Jump to content

Recommended Posts

Posted
అవినీతి కేసు.. బేఫికర్‌ బాసూ! 
శిక్షలు పడిందీ లేదు.. ఆస్తుల స్వాధీనమూ లేదు 
న్యాయస్థానం ఎదుట నిలబెట్టడానికి నానాపాట్లు 
న్యాయ విచారణకు సర్కారు మీనమేషాలు 
కింది కోర్టు శిక్ష వేసినా.. ఏళ్ల తరబడి విచారణ 
పాతికేళ్లలో ఒక్కరి నుంచీ స్వాధీనం కాని అక్రమాస్తులు 
29hyd-main5a.jpg

సాంఘిక సంక్షేమశాఖలోని ఒక సూపరింటెండెంట్‌ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఇది జరిగింది 1994లో. అప్పటి లెక్కల ప్రకారం రూ. 20 లక్షల అక్రమాస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. కేసు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం నుంచి హైకోర్టుకు, ఆపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అన్ని కోర్టులూ నిందితుడికి శిక్షను నిర్ధారించాయి.

ఇరవయ్యేళ్లపాటు కేసు నడిచాక చివరకు 2014లో నిందితుడి ఆస్తులు స్వాధీనం చేసుకోమని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏసీబీ అధికారులు గొప్ప విజయం సాధించినట్లుగా పొంగిపోయారు.

కాని అంతలోనే నిందితుడి భార్య మళ్లీ సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేసింది. ఏసీబీ అక్రమమని చెబుతున్న ఆస్తులన్నీ తన భర్త సంపాదించినవి కావని పేర్కొంది. అంతే.. కేసు మళ్లీ పెండింగ్‌లో పడింది.

విచిత్రమేమిటంటే.. గత పాతికేళ్లలో ఏసీబీ నమోదు చేసిన కేసుల్ని పరిశీలిస్తే ఈ ఒక్క కేసులో మాత్రమే ఆస్తుల స్వాధీనానికి ఆ శాఖ ఉత్తర్వులైనా తెచ్చుకోగలిగింది. ఈ ఒక్కటి మినహా.. ఏటా ఎంతోమంది సర్కారీ సిబ్బంది అవినీతి నిరోధకశాఖకు చిక్కుతున్నా.. రూ. వందల కోట్లలో అక్రమార్కుల ఆస్తులు బయటపడుతున్నా వాటిలో ఒక్క పైసా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేకపోతోంది.

‘దాడుల’మూతల దండాకోర్‌! 
ఈనాడు - హైదరాబాద్‌ 
29hyd-main5b.jpg

‘జల్లెడతో నీళ్లు పట్టడం.. అవినీతి నిరోధకశాఖ కేసులు పెట్టడం’ రెండూ ఒకటే. జల్లెడకు ఎన్ని చిల్లులు ఉంటాయో ఏసీబీ కేసుల నుంచి తప్పించుకోవడానికీ అన్ని లొసుగులు ఉంటున్నాయి. కాస్త పలుకుండి ఉంటే చాలు అసలు కేసు న్యాయవిచారణకే రాకుండా చేసుకోవచ్చు. కాదూ కూడదంటే ఏదో ఒక సాకుతో విచారణ నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ న్యాయవిచారణకు వచ్చినా దాన్ని సుప్రీంకోర్టు వరకూ లాగించి ఎలాగోలా ఊరట పొందవచ్చు. ఏతావాతా తేలేదేమిటంటే ఏసీబీ నమోదు చేస్తున్న కేసుల వల్ల ఒరిగేదేమీ ఉండదనే. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క కేసులో కూడా ఈ శాఖ అధికారులు అక్రమార్కుల ఆస్తులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఖాతాలో జమ చేయించలేకపోయారు. గత కొన్నేళ్లుగా వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. మళ్లీ కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. పట్టుబడినవాళ్లు ఎలాగోలాగ కొద్దినాళ్లలోనే మళ్లీ సీట్లో కూర్చుంటున్నారు.

