Jump to content

Recommended Posts

Posted

జీవితమంటే కష్టసుఖాల కలయిక అన్నది తెలిసిందే. కానీ నేటితరం దీన్ని స్వీకరించటానికి సిద్ధంగా లేదు. జీవితమంటే సుఖమే.. అనే భావనకు వచ్చేస్తున్నారు.. అలాగే బతుకుతున్నారు. ఏ మాత్రం చిన్నకష్టం ఎదురైనా ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యలవైపు ఆలోచిస్తున్నారు. లోపం ఎక్కడుంది? చిన్నప్పటినుంచే కష్టం తెలియకుండా తల్లిదండ్రులు వారిని పెంచటమా? అవుననే అంటున్నారు మానసిక నిపుణులు. మేం పడుతున్న కష్టాలు చాలు, మా పిల్లలెందుకు కష్టపడాలని తల్లిదండ్రులు అనుకోవడమూ ఓ కారణమేనంటున్నారు. మీ కష్టాన్ని తెలియజేస్తూ వారిని పెంచండి. అప్పుడే వారికి దాని విలువ తెలుస్తుంది. జీవితంలో వారు మంచి స్థాయిని చేరుకోవడానికి అదే పునాది అవుతుందని తెలుసుకోవడం లేదు.

ఇదో ఉదాహరణ.. 
నాలుగేళ్ల పిల్లాడిని ప్లే స్కూల్లో చేర్పించారు. అక్కడ పిల్లలందరికీ ఆటలు ఆడించారు. ఓసారి ఆడుతూ పిల్లవాడు పడిపోయాడు. మోకాలి వద్ద చిన్నపాటి గాయమైంది. దీంతో తల్లిదండ్రులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పిల్లవాడికి చిన్న దెబ్బ కూడా తగలకుండా పెంచాం. మీరు ఆడించడం వల్లే ఈ పరిస్థితి. మా పిల్లాడిని ఆడించవద్దని గట్టిగా చెప్పేశారు. ఆ మర్నాటి నుంచి మిగిలిన పిల్లలు ఆడుతుంటే... ఓ చోట ఈ పిల్లవాడిని కూర్చోపెట్టేశారు. పాపం పిల్లవాడికి ఆడాలని ఉన్నా బిక్కమొహం వేసుకుని ఓ మూల కూర్చోవాల్సి వచ్చింది. పిల్లలు పడిపోతుంటారని కొందరు తల్లిదండ్రులు సైకిలు కూడా కొనివ్వరు. చిన్న కష్టం భరించనివ్వని ఈ తల్లిదండ్రులకు తెలుసా? వాడు పెద్దయిన తర్వాత ఓ చిన్న కష్టం ఎదురైనా తట్టుకోలేడని!

యాంత్రిక చదువులు 
ప్రస్తుతం ఉన్న కార్పొరేట్‌ విద్యావిధానంలో నేర్చుకునే స్వభావం పూర్తిగా కనుమరుగైపోయింది. ఏది అవసరమో... అదే ఉదయం నుంచి రాత్రి వరకూ బట్టీ పట్టేస్తే చాలు పరీక్షలో ప్రతిభ చూపి, జీవితంలో స్థిరపడతారనే ధోరణికి 90 శాతం మంది తల్లిదండ్రులు అలవాటు పడిపోయారు. కనీసం తల్లిదండ్రుల చేతిలో పిల్లలుండే పదో తరగతి వరకైనా వారికి నేర్చుకునే శక్తిని అలవాటు చేయాలి. లేకుంటే వారు పూర్తిగా నిర్వీర్యమైపోతారు. కొత్త సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్యలకు పాల్పడడం తప్ప పరిష్కారం ఏంటనేదీ వారికి తెలియకుండా పోతుందనేది వాస్తవం. ప్రస్తుతం రోజుకో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడుతుండడానికి కారణం ఇదే.

Posted

ఓటమి నుంచే.. 
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే జీవితంలో ఎలాంటి ఒడిదుడికులనైనా తట్టుకునే శక్తి వస్తుంది. ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టుగా భావించాలి. ఆధునిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. తమ పిల్లలు ఎందులోనైనా విజయమే తప్ప అపజయం పాలయ్యే పరిస్థితే ఉండకూడదన్నట్టుగా వారిపై ఒత్తిడిని పెంచేస్తున్నారు. పిల్లలను ఎలా సాకాలో తెలియక, వారిని మరింత అభద్రతా భావానికి గురిచేస్తున్నారని నగరంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగరాజ్‌ పేర్కొన్నారు.

అప్పట్లో కష్టం అంటే.. 
తినడానికి సరైన తిండి దొరక్కపోవడం 
చదివినా ఉద్యోగం రాకపోవడం.. 
భార్యకి భర్త, అత్తమామల పోరు.. 
ఆడపిల్లలకు పెళ్లిళ్లు కాకపోవడం 
ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట చేతికి అందకపోవడం 
ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనపై ఆధారపడటం.. 
చాలీచాలని జీతాలు

ఇప్పుడు.. 
పరీక్ష తప్పితే కష్టం 
అమ్మతిడితే కష్టం 
నాన్న కొడితే కష్టం 
గురువు అరిస్తే కష్టం 
సరైన చీర కొనకపోతే కష్టం

  • Like 1
Posted

చందమామ కాదు... సెల్‌ఫోన్‌ 
నాలుగుళ్లలోపు చిన్నారులున్న ఏ ఇంటినైనా చూడండి. అన్నం తినాలంటే కచ్చితంగా చిన్నారుల చేతికి సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిందే. లేదా టీవీలో కార్టూన్‌ ఛానల్‌పెట్టాలి. వారు చూస్తుండగానే తల్లులు అన్నం ముద్దలను నోటికి అందిస్తున్నారు. చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. వారికి వ్యసనం అలవాటు చేశారు. దీంతో వారు ప్రతి విషయానికీ మొండిగా వ్యవహరించడం చేస్తుంటారు. అదే పెద్దయ్యాక అలవాటు అవుతుంది. అలాగే పిల్లల్ని తరచూ మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వారిని చూపించాలి. బయటి ప్రపంచ ఎలాగుందో చెప్తుండాలి.

- డాక్టర్‌ నాగరాజ్‌, మానసిక నిపుణులు
  • Like 1
Posted
1 minute ago, TensionNahiLeneka said:

ante antav? 

anakapoyina anipinchetatlu vunnav kada; adi kakapothe anukunetatlu vunnav..#~`

Posted
Just now, yaman said:

anakapoyina anipinchetatlu vunnav kada adi kakapothe anukunetatlu vunnav..#~`

idena anna, "jeevitam ante poratam " ante? 

Posted
45 minutes ago, yaman said:

ఇదో ఉదాహరణ.. 
యాంత్రిక చదువులు 
 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...