TampaChinnodu Posted January 4, 2018 Report Posted January 4, 2018 ఐటీలో కోతల కాలం! ప్రారంభ వేతనాలు పతనం ప్రస్తుతం కొత్తవారికి ఏడాదికి రూ.1.8 - రూ.2.1 లక్షలే ఎప్పటికప్పుడు సాంకేతికతపై పట్టు సాధిస్తేనే ఆకర్షణీయ ప్యాకేజీలంటున్న నిపుణులు ఈనాడు - హైదరాబాద్ ‘‘ఐటీ కంపెనీలన్నీ ఒక బృందంగా ఏర్పడి కొత్తగా నియమితులయ్యే ఇంజినీర్లకు వేతనాలు తక్కువగా ఇస్తున్నాయి. ఇది అనైతికం, విలువలతో కూడిన నిర్ణయాలు కావివి’’ - ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ ‘‘గతంలో కొత్తగా చేరే ఐటీ ఉద్యోగికి కనీస వేతనం ఏడాదికి రూ.3.2 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు చిన్న కంపెనీలతోపాటు పెద్ద వాటిలోనూ వేతనాలు భారీగా తగ్గిపోయాయి’’ - హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఉపాధి కల్పతరువుగా మారిన ఐటీ రంగం ఇప్పుడు ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. రెండేళ్ల క్రితం వరకు ఐటీ ఉద్యోగమంటే భారీ వేతనాలు, విలాసవంతమైన జీవితం కనిపించేది. కానీ, ఇప్పుడు క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు.. మరోవైపు అంతర్గతంగా కూటమి కడుతున్న కంపెనీలు.. వెరసి భారతీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన కంపెనీల్లోనూ ప్రారంభ వేతనాలు రూ.1.8 లక్షలకు పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలు చిరునామాగా ఉన్నాయి. ఐటీ కంపెనీలు తమకు అవసరమైన మానవ వనరులను ప్రాంగణ నియామకాలతోపాటు ఇతర మార్గాల్లోనూ నియమించుకునేవి. కనీస వేతనాలు రూ.3.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు చెల్లించేవి. ప్రస్తుతం కంపెనీలు కొన్ని కళాశాలల్లో ప్రాంగణ నియామకాలకే పరిమితమై వేతనాల్లోనూ భారీగా కోతపెడుతున్నాయి. అత్యధిక నైపుణ్యం కలిగిన విద్యార్థులకు మాత్రమే రూ.3 లక్షల వరకు వేతన ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఈ తరహా ప్యాకేజీల కింద ఒక్కో కంపెనీ ఇద్దరు, ముగ్గురిని మాత్రమే తీసుకుంటున్నాయి. అవసరాల మేరకు ఇతర విద్యార్థులను ఎంపిక చేసినప్పటికీ... గరిష్ఠంగా ఏడాదికి రూ.2 లక్షల వరకు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాయి. ఆటోమేషన్ కారణంగాఇప్పుడు ఐటీ నియామకాలు తగ్గుతున్నాయి. గతేడాది కంటే తగ్గిన వేతనాలు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభ వేతనాలు మరింత తగ్గాయి. గత ఏడాది వరకు ప్రముఖ కంపెనీలు మినహా మిగతావి ఏడాదికి రూ.2.1 లక్షల నుంచి రూ.2.4 లక్షల వరకు ఇచ్చాయి. ఈ ఏడాదికి ఆ మొత్తాన్ని రూ.1.8 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు పరిమితం చేశాయి. ‘‘గతంతో పోలిస్తే ఏడాది వేతనం రూ.40 వేల వరకు తగ్గిన మాట వాస్తవమే. పెద్ద కంపెనీలు ఇప్పటికీ రూ.2.4 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. అయితే బీపీవో ఉద్యోగాల్లో వేతనాలు రూ.1.8 లక్షల వరకు ఉంటున్నాయి’’ అని నియామక అధికారి ఒకరు తెలిపారు. నూతన కోర్సులు నేర్చుకోవాలి..: ‘‘కోర్ రంగంలో ఉద్యోగాలు పెరగడం లేదు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారందరికీ ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలే ఆధారమయ్యాయి. తక్కువ వేతనం ఇచ్చినా వెంటనే ఉద్యోగంలో చేరేందుకు పట్టభద్రులు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే కోర్సు పూర్తయ్యాక ఏడాది ఖాళీగా ఉంటే.. ఉద్యోగం దొరకడం కష్టమవుతోంది. వేతనం తక్కువని బాధపడకుండా నూతన కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’’ అని తెలంగాణ ఐటీ అసోసియేషన్ ప్రతినిధి సందీప్‌కుమార్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం ఉంటే ఎప్పటికీ డిమాండ్..: వేతన ప్యాకేజీలు తగ్గిన విషయాన్ని పక్కనపెడితే... ప్రారంభ ఉద్యోగులకు కొన్ని కంపెనీలు ఇప్పటికీ అధిక వేతనాలు చెల్లిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఐటీ రంగంలో ప్రస్తుతం కొత్త టెక్నాలజీలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, అడోబ్, ఏఐ తదితరాల్లో కోర్సులు నేర్చుకున్న వారికి ఏటా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. విద్యార్థులు ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన టెక్నాలజీల్లో నైపుణ్యం సాధించాలి. నైపుణ్యాలు ఉంటే వేతనాలు అవే పెరుగుతాయి.’’ అని టాస్క్ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. Quote
afmod1 Posted January 4, 2018 Report Posted January 4, 2018 aa heading endi ... vedhava news gallu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.