ye maaya chesave Posted December 23, 2017 Report Posted December 23, 2017 చిత్రం : ‘హలో’ నటీనటులు: అక్కినేని అఖిల్ - కళ్యాణి ప్రియదర్శన్ - జగపతిబాబు - రమ్యకృష్ణ - అనీష్ కురువిల్లా - సత్యకృష్ణ - అజయ్ తదితరులు సంగీతం: అనూప్ రూబెన్స్ ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్ నిర్మాత: అక్కినేని నాగార్జున రచన - దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ కధ-కధనం-విశ్లేషణ: స్థూలంగా చెప్పాలంటే చిన్నతనంలో విడిపోయిన ప్రేమ జంట పెద్దయ్యాక తిరిగి ఎలా కలుసుకున్నారు అన్నది కధ. "మనసంతా నువ్వే" మొదలుకుని పలు సినిమాలు ఈ తరహా కధతో వచ్చాయి. అలాంటి సింపుల్ స్టోరీ లైన్ ని తనదైన శైలిలో డెస్టినీ యాంగిల్ యాడ్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు విక్రమ్ కుమార్. చేసిన కొద్దీ సినిమాలతోనే తనకంటూ ఒక స్టాండర్డ్ ఏర్పర్చుకున్న విక్రమ్... ఈసారి అంత అద్భుతమైన కథతో రాకున్నా, కధనం విషయం లో మాత్రం తన మార్క్ మూమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు. ఫస్టాఫ్ లో ఎక్కువ సేపు ఉండే హీరో-హీరోయిన్ ల చిన్నప్పటి ఎపిసోడ్ కాస్త నెమ్మదిగానే అయినా మంచి ఫీల్ తోటే సాగుతుంది. అలాగే హీరో దత్తత ఎపిసోడ్ కూడా. ఇంటర్వెల్ ముందు గోడౌన్ దగ్గర ఫైట్ బాగా వచ్చింది. సెకండాఫ్ మరో ఫ్లాష్ బ్యాక్ లో తాము ఎవరో తెలీకుండా హీరో-హీరోయిన్ కలవడం,అతి తక్కువ సమయం లోనే ఇద్దరూ చాలా దగ్గరవడం..ఒక పక్క వాళ్ళ మధ్య బంధం బలపడింది అని చూపిస్తూనే మరో వైపు చిన్న నాటి ప్రేమ మీద వాళ్లకున్న నమ్మకం ని చూపిస్తూ సాగే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ప్రేమ కధకు ముగింపు ఊహించదగ్గదే అయినా క్లైమాక్స్ లో అవసరమైన మెలోడ్రామా వర్కౌట్ అయింది. ఈ ప్రేమ కద కంచికి చేరే క్రమం లో ఒక అవరోధం కోసం మొబైల్ మాఫియా ట్రాక్ ని ఎంచుకున్నా,ఆ బ్యాక్ డ్రాప్ అంత బలంగా లేదు. నిజంగానే ప్రేమ జంట కలిసే క్రమం లో వీళ్ళు అడ్డు పడ్డట్టు చూపిస్తే బాగుండేది ఏమో. అలాగే మొదటి ఫ్లాష్ బ్యాక్ ముగిసాక హీరో-హీరోయిన్ కి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమని చూపించే మూమెంట్స్ కొన్ని యాడ్ చేసి ఉంటె బాగుండేది. ముందుగానే చెప్పుకున్నట్టు విక్రమ్ కథకుడిగా కాస్త నిరాశ పరిచినా ,దర్శకుడి గా తన ఉనికిని చాటుకున్నాడు. అతడికి చక్కని సంగీతం ఇచ్చి అనూప్ రూబెన్స్ తన వంతు సహాయం అందించాడు. సినిమాలో పాటలు అన్ని బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.. అలాగే అద్భుతమైన కెమెరా వర్క్ కూడా సినిమాకి అండగా నిలిచింది. అఖిల్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రమ్యకృష్ణ ని అమ్మా అని పిలిచే సీన్ లో .. ఆ తరువాత క్లైమాక్స్ లో బాగా చేశాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఆ పాత్రకి బాగా సూట్ అయింది. రమ్యకృష్ణ నటన ఆ పాత్ర పరిధినే పెంచేసింది. జగపతి బాబు పరవాలేదు. అజయ్ పేరు కి మెయిన్ విలన్ తరహా పాత్ర పోషించినా,అతని పాత్రకు పెద్ద స్కోప్ లేదు. అనీష్ కురువిల్లా.. సత్యకృష్ణ..కృష్ణుడు తదితరులు ఒకే. రేటింగ్: 6.5/10 Quote
Sreeven Posted December 23, 2017 Report Posted December 23, 2017 Nayana recent time lo intha rod cinema chudaledu...jai Nepal star Quote
perugu_vada Posted December 23, 2017 Report Posted December 23, 2017 Vedu movies ki panikiradu, ah satyam grahisthe manchidi, leda inko sumanth authadu Quote
Quickgun_murugan Posted December 23, 2017 Report Posted December 23, 2017 3 hours ago, perugu_vada said: Vedu movies ki panikiradu, ah satyam grahisthe manchidi, leda inko sumanth authadu Correct ... Anavsaramga industry ki paisal bokka Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.