Jump to content

Recommended Posts

Posted

Pakkana car, van lo unnollu guddhi 10githe aipoyedi....edo sunny leone dance show chystunnattu chustunnaru...

Posted
7 minutes ago, Renault said:

Pakka na car, van lo unnollu guddhi 10githe aipoyedi....edo sunny leone dance show chystunnattu chustunnaru...

ya

Posted
6 hours ago, Renault said:

Pakkana car, van lo unnollu guddhi 10githe aipoyedi....edo sunny leone dance show chystunnattu chustunnaru...

Video thestharu kani manakenduku ani patinchukovatledu now a days ppl

Posted
6 hours ago, Renault said:

Pakkana car, van lo unnollu guddhi 10githe aipoyedi....edo sunny leone dance show chystunnattu chustunnaru...

 

Posted

Least helping society edina undi ante mana Indians ye...only family, relatives nd friends ki help chestaru kaani strangers ki help cheandira ante okkadu kuda cheyadu

Posted
జూబ్లీహిల్స్‌లో పట్టపగలే దారి దోపిడీ 
ప్రేక్షకుల్లా చూసిన వాహనదారులు 
బాధితుడు ప్రతిఘటించినా అందని సహకారం 
hyd-top1a.jpg

హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్‌.. ఈ పేరు చెప్పగానే నగరంలో ఉండే వారు, తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇట్టే గుర్తుపడతారు. ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఉంటారని ఠక్కున చెప్పేస్తారు. ఇక్కడి రోడ్డు నం: 10 ప్రధాన రహదారి నిత్యం వాహనాల రద్దీ.., ప్రముఖుల రాకపోకలతో కనిపిస్తుంది. అలాంటి ఈ రోడ్డుపై పట్టపగలే దొంగలు దోపిడీకి తెగబడ్డారు.

పోలీసుల వివరాల మేరకు.. బేగంపేటలోని శ్యాంలాల్‌ బిల్డింగ్స్‌ సమీపంలో నివసించే రాజబోయిన యాదగిరి(22) బంజారాహిల్స్‌ రోడ్డు నం: 12లోని బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్‌లో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నారు. అతని సహోద్యోగి రాజేందర్‌ మిశ్రాతో కలిసి బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్డునం: 10లోని సాగర్స్‌ సిమెంట్స్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. కొన్ని చెక్కులను ఇచ్చేందుకు రాజేందర్‌ మిశ్రా లోపలికి వెళ్లగా యాదగిరి ద్విచక్రవాహనం (టీఎస్‌ 09 ఈడబ్లు్య 8970)పై బయటే వేచి ఉన్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. అతన్ని నెట్టేసి వాహనాన్ని లాక్కొన్నారు. జేబులో ఉన్న పర్సు, రెండు చరవాణులను గుంజుకొన్నారు. యాదగిరి తీవ్రంగా ప్రతిఘటించగా... ఒకడు కత్తితో బెదిరించి, గట్టిగా కిందకు తోసేశాడు. మిగతా ఇద్దరు వాహనం సిద్ధం చేయడంతో బెదిరించిన వ్యక్తీ అదే వాహనంపై పరారయ్యాడు. యాదగిరి తన చేతిలోని శిరస్త్రాణాన్ని వారి మీదకు విసిరాడు.

ఇతర రాష్ట్రాల వారేనా? నిందితులు ముసుగులు ధరించలేదు... అందరూ 30ఏళ్ల లోపు వారుగానే పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విశ్లేషిస్తున్నారు. వాహనాన్ని లాక్కొని పరారైన వీరు జూబ్లీహిల్స్‌ రహదారుల మీదనే తచ్చాడారు. చుట్టూ తిరిగి సంఘటన జరిగిన ప్రాంతం వైపే వచ్చినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసు వాహనాలు అక్కడ ఉండటంతో కంగారుపడి తిరిగి జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.1 మీదుగా దోపిడీ చేసిన వాహనంపైనే బేగంపేట వైపు వెళ్లినట్లు నిఘా కెమెరాల ఫుటేజీల దృశ్యాల ద్వారా తెలుస్తోంది. ఇంత ధైర్యంగా, కనీసం పరిసరాలపై అవగాహన లేకుండా.. నిందితులు వచ్చారంటే .. వారు ఇక్కడి వారు కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. వ్యక్తిగత గొవవలుంటే ఇలా చేయరని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

చిక్కితేనే తేలేది.. బుధవారం జరిగితే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. గురువారం విషయం బయటకు రావడంతో దర్యాప్తులో వేగం పెంచారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. విచారణలో బాధితుడు, ఫిర్యాదుదారుడైన యాదగిరి వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఒక వేళ నిందితులు వాహనం కోసమే వస్తే.. రద్దీ దారిలో ఇలా చేయాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్న. బాధితుడికి తెలిసిన వారే చేయించి ఉంటారా.. అనే కోణంలోనూ శోధిస్తున్నారు. యాదగిరి, అతని సహోద్యోగి మిశ్రా బైక్‌పై వచ్చినా.. మిశ్రా కార్యాలయంలోకి వెళ్లిన వెంటనే యాదగిరిపై దాడి జరిగింది. క్షణాల్లో దుండగులు పని చేసుకుని వెళ్లారు. దీంతో బాధితుడి మిత్రుడినీ విచారిస్తున్నారు.

అందరూ చూస్తున్నారే గానీ... 
దొంగలను బాధితుడు ప్రతిఘటిస్తున్న సమయంలో అక్కడున్న వాహనదారులు ఎవరూ ముందుకు రాలేదు. ఏటీఎంలకు డబ్బు తరలించే వ్యాన్‌ ఆపి ఉన్నా.. అందులోని సెక్యూరిటీ సిబ్బందీ దుండగులను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...