Jump to content

Recommended Posts

Posted
హైదరాబాద్‌లో కొత్త ఐటీ సముదాయం 
బుద్వేల్‌ ప్రాంతంలో 350 ఎకరాల్లో ఏర్పాటు 
30 సంస్థలు రాక.. 1.25 లక్షలమందికి ఉపాధి 
క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ 
వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
3main3a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగానికి ఊతమిచ్చేలా రాజధాని శివారు బుద్వేలులో కొత్త ఐటీ సముదాయాన్ని (క్లస్టర్‌) ఏర్పాటుచేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందుకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రావతరణ తర్వాత స్థాపిస్తున్న తొలి సముదాయమిది. పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించి, అనుకూలంగా ఉన్న 350 ఎకరాలను గుర్తించారు. ఈ క్లస్టర్‌కు వచ్చేనెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ 30కి పైగా సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఐదేళ్లలో వీటి ద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 
పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఐటీ, రెవెన్యూశాఖల అధికారులతో కలిసి కేటీఆర్‌ రాజేంద్రనగర్‌, బుద్వేలును సందర్శించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం సమూహం ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఐటీ విస్తరణ కోసమే... 
కేటీఆర్‌ మాట్లాడుతూ... రాజధాని నలువైపులా ఐటీ రంగాన్ని మరింతగా విస్తరించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ‘‘ఐటీ రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. కొత్త సమూహం ఏర్పాటుపై దృష్టి సారించాం. ఇందుకు అత్యుత్తమ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేశాం. త్వరలో ఇది కార్యరూపం దాలుస్తుంది. రాజేంద్రనగర్‌ పరిసరాల్లో కార్యకలాపాలులేని ప్రభుత్వ సంస్థలు.. తమ భూముల్ని పరిశ్రమలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. భూయాజమాన్య మార్పులను త్వరలోనే చేపడతాం. కొత్త సమూహంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తాం. సీఎస్‌ అధ్యక్షతన త్వరలో ఐటీ, రెవెన్యూశాఖలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, టీఎస్‌ఐఐసీల సమావేశం ఉంటుంది.

అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఒప్పందాలు: మంత్రి కేటీఆర్‌ 
బుద్వేలు ఆహ్లాదకరమైన ప్రాంతం. ఇక్కడ ఐటీ పరిశ్రమలను స్థాపించేందుకుఅంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పేరొందినసంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. త్వరలోనే వాటితో ఒప్పందాలు చేసుకుంటాం. ఐదేళ్లలో అవి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి.

Posted
1 minute ago, TampaChinnodu said:

Budwel lo lepandi inka real estate rate lu

Fost froof for real estate rates lefing no

Posted
6 minutes ago, TampaChinnodu said:

Budwel lo lepandi inka real estate rate lu

already myhome laanti vallatho konipincheysi untaaru private lands anni akkada @3$%

Posted
5 minutes ago, tom bhayya said:

already myhome laanti vallatho konipincheysi untaaru private lands anni akkada @3$%

Yes. chuttu pakkala full gaa lands konnake projects announce sestharu. 

Posted
Just now, boeing747 said:

Entha undi rate akkada average ga

It is near rajendra nagar, before shamshabad. So already baane high lo vundi vuntayee rates. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...