ye maaya chesave Posted January 11, 2018 Report Posted January 11, 2018 చిత్రం : ‘అజ్ఞాతవాసి’ నటీనటులు: పవన్ కళ్యాణ్ - కీర్తి సురేష్ - అను ఇమ్మాన్యుయెల్ - ఆది పినిశెట్టి - ఖుష్బు - బొమన్ ఇరానీ - రావు రమేష్ - మురళీ శర్మ - తనికెళ్ల భరణి - వెన్నెల కిషోర్ - రఘుబాబు - పవిత్ర లోకేష్ - జయప్రకాష్ - సమీర్ - అజయ్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: మణికందన్ నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ రచన - దర్శకత్వం: త్రివిక్రమ్ కథ-కథనం - విశ్లేషణ: ఒక మల్టీ మిలియనీర్,అతని కొడుకు ఒకే రోజు చంపబడతారు. ప్రత్యర్ధులు అతని కంపెనీ ని చేజిక్కిచుకునే పనిలో ఉండగా అజ్ఞాతం లో ఉన్న ఆ మిలియనీర్ మొదటి కొడుకు అసలు తన తండ్రి ని సోదరుడిని చంపింది ఎవరో తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ క్రమంలో అతనికి ఎదురైన అడ్డంకులేటి ?? అతని లక్ష్యం సులువుగానే నెరవేరిందా?? అన్నది మిగతా కధ. ముందు మూల కథను ఎస్టాబ్లిష్ చేసి, ఆ తరువాత హీరో లక్ష్య సాధనకు ఎంటర్టైన్మెంట్ రూట్ ఎంచుకుని మధ్య మధ్యలో అసలు కథను టచ్ చేస్తూ వెళ్లడం త్రివిక్రమ్ కు అలవాటైన దారి. ఐతే ప్రతి కధకు ఆ శైలి నప్పకపోవచ్చు .. దానికి చిత్రం ' అజ్ఞాతవాసి’ అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవడానికి హీరో మారు వేషంలో వెళ్లాల్సినంతగా పరిస్థితులేవి ఉండవు. పైగా ఆలా వెళ్లి అతను పెద్ద రహస్యాన్ని బయటపెట్టినట్టు చూపించారా అంటే అదీ లేదు. తను అనుమానించే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి హీరో చేసేదల్లా ఇద్దరు హీరోయిన్స్ ని ప్రేమ ముగ్గులోకి దింపడమే. ఆ రొమాన్స్ ట్రాక్ మొత్తం ఫోర్స్డ్ కామెడీ తో నిండి సహనాన్ని పరీక్షిస్తుంది. పైగా ఆఫీస్ లో అసలు అనుమాస్పద ప్రవర్తన కలిగిన వ్యక్తి ని హీరో పట్టించుకోడు. ఎట్టకేలకు చంపింది తాను అనుకుంటున్న వాళ్ళు కాదు అని తెలిసిన తరువాత అయినా కధనం సీరియస్ టర్న్ తీసుకుంటుంది అనుకుంటే అక్కడా మళ్ళీ దారి తప్పి సైకిల్/బెల్ట్ కామెడీ అంటూ మరో ప్రహసనం. అసలు స్పష్టంగా చెప్పాల్సిన విందా ఫ్లాష్ బ్యాక్,విలన్స్ ట్రాక్ కి సంబందించిన సన్నివేశాలని సరిగ్గా చెప్పకుండా అనవసరపు సన్నివేశాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏ దశలోనూ పాత్రల పట్ల ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. సినిమాకే హైలైట్ గా నిలవాల్సిన కంపెనీ కి అసలు వారసుడు హీరోనే అని ప్రకటించే ఎపిసోడ్ ని ఏ ప్రత్యేకత లేకుండా తెరకెక్కిచాడు దర్శకుడు. తనంతట తానే ప్రకటించుకునే పని ఐతే అసలు మారు వేషం లో వెళ్లడం ఎందుకో, ప్రత్యర్ధులు అడ్డు చెప్తే తప్ప తాను వారసుడు అని నిరూపించాల్సిన ఆధారాలు