Jump to content

Gurava Reddy Atlanta gadi dog crying ... lol


Recommended Posts

Posted

To love someone is to be a constructive critique, so he/she can mend their ways and be successful. I tried all my avenues with no avail, and started resorting to social media. I made several trips to India and begged Jaganmohan Reddy gaaru to form YSRCP in the hopes that YSR rule would be continued and his legend would keep growing. What pains me most is that the top leadership of the party is oblivious to the sad reality and would not wake up.

తప్పుచెయ్యడం మానవ సహజం - దిద్దుకోవడం, భవిష్యత్లో అదే తప్పు మల్లీ చెయ్యకపోవడం తెలివిగలవాడి లక్షణం!

అనంతపూర్ జిల్లాలో ఎవరినైనా అడగండి. 2014 లో వైస్సార్సీపీ ప్రధానంగా రెండు తప్పులు చేసింది, దానికి తోడు రుణ మాఫీ ఎఫెక్టు కూడా ఉందనేది కొందరి అభిప్రాయం!

1. జేసీ బ్రదర్స్ కాళ్లా వేళ్ళా పడితే పార్టీ పట్టించుకోలేదు. అద్యక్షులవారికేమో 135 సీట్లు గెలిచేటప్పుడు వీళ్ళు అవసరమా అనే ఓవర్ కాన్ఫిడెన్స్. 30 యేల్లు అనంతపూర్ రాజకీయాల్లో మంచికో చెడుకో చక్రం తిప్పిన జేసీ బ్రదర్స్ లెవెల్ మాత్రం ఉదయం, ఆంధ్రజ్యొతిలలో ఒక సామన్య పాత్రికేయుడుగా పనిచేసి ఏదో దూరపు చుట్టమైనందుకు పార్టీలో ఒక పెద్ద పదవి, పార్టీ ఆఫీసులో ఒక రూం దొరికి కనీస రాజకీయ అవగాహన లేని, ఒక పది నిమిషాలు ఎవరితోనన్నా మాట్లాడితే అబ్బా ఏమి ఖర్మరా బాబు ఈయనతో మాట్లాడాల్సొచ్చింది అనేటట్టుండే ఒకాయన లెవెల్ కాదు! ఎవరి నిర్వాకమో గాని జేసీ బ్రదర్స్ ఈయన గారితో డీల్ చెయ్యాల్సొచ్చింది పార్టీలోకి రావడానికి అదే పెద్దవమానం వాల్లకి - అనంతపూర్లో తర్వాతేమైందో అందరికీ తెలిసిన విషయమే! 14కి 12 గెలవాల్సిన వైఎస్సార్సీపీ జిల్లాలో 12 ఓడిపోయింది. రాజకీయాల్లో నేటికీ ఓనమాలు రాని ఈయనను ఇప్పుడు జిల్లాల ఇన్ఛార్జుని చెయ్యడం చంద్రబాబు బాషలో దిస్ ఈజ్ రియల్లీ దారుణం!

2. మేనమామని అనంతపూర్ జిల్లా ఇన్ఛార్జుని చెయ్యడం. ఒక మనిషి సింగిల్ హ్యాండెడుగా దేన్నైనా నాశనం చెయ్యాలంటే ఆలోచించాల్సిన పనే లేకుండా మీరు ఆయనకి ఫోన్ చెయ్యవచ్చు! ఇతనొకడిని తిరుపతాయనొకడిని కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3-4 పర్సెంట్ వోట్లు పోతాయి! 2014లో అనంతపూర్ జిల్లాలో పార్టీని నాశనం చేశాడని రివ్యూ మీటింగుల్లో అందరూ నెత్తీ నోరు బాదుకుంటే అద్యక్షులవారు ఈయన్ని వెంటనే తొలగించారు! సొప్పర్ అనుకున్నా నేను. ఎవరి వత్తిడో లేక మామంటే తనకున్న అమిత ప్రేమో గాని అద్యక్షులవారు తర్వాతేమి చేసారు? పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి బాగా బలంగా ఉన్న కర్నూలు, చిత్తూరు జిల్లాలకి ఇన్ఛార్జుని చేసారు!

ఏ రాజకీయ పార్టీ అయిన ప్రజల పార్టీ కావాలి, కుటుంబ పార్టీ చుట్టాల పార్టీ కాకూడదు! అందరూ అవసరమే పార్టీకి కాని అద్యక్షులవారి చుట్టాలను కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్లలో పెడితే వచ్చే అనర్ధమేమిటంటే చుట్టమనగానే ఆ వ్యక్తులు తప్పుచేసినా ఎదురు ప్రశ్నించే మనుషులు తక్కువవుతారు, పార్టీకి దూరమవుతామేమోనని! దివ్యా రెడ్డి అనే ఆమె ఏ క్వాలిఫికేషన్లతో, ఏ రాజకీయ అవగాహనతో, ఏ సోషల్ మీడియా అనుభవంతో సోషల్ మీడియా హెడ్ అయంది? ఇలాంటి వాళ్ళ మీద ఇంకో పోస్ట్ పెడతాను త్వరలో!

