Ara_Tenkai Posted December 15, 2017 Report Posted December 15, 2017 టీవీ ప్రాంక్ పేరుతో హత్య..! కిమ్ జొంగ్ దిమ్మతిరిగిపోయే మర్డర్ ప్లాన్ శత్రుదేశాలకు పరోక్ష హెచ్చరికలు ఇంటర్నెట్‌డెస్క్: మనం పార్క్‌లో నడుస్తుంటాం.. హఠాత్తుగా ఒకరు వచ్చి మనపై నీళ్లు పోస్తారు.. మనకు కోపం వచ్చి వాడిని పట్టుకొనేలోపు కెమేరాతో ఓ నలుగురు మన ముందుకు వచ్చి ‘ప్రాంక్’ అని సర్దిచెబుతారు. తర్వాత అందరూ కలిసి నవ్వుతూ కెమేరాకు పోజులిస్తారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంక్‌ల గొడవ పెరిగిపోయింది. ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌జోంగ్ ఉన్ తనకు ఉన్న అడ్డుతొలగించుకోవడానికి ఈ ప్రాంక్ ఐడియాను వాడుకొని అమాయకులతో హత్య చేయించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కొన్నినెలల క్రితం మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌జోంగ్ సవతి సోదరుడు కిమ్‌జోంగ్ నామ్ హత్యకు గురయ్యాడు. ఇద్దరు మహిళలు అతని ముఖంపై చల్లిన నూనెను పోలిన రసాయినాల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు శవపరీక్షల్లో తేలింది. ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు ఇద్దరు స్థానిక మహిళల్ని, మరో వ్యక్తిని, ఉత్తరకొరియా దౌత్య సిబ్బందిని, ఎయిర్‌లైన్స్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో వారికి దిమ్మతిరిగిపోయే వాస్తవాలు తెలిశాయి. వూహకందని ప్లాన్.. ఈ హత్య చేసేందుకు కిమ్ ఏజెంట్లు స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళలను ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఒకరు మసాజ్ పార్లర్‌లో పనిచేసే యువతి కాగా.. మరొకరు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్నారు. తాము ఒక టీవీ ప్రాంక్ చేస్తున్నట్లు కిమ్ ఏజెంట్లు ఈ మహిళలను నమ్మించారు. ఈ ప్రాంక్‌లో నటిస్తే 90 డాలర్లు ఇస్తామని.. టీవీలో కనిపించే అవకాశం కూడా వస్తుందని ఆ మహిళలకు ఆశపెట్టారు. దీంతో వారు అంగీకరించారు. వీరికి నూనె వంటి పదార్థాన్ని ఇచ్చి కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో కిమ్ జోంగ్ నామ్ ముఖంపై వేసి వెళ్లిపోవాలని చెప్పారు. వీరిని మరో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా అనుసరించారు. ప్లాన్ ప్రకారం ఆ మహిళలు కిమ్ జోంగ్ నామ్ ముఖంపై ఆ రసాయనాలను పూసి డిపార్చర్ గేటు నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఆ రసాయనాల ప్రభావంతో కిమ్ సోదరుడు నామ్ ఆస్పత్రిలో కన్నుమూశాడు. అతడిపై ప్రయోగించింది వీఎక్స్ అనే రసాయనమని ఆ తర్వాత తేలింది. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి సదరు మహిళలను అదుపులోకి తీసుకున్నాయి. రసాయనాన్ని ఉపయోగించిన ఇద్దరు మహిళలూ సురక్షితంగానే ఉన్నారు. ఇదే దర్యాప్తు సంస్థలకు అర్థంకాలేదు. హత్యకు నిజంగా వీఎక్స్‌ను వినియోగిస్తే వీరూ చనిపోవాలి. కానీ అలా జరగలేదు. రెండు రసాయనాలు కలిపి..! దీంతో దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా పరిశోధన జరిపాయి. వీరికి అవాక్కయ్యే విషయం ఒకటి తెలిసింది. ఈ హత్యకు ‘బైనరీ ఫామ్’ అనే వ్యూహాన్ని వాడినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలకు చెరో రకం రసాయనాన్ని ఇచ్చారు. వీటిని కిమ్ జోంగ్ నామ్ ముఖంపై వేయగానే ఈ రెండు కలిసి వీఎక్స్‌గా మారి అతని ప్రాణాలు తీశాయి. హత్య చేసిన వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. బహిరంగంగానే ఎందుకు.. కిమ్ జోంగ్ నామ్‌ను బహిరంగంగా హత్య చేయడం వెనుక కూడా పెద్ద వ్యూహం ఉంది. తమ వద్ద రసాయన ఆయుధాలు కూడా ఉన్నాయని దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లకు పరోక్ష హెచ్చరికలు పంపడమే దీని లక్ష్యం. హత్య అనంతరం ఉపయోగించిన రసాయనాన్ని ఎలాగూ కనుగొంటారు.. దీన్ని తెలుసుకొని శత్రువు భయపడతారనేదే కిమ్ లక్ష్యమని సీఐఏ విశ్లేషించింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.