బయటపెట్టకుండా ఉండడం ఏంటో దర్శకుడికే తెలియాలి. దాదాపు సినిమా అంతా తానే కనిపించినా పవన్ కళ్యాణ్ కి పెద్దగా నటించే సన్నివేశాలేమి లేవు.. ఫస్టాఫ్ లో ఫోర్స్డ్ కామెడీ సీన్స్ లో ఎంత ట్రై చేసినా నవ్వించలేకపోయాడు. సెకండాఫ్ లో కూడా కధకు సంబంధం లేకపోయినా ఆ కోటేశ్వర రావు సాంగ్ ఎపిసోడ్ లో కాస్త ఎంటర్టైన్ చేసాడు. బోమన్ ఇరానీ,ఖుష్బూ ఆ పాత్రలకు సరిపోయారు.హీరోయిన్స్ గా అను ఇమ్మానుయేల్ ,కీర్తి సురేష్ లకి సరైన పాత్రలే లేవు. ఆది పినిశెట్టి పేరు కి మెయిన్ విలన్ కానీ అతనికీ చేయడానికేమి లేదు. రావు రమేష్.. మురళీ శర్మ కామెడీ అక్కడక్కడా పండింది. అంతో ఇంతో గుర్తుండేది రావు రమేష్ పాత్ర డైలాగులే. సంపత్ రాజ్ లాంటి ఆర్టిస్ట్ కి ఏ మాత్రం తగని పాత్ర.. అతని పాత్రకి సరైన ముగింపు కూడా లేదు. వెన్నెల కిశోర్,తనికెళ్ళ భరణి,శ్రీనివాస రెడ్డి తదితరులు ఒకే. త్రివిక్రమ్ మూల కద ,దానికి అనుగుణంగా పాత్రలు/ట్విస్ట్ లు ఐతే ప్లాన్ చేసుకున్నాడు కానీ .. ముందుగా ఆ కంపెనీ కానీ,హీరో కుటుంబం కానీ ప్రమాదం లో ఉన్నారు అన్న స్పృహ ఉండేలా,అవతల ఉన్నది అత్యంత ప్రమాదకారులు అని భయపడేలా ఎక్కడ పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. చివరి 20 నిమిషాల్లో జరిగే తతంగం ఐతే మరీ గందరగోళం. మాటల మాంత్రికుడు అని పేరున్న త్రివిక్రమ్ "నువ్వు ఆలోచిస్తేనే అనుకున్నట్టు అమ్మా ..అనుకుంటే అయిపోయినట్టే"అన్న ఒక్క డైలాగ్ తప్ప సినిమాలో తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఇక దర్శకుడి గా ఐతే మొదటి 10 నిముషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సెట్ చేసిన బిల్డప్ వద్ద మాత్రమే తన ఉనికిని చాటుకోగలిగాడు. అతనికి కెమెరా మెన్ మణికందన్ చక్కని విజువల్స్ తో వీలయినంత సహాయం అందించాడు. అనిరుధ్ పాటలు బాగానే ఉన్నా వాటిని ఆన్ స్క్రీన్ సరిగా ప్రెజంట్ చేయలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుండి,మరి కొన్ని చోట్ల నాన్ సింక్ లో ఉంది. రేటింగ్: 3/10 Quote
Staysafebro Posted January 11, 2018 Report Posted January 11, 2018 1 minute ago, Tadika said: rating marchu Ok 1/10 Quote
Tadika Posted January 11, 2018 Report Posted January 11, 2018 1 minute ago, Staysafebro said: Ok 1/10 min 5 Quote
aakathaai Posted January 11, 2018 Report Posted January 11, 2018 4 hours ago, Tadika said: min 5 Enduku aa 5. 10 ki 10 eseskooo Quote
Biskot Posted January 11, 2018 Report Posted January 11, 2018 1 hour ago, aakathaai said: Enduku aa 5. 10 ki 10 eseskooo 10 ki 10 Point 5..... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.