SonyKongara Posted January 23, 2018 Report Posted January 23, 2018 ఇద్దరు మంత్రుల ఆఫర్ అమరనాథ్‌రెడ్డి, గంటా రెడీ అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఐటీ-పంచాయతీరాజ్ శాఖల మంత్రి లోకేశ్‌కు ఇద్దరు సహచర మంత్రుల నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయదలచుకుంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లు ఇస్తామని వారు చెబుతున్నారు. లోకేశ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. పోటీ చేస్తే ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నదానిపైనా టీడీపీలో అంతర్గతంగా కొంత చర్చ జరుగుతోంది. ఆదివారమిక్కడ టీడీపీ రాష్ట్ర స్ధాయి వర్క్‌షాపు జరిగిన సందర్భంలో పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డికి, శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్‌కు మధ్య ఇదే విషయం చర్చకు వచ్చింది. అమరనాథ్‌రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు మండలాలు గతంలో కుప్పంలో ఉండేవని, 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో పలమనేరులోకి వచ్చాయని ఆయన వివరించారు. లోకేశ్‌కు ఆసక్తి ఉంటే తాను పుంగనూరుకు మారతానని.. ఆయన పలమనేరు నుంచి బరిలోకి దిగవచ్చని చెప్పారు. లోకేశ్ ఎమ్మెల్సీ కావడానికి ముందు కూడా అమరనాథ్‌రెడ్డి తన సీటివ్వడానికి సిద్ధపడ్డారని, కానీ పనిగట్టుకుని రాజీనామా చేయించడం ఎందుకని లోకేశ్ ఎమ్మెల్సీగా వెళ్లిపోయారని కేశవ్ ఈ సందర్భంగా తెలిపారు. పుంగనూరులో మీరు పోటీచేయకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా మీ కుటుంబ సభ్యులెవరైనా బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు.. ఇంకా అంత దూరం ఆలోచించలేదని అమరనాథ్‌రెడ్డి బదులిచ్చారు. విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే అయిన మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లోకేశ్ కోసం తన సీటు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున లోకేశ్ ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది. నా నియోజకవర్గంలో కొంత నగర ప్రాంతం.. కొంత గ్రామీణ ప్రాంతం ఉంది. టీడీపీకి చాలా బలమైన సీటు. విశాఖ నగరం బాగా వేగంగా విస్తరిస్తోంది. లోకేశ్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అదింకా బాగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. నేను మరో చోట పోటీచేయడానికి రెడీ’ అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా లోకేశ్ మాత్రం స్పందించడం లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఆ సమయం వచ్చినప్పుడు చూసుకోవచ్చంటూ ఆయన దాటవేస్తున్నారు. Quote
Psyconbk Posted January 23, 2018 Report Posted January 23, 2018 Comedy gani cheyyaedhu ga nuvvu inka vallu Quote
reality Posted January 23, 2018 Report Posted January 23, 2018 Seatu size meedha manchi understanding undhi vallaki, anduke okari seat saripodhani iddari seats isthunnarana? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.