yaman Posted December 30, 2017 Report Posted December 30, 2017 మ్యూచువల్ ఫండ్లు లక్ష్మీ కటాక్షం ఒకప్పుడు పెట్టుబడులంటే.. స్థిరాస్తులు.. బంగారం.. లేదా రికరింగ్ డిపాజిట్లు.. పెద్ద నోట్ల రద్దు.. తగ్గుతున్న వడ్డీ రేట్లు... మరోవైపు స్టాక్ మార్కెట్ దూకుడు..మదుపర్లు ఇప్పుడు ఆర్థిక సంబంధిత పెట్టుబడులవైపు చూడటం ప్రారంభించారు.. ఈవిధంగా చూస్తే మ్యూచువల్ ఫండ్‌ల రంగానికి 2017 కలిసొచ్చిన ఏడాదే.. ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల వృద్ధి గురించి తెలుసుకునేముందు.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడాలి.. 2007-14 మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు రూ.5లక్షల కోట్ల నుంచి రూ.10లక్షల కోట్లకు చేరాయి. అంటే ఏడేళ్లకాలం పట్టిందన్న మాట. ఆ తర్వాత రెండేళ్లకు రూ.15లక్షల కోట్లకు చేరింది. అదే.. ఒక్క 2017లోనే మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు.. దాదాపు రూ.7.79లక్షల కోట్లు పెరిగి.. ఇప్పుడు రూ.22.79లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే.. 2017లో మ్యూచువల్ ఫండ్ల రంగం వృద్ధి గత ఏడాదితో పోలిస్తే.. దాదాపు 38 శాతానికి పైనే. ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోనికి తీసుకున్నా.. ఇది దాదాపు 24శాతం మేర అని చెప్పుకోవచ్చు. మరోవైపు 2017లో సిప్‌ల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 60లక్షల సిప్ ఖాతాలు అదనంగా వచ్చి చేరాయి. నెలవారీ సిప్ మొత్తాలు కూడా రూ.3,884 కోట్ల నుంచి రూ.5,893 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా ఈ 12 నెలల్లో దాదాపు రూ.57,233కోట్ల మొత్తం వీటి ద్వారానే మార్కెట్లోకి వచ్చింది. ఈపీఎఫ్‌ఓ నుంచి కూడా ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడులు వస్తూ ఉండటం మరో కలిసొచ్చే అంశం. ఏడాది కాలంలో మంచి ఈక్విటీ ఫండ్లు ఇచ్చిన రాబడిని గమనించినా.. దాదాపు 30శాతానికి పైనే ఉంది. ఆసక్తికి కారణమేమిటి? ‘పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలామంది వ్యవస్థీకృత రంగాలు, పారదర్శకత ఉన్న చోటే మదుపు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. వారికి వచ్చే వార్షిక రాబడి ద్రవ్యోల్బణంతో పోలిస్తే అతి తక్కువగా ఉంటోంది. స్థిరాస్తి, బంగారం కూడా ఆశించినంత మెరుగ్గా ఏమీ లేవు.. దీంతోపాటు.. యాంఫీ కూడా ఫండ్ల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గత కొంతకాలంగా ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ రంగం వృద్ధికి ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు’ అంటున్నారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రెసిడెంట్ సంజయ్ సాప్రే. ‘భారత్ 22 ఈటీఎఫ్‌కు వచ్చిన ఆదరణ భారత మదుపరుల మనసు మార్కెట్ వైపు మళ్లుతోందని చెప్పేందుకు మరో ఉదాహరణ. ఈ ఫండ్‌కు అనుకున్నదానికన్నా నాలుగింతల ఆదరణ లభించింది. దాదాపు రూ.31వేల కోట్లను సమీకరించడం అంటే.. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల గురించి ఉన్న అపోహలు తొలగుతున్నట్లే భావించవచ్చు’ అంటున్నారు.. ఎస్‌అండ్‌పీ డో జోన్స్ భారత వ్యాపార విభాగాధిపతి కోయల్ ఘోష్. ‘మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు దీర్ఘకాలం వేచి చూడాలనే అవగాహన పెరిగింది. సిప్ ద్వారా మదుపు చేసినప్పుడు వస్తున్న ప్రతి ఫలాలు ఆసక్తిగా ఉంటున్నాయి. ఒక ఆర్థిక లక్ష్యానికి తగిన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు వారికి ఫండ్లు ఉత్తమ మార్గంగా కనిపిస్తున్నాయి. ఫండ్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తడానికి ఇవి సానుకూల అంశాల’ అని వివరిస్తున్నారు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈఓ ఎ.బాలసుబ్రహ్మణియన్. Quote
TampaChinnodu Posted December 30, 2017 Report Posted December 30, 2017 Quote స్థిరాస్తి, బంగారం కూడా ఆశించినంత మెరుగ్గా ఏమీ లేవు. pichi pichi gaa penchaaru real estate rate lu. ina kooda complaining aa returns baalevu ani. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.