Jump to content

Recommended Posts

Posted

davos-16012018-1.jpg

ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథ చక్రాలు.. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్‌ నగరంలో పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతినీ, అమరావతి విశిష్టతనూ స్విట్జర్లాండ్‌లో చాటుతూ.. ఆంధ్రప్రదేశ్ బస్సు రయ్యి రయ్యిన దూసుకు వెళుతోంది. ఆంధ్రా బస్సేంటి..? స్విట్జర్లాండ్‌లో పరుగులు పెట్టడం ఏంటి..? అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్తున్న సందర్బంగా..పెట్టుబడుల్ని ఆకర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ బస్సు స్విట్జర్లాండులో పరుగులు పెడుతోంది.

 

davos 16012018 2

స్విట్జర్లాండ్‌లో.. ప్రపంచ ఆర్థిక వేదికగా భాసిల్లే దావోస్‌ నగరంలో.. ఓ బస్సు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ యువర్‌ బిజినెస్‌ అన్న స్లోగన్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లోగోలతో ఉన్న ఈ బస్సు.. అక్కడి ప్రయాణికులను రయ్యి రయ్యిమంటూ గమ్యస్థానాలకు చేరుస్తోంది. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట, విదేశీ పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో జరిగే ఎకనామిక్‌ ఫోరమ్‌లను లక్ష్యంగా చేసుకొని.. పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే... ఈ బస్సు ద్వారా.. ఇలా ఏపీ రాష్ట్రానికి ప్రచారం కల్పిస్తోంది.

davos 16012018 3

దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక వేదిక 48వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా హాజరు కానుంది. దావోస్‌కు వచ్చే వాణిజ్య వేత్తలను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం సదస్సుకు వారం ముందు నుంచే బస్సు ద్వారా ఏపీ గురించి ఇలా ప్రచారం ప్రారంభించింది. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. వాణిజ్యవేత్తలంతా ఇట్టే గుర్తుపట్టే విధంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. దావోస్ లాంటి నగరంలో ప్రచార రథాలను పరుగులను పెట్టించడం ద్వారా విదేశీలను విశేషంగా అకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెద్ద మొత్తంలో రానున్నాయనే అభిప్రాయం ఏపీ సర్కార్ లో ఉంది. ప్రభుత్వ ఉద్దేశమెలా ఉన్నా.. దావోస్‌ రహదారులపై దూసుకుపోతున్న రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు మాత్రం.. స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Posted
3 ఒప్పందాలు.. 25 ద్వైపాక్షిక సమావేశాలు
22 నుంచి  సీఎం దావోస్‌ పర్యటన
ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు బృందం
ఏపీ లాంజ్‌ను సందర్శించనున్న మోదీ
పర్యటన వివరాలు వెల్లడించిన  పరకాల
20ap-main11a.jpg

ఈనాడు, అమరావతి: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఈనెల 22 వేకువజామున బయలుదేరనుంది. తొలుత జ్యూరిక్‌ చేరుకుని అక్కడి నుంచి దావోస్‌ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. 25 ద్వైపాక్షిక, 5 అల్పాహార, విందు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. సదస్సు పరిధిలో మూడు కార్యక్రమాల్లో ప్రసంగిస్తారు. ఈ నెల 25 వరకూ జరిగే దావోస్‌ పర్యటన విశేషాలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ శనివారం విలేకరులకు వెల్లడించారు.

ముఖ్య ఒప్పందాలు: జ్యూరిక్‌-అమరావతి మధ్య సిస్టర్‌ సిటీ ఒప్పందం నీ హిటాచీ సంస్థతో ఒప్పందం నీ ఏపీలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి, పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్‌ హోఫర్‌తో ఒప్పందం

సీఎం ప్రసంగించే అంశాలు
24న: ఆహారభద్రత-వ్యవసాయరంగం భవిష్యత్తు రూపకల్పన దిశగా తేవాల్సిన వ్యవస్థాగత ఆవిష్కరణలు
25న: ఏపీలో సహజ సాగు విధానాల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తేవడం, వ్యవసాయ రంగానికి సరికొత్త దార్శనికత