చుట్టాలకేమి బానే ఉంటారు కోట్లు సంపాదించారు - గెలిస్తే మల్టిప్లై చేసుకుంటారు! అణగారిపోయేది రాష్ట్ర ప్రజలే! వైఎస్సారుని అభిమానించినందుకు ఈ చుట్టాల రూపంలో శిక్షేయవద్దు జగన్మోహన్ రెడ్డి గారు! తప్పుడోల్లయినా పనికిమాలిన వాల్లయినా చుట్టాల్నే నమ్ముతాను, బయటోల్లని నమ్మననుకుంటే ఒక రాజకీయ పార్టీ, ఒక సంస్థ నడవదు! చెక్స్ అండ్ బ్యాలెన్సులు పెట్టుకొని నడిపించాలి. ఓట్లేసే ప్రజలు బయటోల్లే, వేయించెవాళ్ళు బయటోల్లే, పల్లకీలు మోసేదీ బయటోల్లే - కానీ పల్లకీలో కూర్చోని ఊరేగేది పనికిమాలిన చుట్టాలా?

ఇక్కడ మేనమామ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది - అతని చరిత్ర తవ్వితే ఆ దుర్గంధాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు!

ఈ పోస్టు మీద నన్ను ప్రశ్నించే ముందు ఒకటి గుర్తుంచుకోండి. డాక్టర్ వైఎస్సార్ సడ్డకుడిని గాని, పాత్రికేయుడిని గాని, అకౌంటెంటుని గాని రాజకీయాలకి దరిదాపుల్లోకి రానివ్వలేదు! ఇదీ పెద్దాయన రాజనీతిజ్ణత!! జోహార్ వైస్సార్!

మారండిరా బాబులూ - కోట్లాది ప్రజల ఆకాంక్షలూ జీవితాలూ మీ మీద ఆధారపడున్నాయ్! డాక్టర్ వైఎస్సార్ మీదున్న మా అచంచల అభిమానం మాకు శాపం కానివ్వకండి! మేనమామ, బాబాయి, తిరుపతాయన, అకౌంటెంట్లు కాదు డాక్టర్ వైఎస్సారులా కులాతీతంగా మంచి టీముండాలి!

ఇదేదో ఫ్రస్టేషన్లో రాయడంలేదు, తీవ్ర ఆవేదనతో రాజశేఖర రెడ్డి గారి అంశతో 2014లోనే అధికారంలోకొచ్చి ఆయన సువర్ణ పాలనని కొనసాగంచాల్సిన వైఎస్సార్సీపీ 2019 తర్వాత కనుమరుగైపోయే ప్రమాదంలో ఉన్నందుకు కడుపు తరుగ్గుపోయి రాస్తున్నది!

కల్లుతెరవండి అద్యక్షులు వారూ - నిజాయితీతో పార్టీని ప్రజలపరం చెయ్యండి! మీరొక్కరు మీ కష్టంతో తెలుగుదేశమనే మాఫియాను చంద్రబాబనే కొండను ఢీకొడితే నెత్తిపగిలి రక్తమొస్తుందే గాని వాల్లని ఓడించలేరు! పనికిమాలిన అవగాహనలేని చుట్టాలని పక్కనబెట్టి సమర్ధులని వినియోగించుకుని పచ్చ మాఫియాని అరికట్టండి - తెలుగు ప్రజలు మీకు జేజేలు పలుకుతారు!

Posted

An offline message for me from a hardcore YSRCP supporter in the ground.

