Jump to content

Recommended Posts

Posted

ivvandi 

 

 

మూడో కంటితో చూడొద్దు!

 

‘ నాకేం తెలియదు... నన్ను నమ్మండి ప్లీజ్‌’ అన్నా వినుప్రియ(పేరుమార్చాం) గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితం.. మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరి హాయిగా జీవితంలో స్థిరపడాల్సిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దీనంతటికి కారణం..ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆన్‌లైన్‌లో ఉంచిన మూడోకన్ను. వినుప్రియే కాదు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని నరకప్రాయం చేస్తున్న ఆ మూడోకన్నుపై ‘యాంటీరెడ్‌ఐ’ పేరుతో పోరుబాట పట్టారు ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్న వరలక్ష్మి. ఇంతకీ ఆ మూడోకన్ను ఏంటో తెలుసా? విచ్చల విడిగా మార్కెట్లో దొరుకుతున్న స్పై కెమెరాలు... 
 మధ్య నాకు తెలిసిన అమ్మాయి ఫోన్‌ చేసి ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. ఆమె వాళ్ల అత్తగారింటికి వెళ్లింది. అదో పల్లెటూరు. స్నానం చేస్తున్నప్పుడు తననెవరో గమనిస్తున్నట్టుగా అనుమానం వచ్చి చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. కాసేపటికి తెలిసింది.. నా అనుమానం నిజమే అని. దగ్గరి బంధువొకాయన ఫోన్‌లో తన వీడియో తీసినట్టు తెలుసుకుంది. అతని గురించి చెబితే.. పరువుపోతుందని నోర్మూయించారు. ఇంట్లో వాళ్లు వీడియోని ఫోన్‌లోంచి తీసేసినా ఆ అమ్మాయి మానసిక క్షోభని మాత్రం వాళ్లు తీయలేకపోయారు. గత సంవత్సరం అనంతపురంలో ఓ కల్యాణమండపంలో దుస్తులు మార్చుకుంటున్న ఓ పాతికమంది మహిళల వీడియోలు బయటకు వచ్చాయి. వారిలో ఒక్కరు మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వీడియోలు 20 లక్షల వరకూ ఉన్నాయి. వాటిల్లో తమ వీడియోలు కూడా ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు కూడా. తెలిస్తే... వాళ్లంతా నిద్రపోగలరా! ఇదిగో ఇలాంటి సంఘటనలే నేను యాంటీ రెడ్‌ ఐ ప్రచారం చేపట్టడానికి కారణం అయ్యాయి. 
అమ్మకాలపై నిబంధనలు రావాలి.. 
ప్రాణరక్షణ కోసం కావాల్సిన మందులు కొనుక్కోవాలన్నా... వాటిని ఎలా బడితే అలా అమ్మరు. అమ్మే దుకాణాలకీ, కొనుక్కునే మనకీ కూడా తగిన అనుమతులు ఉండాల్సిందే. కానీ మన ఆడపిల్లల వ్యక్తిగత విషయాలని బయటపెట్టే స్పైకెమెరాల విషయంలో మాత్రం ఎటువంటి నిబంధనలు లేకపోవడం దారుణమైన విషయం. మూడొందల రూపాయలు పెడితే చాలు బజారులో, ఆన్‌లైన్‌లో స్పై కెమెరాలు ఎవరికైనా సులభంగా దొరుకుతున్నాయి. అది స్పై కెమెరా అని అనుమానించడం కూడా అసాధ్యం. అంతచక్కగా ఓ షాంపూడబ్బాలో, చిన్నచిన్న వస్తువుల్లోనూ అమరిపోగలవు. వాటిని తీసుకెళ్లి కల్యాణమండపాల్లో, బట్టల దుకాణాల్లో మహిళలు దుస్తులు మార్చుకునే ప్రదేశాల్లో అమర్చేస్తున్నారు. ఆడపిల్లల హాస్టళ్లూ ఇందుకు మినహాయింపుకాదు. అయితే మన ఇల్లు కొంతవరకూ ‘సురక్షితం కాకపోవచ్చు. మనకు తెలియకుండా మన ఇళ్లల్లోంచి నేరుగా ఆన్‌లైన్‌లోకి వెళుతున్న వీడియోలే అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా కొంతమంది చేయని తప్పునకు కుటుంబాలు చిన్నాభిన్నమయి ఆత్మహత్యల వరకూ వెళ్తుంటే, మరికొందరు ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు. కొందరు బ్లాక్‌మెయిల్‌కి గురవుతున్నారు. మరికొందరు అవతలి వ్యక్తి కోరినంత డబ్బు ఇవ్వలేక ఏం చేయాలో తోచక క్షణంక్షణం బాధపడుతున్నారు. 
చట్టాలు ఎలా ఉన్నాయి... 
గత సంవత్సరం ఇదే పరిస్థితి మంత్రి స్మృతిఇరానీకి కూడా ఎదురయ్యింది. బట్టలు మార్చుకునే ప్రదేశంలో కెమెరా ఉందన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారామె. ఆ కెమెరా అక్కడ మూడునెలల నుంచి ఉందన్న విషయాన్ని పోలీసులు నిర్ధరించారు. కానీ ఆ ముందెవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్మృతి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 5000 రపాయలు రుసుము చెల్లించి సంస్థ చేతులు దులుపుకుంది. కారణం.. మన చట్టాలు అలానే ఉన్నాయి. వ్యక్తిగత విషయాలని ఇలా రికార్డు చేసినా, ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేసినా దానికి శిక్షలు కఠినంగా లేవు. బెయిలబుల్‌ శిక్షలే ఉన్నాయి. కొనుగోళ్లపై నిబంధనలు కఠినతరం చేస్తూ, శిక్షలు కఠినంగా నాన్‌బెయిలబుల్‌ తరహావిగా ఉండాలని కోర్టులో ప్రజాప్రయోజన చట్టాన్ని దాఖలు చేశాను. కానీ ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో కోటి మిస్స్‌డ్‌ కాల్స్‌ సేకరణలో ఉన్నాం. 8099259925 నంబర్‌కి మిస్స్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా మీ మద్దుతుని మాకివ్వొచ్చు. అలాగే ఈ విషయంలో ఎవరికైనా న్యాయపరమైన సలహలు సూచనలు ఇవ్వాలన్నా మేం కొంతవరకూ సాయం చేయగలం. ఈ కార్యక్రమానికి సమంతా, మెహరీన్‌, ఆదాశర్మ, సన, రేణుదేశాయ్‌, విజయ్‌దేవరకొండ వంటి వారు అండగా నిలిచారు. 

  • Thanks 1
Posted
4 hours ago, ariel said:

ila public kosam fight chese vallani support cheste better

GP dude

Posted
12 hours ago, ariel said:

ila public kosam fight chese vallani support cheste better

Subtitles pls

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...