ద్వైపాక్షిక సమావేశాలు
* యునిలివర్‌ కంపెనీ సీఈవో పౌల్‌ పోల్‌ మ్యాన్‌, సౌదీ అర్మకో ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సైద్‌ హద్రమీ, భారత్‌ ఫోర్ట్జ్‌ లిమిటెడ్‌ సీఎండీ బాబా కల్యాణి, విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, అపోలో టైర్స్‌ ఎండీ నీరజ్‌ కన్వర్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, ఎయిర్‌బస్‌ సీఈవో డిర్క్‌ హక్‌, అలీబాబా క్లౌడ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ సీమన్‌ హు, మహీంద్ర గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, బ్లూమ్‌బెర్గ్‌ మీడియా సీఈవో జస్టిన్‌ బీ స్మిత్‌ తదితరులతో సమావేశాలు జరుగుతాయి.

ఏపీ లాంజ్‌-ప్రధానమంత్రి సందర్శన
23న: 2 నుంచి 3 గంటల మధ్య ప్రధాని నరేంద్రమోదీ దావోస్‌లోని ఏపీ లాంజ్‌ను సందర్శిస్తారు.

ఇతర ముఖ్య కార్యక్రమాలు
* ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన అనంతరం క్రిస్టల్‌ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.
* ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలోనూ, ఏపీ-జపాన్‌ ఫోరం ఆధ్వర్యంలో జరిగే భోజన సమావేశంలోనూ పాల్గొంటారు.

* బజాజ్‌ గ్రూపు నైట్‌ క్యాప్‌ ఆధ్వర్యంలో జరిగే రాత్రి విందు సమావేశానికి హాజరవుతారు.
* రేపటి కోసం-సాంకేతికత అనే అంశంపై వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్ఠిలో పాల్గొంటారు.

* యూఎన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్హేయిన్‌తో విందు సమావేశం
* బహ్రెయిన్‌ పెట్రోలియం కంపెనీ ఛైర్మన్‌ షేక్‌ బిన్‌ ఖలీపా అల్‌ ఖలీపాతో విందు సమావేశం.

Posted
దావోస్ పర్యటనలో ఏపీ కుదుర్చుకోనున్న పలు ఎంఓయూలు ఇవే...
21-01-2018 11:12:32
636521299412234588.jpg
 
విజయవాడ: ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు ప‌య‌న‌మ‌వుతున్నారు. రేపటి నుంచి 25 వరకు సీఎం దావోస్‌లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయం, ఔషధరంగం, సోలార్ ఎనర్జీ ,ఐటీ , మౌలిక వసతులు వంటి కీలక రంగాలకు సంబంధించిన ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఇవాళ సాయంత్రం చంద్రబాబు దావోస్ బయలుదేరనున్నారు.
 
వరుసగా నాల్గో ఏడాది వరల్డ్ ఎకనమిక్ సదస్సులో ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇప్పటికే ఎపీ పారిశ్రామిక ప్రగతిరథం దావోస్‌లో చక్కర్లు కొడుతోంది. గత రెండేళ్లుగా దావోస్ పర్యటనలో భాగంగా ఎపీ ప్రభుత్వం అనేక కీలక పెట్టుబడులను తీసుకురాగలిగింది. ఈసారి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో కీలకమైన ఉపన్యాసాల్లో ప్రధాన వక్తగా చంద్రబాబు ఉండబోతున్నారు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన గంటన్నరపాటు గడపనున్నారు. గతం కంటే భిన్నంగా ఈ సారి వ్యవసాయం-భవిష్యత్తు, ఆహార భద్రత, గ్లోబల్ ఫండ్, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. దావోస్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలను, వచ్చే నెలలో రాష్ట్రంలో జరబోయే సిఐఐ సదస్సుకు సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
 
దావోస్ పర్యటనలో మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత క్రిస్టల్ అవార్డుల ప్రధాన వేడుకలో పాల్గొంటారు. అదేరోజు డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్‌కు హాజరవుతారు. రెండోరోజు ఏపీలాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు..అదేరోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు వరుసగా సమావేశమవుతారు. రెండవ రోజునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎపీ లాంజ్‌ను సందర్శిస్తారు. ఇండియా లాంజ్‌లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మూడోరోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ బెల్విడర్‌లో లంచ్ ఆన్ సమావేశం అవ్వనున్నారు.. ఈ సందర్భంగా టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తరువాత సీఐఐ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్యానలిస్టుగా ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం చేపట్టిన చర్యలను, సాధించిన ప్రగతిపై చర్చిస్తారు. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ చైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు.
 