ఎందుకిలా జరుగుతోంది? 
ఈ మధ్యకాలంలో అవినీతి నిరోధకశాఖకు పట్టుబడుతున్న అక్రమార్కుల ఆస్తులు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎంత చిన్న ఉద్యోగి అయినా ఆస్తులు రూ. కోట్లలోనే ఉంటున్నాయి. ఇటువంటి వారిపై కేసు నమోదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు విజిలెన్స్‌ కమిషన్‌కు లేఖ రాస్తారు. నిందితుడు, అక్రమార్జన గురించి అందులో వివరిస్తారు. వివరాలు పరిశీలించిన తర్వాత సాధారణంగా విజిలెన్స్‌ కమిషన్‌ కూడా ఇదే సిఫార్సు చేస్తుంది. దాంతో సదరు నిందితుడిపై న్యాయవిచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వాన్ని కోరతారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులను న్యాయవిచారణ జరపాలంటే సర్కారు అనుమతి ఇవ్వాల్సిందే. ఇక్కడి నుంచే ఆట మొదలవుతుంది. పలుకుబడి ఉన్నవారు న్యాయవిచారణకు అనుమతి రాకుండా ఎత్తులు వేస్తుంటారు.

ఏళ్లుగా అంతు లేని కేసులెన్నో.. 
2010 నాటి కేసులలోనూ కొన్నింటికి ఇప్పటికీ అనుమతి రాలేదు. న్యాయవిచారణ కోసం ఏసీబీ లేఖ రాస్తే దాన్ని నెలలు, సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా పెట్టుకొని చివరకు మధ్యేమార్గంగా కేసు తీవ్రతను తక్కువగా చూపుతూ సదరు అధికారిపై న్యాయవిచారణ అవసరం లేదని, శాఖాపరమైన విచారణ సరిపోతుందనేలా ఉత్తర్వులు తెప్పించుకుంటారు. ఇదీ కాదంటే ట్రిబ్యునల్‌ ఫర్‌ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ లేదా కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌కో సిఫార్సు చేయించుకుంటారు. కేసు ఇక్కడకు వచ్చిందంటే ఇక మూలనపడ్డట్లే. నిబంధనల ప్రకారం జైలుకు వెళ్లిన అధికారులను సస్పెండ్‌ చేస్తే ప్రభుత్వం ఆరు నెలల్లోనే వారికి మళ్లీ పోస్టింగ్‌ ఇస్తుంది. ఈలోపు సగం జీతం కూడా వస్తుంది. అంటే ఆరునెలలపాటు దర్జాగా ఇంట్లో కూర్చుని గడిపేయవచ్చు. కాని కేసు మాత్రం ఎటూ తేలదు. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ స్వచ్ఛంద సేవాసంస్థ సమాచార హక్కు ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ (సీవోయీ) వద్ద 91 కేసులు, ట్రైబ్యునల్‌ ఫర్‌ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ వద్ద ప్రస్తుతం 298 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 99 శాతం కేసులు 2014-15 ముందు నుంచీ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విచిత్రమేమిటంటే ట్రైబ్యునల్‌లో కేసులు విచారించాల్సిన అధికారుల పోస్టులు మూడేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. సీవోఈ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే!

న్యాయ విచారణది మరోదారి 
ఎలాగోలా అక్రమార్కులను పట్టుకున్నా వారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టడానికి ఏసీబీ అధికారులు నానాపాట్లు పడాల్సిందే. ఉదాహరణకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తేజ్‌దీప్‌కౌర్‌ మీనన్‌పై ఈ శాఖ కేసు నమోదు చేసింది. తూనికలు, కొలతల శాఖ సంచాలకులుగా ఉన్నప్పుడు బదిలీల విషయంలో ఆమె డబ్బు డిమాండు చేశారనేది అభియోగం. ఆమెపై న్యాయవిచారణకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ పదేపదే లేఖలు రాయాల్సి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. విచిత్రమేమిటంటే.. ఒకవేళ ప్రభుత్వం న్యాయవిచారణకు అనుమతి ఇచ్చినా ప్రయోజనం మాత్రం కనిపించడంలేదు. కిందికోర్టు నిందితుడికి శిక్ష విధిస్తే హైకోర్టుకు, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళతాడు. కేసు కొట్టేస్తే ఏసీబీ అధికారులు వెళతారు. అంతిమంగా సుప్రీంకోర్టు కూడా అభియోగాలు నిర్ధారించి, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రమే అక్రమార్జన ప్రభుత్వ పరమవుతుంది. కాని ఏసీబీ చరిత్రలో ఇటువంటి కేసు ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తికాదు.