అద్భుతమైన మాట చెప్పారు సార్.... ఒక్క రెడ్డి సామాజికవర్గమే కాదు..... 
Y.S.R kutumbam lo unna prati okkaridi ide samasya....
గ్రామాల్లో చాలా ఘోరంగా ఉంది సర్ పరిస్థితి... పట్టించుకోవాల్సిన వాళ్లు చోద్యం చూస్తున్నారు... కార్యకర్త భుజం తట్టే నాయకులు లేరు... ఉన్నా వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు... రాజకీయం ,ప్రజా సేవ అంటే కేవలం M.L.A గా గెలిస్తేనే మాత్రమే చేసేది... ఓడిపోతే నియోజకవర్గం మొహం కూడా చూడం అనే నాయకులు ప్రస్తుతం మన పార్టీ లో కుప్పలు కుప్పలు గా ఉన్నారు సర్.... గ్రామాల్లో కార్యకర్తలని కాపాడుకోలేక, ఓటర్ ని నిలబెట్టుకోలేక మా లాంటి ద్వితీయ శ్రేణి పార్టీని అభిమానించే క్యాడర్ నిరాశతో ఉన్నాం సర్.... ఎలక్షన్స్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రభుత్వ దాడులు ఎక్కువ అవుతున్నాయి... ఏం చేయాలో అర్థం కాదు.... చేయి తట్టే నాయకులు అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయారు.... కేవలం ఫోటో ల కోసం మీడియా లో షోయింగ్ ల కోసమే రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు సార్....ఎం చేయాలో అర్థం కావట్ల... పరిస్థితి ఇలా కొనసాగితే 2019 లో కూడా అధికారం లోకి రాలేము సర్.

Posted

పచ్చి నిజం ఒకటి చెప్పాలంటే రాష్ట్రంలో రెడ్డి చరిత్ర రాజశేఖర్ రెడ్డి చావుతో ముగిసింది . కాస్తో కూస్తో మిగిలితే జగన్ నాయకత్వంలో సచ్చింది. నా అభిప్రాయం అయితే మైనార్టీలుగా బతకడం లేదా రాష్ట్రం దాటడం అంతే. రాష్ట్రాన్ని ఏలే వర్గానికి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సరైన నాయకుడు కాలేక పోయాడు జగన్. సరే నిదానంగా అవుతాడన్న నమ్మకం కూడా సడలుతుంది . నిజం చెప్పాలంటే మనకి భవిష్యత్ లేదు అని తలుచుకొంటే భయంగా ఉంది. కానీ అదే నిజమేమో. A friend's message to me to which I agree.

I am not a castist. I look at Telugu people as one unit. The failure of YSRCP would have a profound effect on all but one community. The problem I see here is that YSRCP is headed by an inexperienced Jagan, the supporting systems being so weak that they don't have guts to confront him on his lack of qualifications and ideas. I don't know who to blame - the inexperienced and feudal leader or his chamchas that cannot make him see the reality. God, save us from the yellow mafia.

Posted

Antha strong community support pettukuni kuda Jagan em cheyyalekapothunnadu antey.... PK help theesukunna peekedemi vundadhu.... He has a lot to learn and he is not even trying to change.... CBN & YSR laantolley change avvalsi vachindi.... KTR changed his tone, language & attitude to emerge as seasoned politician, Lokesh getting better with his speech and ground level work. 

Only Jaggu wouldn't change.... uff... %$#$

Posted

Monna evaro local leader intlo stay chesinappudu room lo vunna jagan ni kalavaalantey kudaradhu ani cheppandanta security guard. Yedho chola raajyaaniki raaju anukuntunnadu... 

 

Balayya = Jaggu. Too stupid & arrogant to be leaders.. %$#$

Posted
2 minutes ago, mettastar said:

ee sodhi antha ssadive opika ledu

@gr33d

 matter in 2 lines plz

Posted

TV9 odiki  fwd chesthe oka 1hr program 3,4days esukuntademo .. Gogineni uncle kuda kaaliga unnattunnadu

Posted
5 hours ago, mettastar said:

TV9 odiki  fwd chesthe oka 1hr program 3,4days esukuntademo .. Gogineni uncle kuda kaaliga unnattunnadu

@3$%

Posted
6 hours ago, Pichekkistha said:

Antha strong community support pettukuni kuda Jagan em cheyyalekapothunnadu antey.... PK help theesukunna peekedemi vundadhu.... He has a lot to learn and he is not even trying to change.... CBN & YSR laantolley change avvalsi vachindi.... KTR changed his tone, language & attitude to emerge as seasoned politician, Lokesh getting better with his speech and ground level work. 

Only Jaggu wouldn't change.... uff... %$#$

only 3-4 districts lo ney ippudu aa community andhulo kuda JC ni dhuram petti Anantpur lo bokka pettukunnadu after elections nakka kurnool vallani trap chesi bokkapettadu.. seema TG lo join ayyi untey easy ga CM ayipoyevaadu aa two areas kalipithey aa community ney full domination. TG lo congi ki charisma unna reddy leader ledu. AP lo charisma unna community support ledhu 

Posted
41 minutes ago, ARYA said:

ekkada nunchi ettukostav iyyani @3$%

vaadi fb page lo ilaanti aanimuthyaalu enno 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...