నాలుగు రోజుల పర్యటనలో మొత్తం మూడు ఎంవోయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చకోనుంది..ఫ్రాన్ హోఫర్-ఏపీఈడీబీ మధ్య ఒక అవగాహన ఒప్పందం, హిటాచీతో మరో ఎంవోయూ, జ్యురిచ్‌తో సిస్టర్ సిటీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ట్రాన్స్ ఫార్మింగ్ అగ్రికల్చర్, న్యూ అగ్రికల్చర్, టెక్నాలజీస్ ఆఫ్ టుమారో అనే అంశాలపై జరిగే సెషన్స్‌లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
Posted
ఏపీ పయనీర్‌
23-01-2018 02:00:34
 
636522696351002153.jpg
  • భారీ పెట్టుబడులు పెట్టేందుకు సై
  • 5 వేల కోట్లతో భారత్‌లోకి
  • వాటిలో అధికశాతం నవ్యాంధ్రలోనే
  • వ్యవసాయ, అనుబంధ రంగాలపై దృష్టి
  • పయనీర్‌ చైర్మన్‌ రియాన్‌ పాల్‌ హామీ
  • రియాన్‌తో భేటీ అయిన సీఎం బృందం
  • 4 రోజుల దావోస్‌ పర్యటనకు శ్రీకారం
  • తొలి రోజే జ్యూరిచ్‌లో శుభారంభం
  • జ్యూరిచ్‌తో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం
 
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటన ప్రారంభమైంది. స్విట్జర్లాండ్‌లో అడుగు పెట్టీ పెట్టగానే పెట్టుబడుల వేట మొదలైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘పయనీర్‌’ సంస్థతో ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగంలో ఈ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే... పర్యావరణ సాంకేతికత, జీవ శాస్త్రాలు, పట్టణప్రాంత అభివృద్ధిలో జ్యూరిచ్‌ ఏపీకి సహకరించనుంది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.
 
 
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పయనీర్‌ వెంచర్స్‌ సుముఖత వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ కేంద్రంగా పనిచేసే పయనీర్‌ సంస్థ.. వ్యవసాయ, వ్యవసాయాధారిత సప్లై చైన్‌ బిజినెస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఏపీలోని కుప్పం, మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఇప్పటికే ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగు రోజుల దావోస్‌ పర్యటనలో భాగంగా సోమవారం జ్యూరిచ్‌ చేరుకుంది. జ్యూరిచ్‌లో పయనీర్‌ వెంచర్స్‌ చైర్మన్‌ రియాన్‌ పాల్‌, చీఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఆఫీసర్‌ సందీప్ రాజ్‌తో సీఎం బృందం భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు.
 
 
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రియాన్‌ బృందాన్ని ఆహ్వానించారు. పూర్తి ప్రణాళికలతో వస్తే అన్ని విధాలా సహకరిస్తామని, సింగిల్‌ విండో విధానంలో మూడు వారాల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. ఏపీలో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. దీనికి రియాన్‌ స్పందిస్తూ.. రానున్న ఐదేళ్లలో భారతదేశంలో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టాలన్న యోచనలో ఉన్నామని తెలిపారు. తమ పెట్టుబడుల్లో అధికశాతం గ్రామీణ భారతంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో పెడతామని హామీ ఇచ్చారు.
 
పండ్ల తోటలు, కూరగాయల సాగుపై ఎక్కువ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఏపీలో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని రియాన్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యానవన పంటల సాగును ఉద్యమస్ఫూర్తితో కొనసాగిస్తున్నామని తెలిపారు.
 
 
రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యానవన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి, ప్రాంతానికి ఒక్కో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వివరించారు. తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడులను సాధించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. ఉద్యానవన పంటల సాగును కోటి ఎకరాలకు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా సెన్సర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
 
ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ రాష్ట్రం ఒక్క ఉద్యానవన రంగంలోనే 30 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని సీఎం తెలిపారు. ఉద్యాన వన రంగంలో వివిధ పంటల సాగును ప్రోత్సహించేందుకు పంటల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఇది వినూత్న ప్రయోగమని వివరించారు. కుప్పంలో చిన్నవిమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, దీనివల్ల పయనీర్‌ యాజమాన్యం, ప్రతినిధులు సాఫీగా రాకపోకలు సాగించవచ్చన్నారు. సరకు రవాణా కూడా సులభతరం అవుతుందని చెప్పారు. పయనీర్‌ సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా చేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
 
