundhi. Inkotemo adukkunevaadi chippa laaga vundhi. Well done. Aithe velli @Raithu_Mradda @good Quote
Raithu_bidda_ Posted December 14, 2017 Report Posted December 14, 2017 Ae tsunami aa vachi ee lk nakka nd lokesh ni tiskupothe podhi Quote
WigsandThighs Posted December 14, 2017 Report Posted December 14, 2017 Peddha peddha kattadalu vigrhalu kaadhu ra howle capital ante..mansunna manushulu..kula matha bedhalu leni janalu like hyd..which amar sathi doesn’t have..all u have is K Dogs Quote
Kona Posted December 14, 2017 Report Posted December 14, 2017 5 minutes ago, WigsandThighs said: Peddha peddha kattadalu vigrhalu kaadhu ra howle capital ante..mansunna manushulu..kula matha bedhalu leni janalu like hyd..which amar sathi doesn’t have..all u have is K Dogs Ltt Quote
futureofandhra Posted December 14, 2017 Report Posted December 14, 2017 43 minutes ago, WigsandThighs said: Peddha peddha kattadalu vigrhalu kaadhu ra howle capital ante..mansunna manushulu..kula matha bedhalu leni janalu like hyd..which amar sathi doesn’t have..all u have is K Dogs Avunu correct matham tho kottukovadam Varsham vastey nillu vundatam Before CBN Hyderabad was nothing Please keep showing hatred Amaravati will be top 5 city Cry looking at those buildings Quote
jalamkamandalam Posted December 14, 2017 Report Posted December 14, 2017 46 minutes ago, futureofandhra said: Avunu correct matham tho kottukovadam Varsham vastey nillu vundatam Before CBN Hyderabad was nothing Please keep showing hatred Amaravati will be top 5 city Cry looking at those buildings Please spend some time looking at the history of Hyderabad in youtube. Nizam was having a fleet of RollsRoyce Cars in early 19th Century. Hyderabad was the richest province of British India. Please update bro. I know you people feel like Kings while you are with your caste friends studying in caste infected colleges of Coastal AP. Quote
futureofandhra Posted December 14, 2017 Report Posted December 14, 2017 17 minutes ago, jalamkamandalam said: Please spend some time looking at the history of Hyderabad in youtube. Nizam was having a fleet of RollsRoyce Cars in early 19th Century. Hyderabad was the richest province of British India. Please update bro. I know you people feel like Kings while you are with your caste friends studying in caste infected colleges of Coastal AP. Lol development gurinchi matladithey caste endhuku vastundi Nizam is worst vadu car lo tirigithey enti enni attrocities chesadu vadni malli goppa Ani cheppadam Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.