29hyd-main5c.jpg

ఆస్తులన్నీ వారి ఆధీనంలోనే 
అవినీతి నిరోధక చట్టంలోని మరో లొసుగు ఏమిటంటే.. అక్రమార్కుల ఆస్తులను న్యాయస్థానానికి తాత్కాలికంగా ఎటాచ్‌ చేస్తారు. అయితే ఇవన్నీ నిందితుల ఆధీనంలోనే ఉంటాయి. కాకపోతే వాటిని అమ్మకూడదు. కాని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం భేషుగ్గా అనుభవిస్తూ ఉండొచ్చు. అంతిమంగా సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన తర్వాత.. అక్కడ కూడా ఇవి అక్రమాస్తులేనని తీర్పు వచ్చినప్పుడు మాత్రమే స్వాధీనం చేసుకోడానికి కుదురుతుంది. ఇందులో ఇంకో మతలబు ఏమిటంటే ఒకవేళ న్యాయవిచారణ సమయంలోనే నిందితుడు చనిపోతే ఆస్తులన్నీ వారి కుటుంబ సభ్యుల పరమవుతాయి. ఇక కేసు లేనట్లే. మొత్తంమీద ఏసీబీ కేసులంటే జల్లెడతో నీళ్లుపట్టిన చందంగానే ఉంటున్నాయి.

అవినీతి తిమింగలాలు కొన్ని.. 
* తెలంగాణ పరిశ్రమల శాఖలో డైరెక్టర్‌ బాయిలర్స్‌ విజయ్‌కుమార్‌ రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. హయత్‌నగర్లో రెండెకరాలు, ఆదిభట్లలో నాలుగెకరాలు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కనుగొన్నారు. 
* రవాణా అధికారి రవీందర్‌ వద్ద అధికారిక లెక్కల ప్రకారం రూ. 6 కోట్ల అక్రమార్జన ఏసీబీ అధికారులు కనుగొన్నారు. మార్కెట్‌ లెక్కల ప్రకారం ఈ విలువ పదిరెట్లు ఉంటుంది. 
* ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ మధ్యకాలంలో బయటపడుతున్న అక్రమార్కుల ఆదాయాన్ని చూస్తే సామాన్యుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ సంచాలకులు గొల్ల వెంకట రఘు వద్ద రూ. 40 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్‌ విలువ, అతడి పెట్టుబడుల విలువ కలిపితే వందల కోట్లలో ఉంటుందని అంచనా. 
* ఏపీ పురపాలకశాఖలోని ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ పాము పాండురంగారావు వద్ద స్వాధీనం చేసుకున్న ఆస్తుల మార్కెట్‌ విలువ రూ. 500 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా.

Posted
Quote

 

ఇరవయ్యేళ్లపాటు కేసు నడిచాక చివరకు 2014లో నిందితుడి ఆస్తులు స్వాధీనం చేసుకోమని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏసీబీ అధికారులు గొప్ప విజయం సాధించినట్లుగా పొంగిపోయారు.

కాని అంతలోనే నిందితుడి భార్య మళ్లీ సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేసింది. ఏసీబీ అక్రమమని చెబుతున్న ఆస్తులన్నీ తన భర్త సంపాదించినవి కావని పేర్కొంది. అంతే.. కేసు మళ్లీ పెండింగ్‌లో పడింది.

విచిత్రమేమిటంటే.. గత పాతికేళ్లలో ఏసీబీ నమోదు చేసిన కేసుల్ని పరిశీలిస్తే ఈ ఒక్క కేసులో మాత్రమే ఆస్తుల స్వాధీనానికి ఆ శాఖ ఉత్తర్వులైనా తెచ్చుకోగలిగింది.

 

bl@st enni real time governance lu pettina , enni dash board lu pettina , Asia's biggest video wall pettina mana government appicers ni evadu em peekaledu

Posted

ఈ విషయలు ఇంత public  అయ్యాక_%~  ఇక మనవాల్లు ఆగుతరా? దేవుడే ఇక మనవాళ్ళని కాపాడాలి !!

Posted
14 hours ago, yaman said:

ఈ విషయలు ఇంత public  అయ్యాక_%~  ఇక మనవాల్లు ఆగుతరా? దేవుడే ఇక మనవాళ్ళని కాపాడాలి !!

god save india

Posted
Quote

అవినీతి నిరోధక చట్టంలోని మరో లొసుగు ఏమిటంటే.. అక్రమార్కుల ఆస్తులను న్యాయస్థానానికి తాత్కాలికంగా ఎటాచ్‌ చేస్తారు. అయితే ఇవన్నీ నిందితుల ఆధీనంలోనే ఉంటాయి. కాకపోతే వాటిని అమ్మకూడదు. కాని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం భేషుగ్గా అనుభవిస్తూ ఉండొచ్చు.

dorikindi dorikinattu dochesi apartments , commercial complex lu konesthey khel katham dukanam bandh. life long rental income. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...