BaabuBangaram Posted December 25, 2017 Report Posted December 25, 2017 andharini sanka naakichandaniki adhe panilo vunnaru ga Quote
aakathaai Posted December 25, 2017 Report Posted December 25, 2017 Economic experts vaddhane chepthunnaru central bank regulations lev veeti meeda crypto currecylu budagallaantivi Quote
yaman Posted December 25, 2017 Report Posted December 25, 2017 మంచిర్యాల: నలుగురు వ్యాపారులు కలిసినా....ఉదయపు నడకలో బృంద సభ్యులు మాట్లాడుకుంటున్న మాట ‘బిట్‌కాయిన్’... గత కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ బిట్‌కాయిన్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ బిట్‌కాయిన్ వ్యాపారంలో ఖాతాలు తెరిచేందుకు జిల్లాలోని మదుపరులు ఉత్సాహం చూపుతున్నారు. రెండు, మూడునెలల కిందట ప్రారంభమైన ఈ వ్యాపారంలో వందలాది మంది యువత ఖాతాదారులుగా చేరుతున్నారు. ఇప్పటికే కొంతమంది బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లి వచ్చారు. జిల్లాలో విస్త్రృతంగా సాగుతున్న ఈ వ్యాపారంలో ఎక్కువ సంఖ్యలో యువత చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆశతో అడుగులు.. అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ, డిజిటల్ పేమెంట్ సిస్టం పేరిట ఈ వ్యాపారం సాగుతోంది. దీనికంటూ యజమాని, నిర్వాహకుడు, బాధ్యులు ఎవరూ లేరు. ఆన్‌లైన్‌లో డబ్బులు మార్చడమే ఈ వ్యాపారం ప్రధాన ఉద్దేశం. పలు దేశాలు ఈ వ్యాపారాన్ని నిషేధించగా, కొన్ని దేశాలు అనుమతి ఇచ్చాయి. భారత ప్రభుత్వం ఇంతవరకు బిట్‌కాయిన్లను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించలేదు. తక్కువ రోజుల్లో ఎక్కువ రాబడి వస్తుందన్న ఆశతో జిల్లాలోని యువత, వ్యాపారులు ఈ రంగంలో చేరడానికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. గొలుసుకట్టు వ్యాపారంతో 18 వారాల్లో రెట్టింపు.. ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే 18 వారాల్లో రెట్టింపు డబ్బులు వస్తాయన్న ప్రచారం సాగుతోంది. మొదట రూ. 1750 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో లాగిన్ చేసుకోవాలని, రూ. లక్ష పెట్టుబడి పెడితే 15 రోజుల తర్వాత 1430 డాలర్లు ఖాతాదారుడి ఖాతాలో జమ అవుతాయని బ్రోకర్లు పేర్కొంటున్నారు. ఇలా ప్రతివారం డాలర్ల సంఖ్య పెరుగుతూ ఖాతాల్లో జమఅవుతాయని 18 వారాల తర్వాత పెట్టుబడికి రెట్టింపు డాలర్లు తమకు అందుతాయని చెబుతున్నారు. బ్యాంకాక్, మలేషియా యాత్రలు ఇప్పటికే మంచిర్యాల పట్టణానికి చెందిన వంద మంది యువకులు ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నెల రోజుల కిందట బ్యాంకాక్ యాత్రకు వెళ్లివచ్చారు. బిట్‌కాయిన్ వ్యాపారులు రూ. 8 లక్షల వ్యాపారం చేసిన వారికి ఉచితంగా ఈ యాత్ర సౌకర్యం కల్పించారు. రూ.8 లక్షల పై బడి వ్యాపారం చేసిన వారికి త్వరలో మలేషియా యాత్ర ఉందని, దీనికి మంచిర్యాల నుంచి చాలామంది ఎంపికయ్యారని తెలుస్తోంది. ఈ వ్యాపారంలో పలు ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపకులే ఉన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.