జ్యూరిచ్‌ అధికారులతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జ్యూరిచ్‌, ఆంధ్రప్రదేశ్‌ నడుమ సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణప్రాంత అభివృద్ధి రంగాల్లో జ్యూరిచ్‌, ఏపీ పరస్పరం సహకరించుకుంటాయి. టెక్నాలజీ వినియోగం, వినూత్న ఆవిష్కరణలతో జ్యూరిచ్‌ ముందుకు దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఇదే బాటలో పయనిస్తున్నందున సరైన సమయంలో రెండు రాష్ట్రాల నడుమ ఒప్పందం కుదిరిందని సీఎం వ్యాఖ్యానించారు.
 
ఈ ఒప్పందానికి ముందు చంద్రబాబుతో జ్యూరిచ్‌ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్‌ వాకెర్‌ స్పా, ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి బ్యూన్‌ సాటర్‌, జ్యూరిచ్‌ ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజర్‌ కొరిన్‌ వ్యేర్‌ భేటీ అయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లలో జ్యూరిచ్‌ ఎంతో ముందు ఉందని, అత్యుత్తమ జీవన ప్రమాణాలకు తాము ప్రాధాన్యమిస్తామని వారు సీఎంకి వివరించారు.
 
 
సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున యనమల రామకృష్ణుడు, జ్యూరిచ్‌ తరఫున ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్‌, ఉప మంత్రి బ్యూన్‌ సంతకాలు చేశారు. కాగా.. జ్యూరిచ్‌ ఉప మంత్రి బ్యూన్‌ గతంలో అమరావతిలో పర్యటించారు. దావోస్‌ పర్యటనలో.. ఐటీ మంత్రి లోకేశ్‌, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌ , పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు సీఎం వెంట ఉన్నారు.
 
 
సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం అంటే..!
సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.. వినూత్న సాంకేతికతను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడమే. ఏదైనా దేశంలోని ఓ రాష్ట్రం లేదా ప్రావిన్స్‌ వినూత్నమైన ఆలోచనలు.. సాంకేతికతతో ముందుకు వెళుతుంటే దాన్ని వేరే దేశంలోని రాష్ట్రం అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. గతంలో సీఎం చంద్రబాబు బృందం.. చైనా, అమెరికా, జపాన్‌, సింగపూర్‌ దేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు, ప్రావిన్స్‌లతో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నారు.
 
అమెరికా పర్యటనలో న్యూయార్క్‌ నగరంలో అమలు చేస్తున్న భద్రతాచర్యలు సీఎంని ఆకర్షించాయి. సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అక్కడ అసాంఘిక కార్యకలాపాలను చాలా వరకు కట్టడి చేశారు. ఇలాంటి వ్యవస్థను ఏపీలోనూ అమలు చేయాలన్న ఉద్దేశంతో న్యూయార్క్‌తో ఏపీ సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం చేసుకుంది.
Posted

Vammmo..Vammoooooooo........................vaaaammmmmmmmmmoooooooooo

3 years ? 

$43 Billion = INR 3,00,000 Crores Investment ????

4,30,000 Jobs created ?????

Inni pachi abaddhala?

Ittage mosam cheesi meme Hyd ni develop chesaam ani cheppuku thirigevaaru?

Asalu itvanti mosagallaku yela votes vesthunnarayya baabu?

Posted
16 hours ago, jalamkamandalam said:

Vammmo..Vammoooooooo........................vaaaammmmmmmmmmoooooooooo

3 years ? 

$43 Billion = INR 3,00,000 Crores Investment ????

4,30,000 Jobs created ?????

Inni pachi abaddhala?

Ittage mosam cheesi meme Hyd ni develop chesaam ani cheppuku thirigevaaru?

Asalu itvanti mosagallaku yela votes vesthunnarayya baabu?

avanni genuine figures

Posted
12 minutes ago, SonyKongara said:

avanni genuine figures

Agreed.. ee pettubadulanni kaaryaroopam dhaalchalante kaneesam 2014 avvudhhi.. appatidhaaka aa jaffa gadinj cm kaakunde chusthe chalu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...