Jump to content

Lokesh USA Tour

Recommended Posts

Posted
అమెరికాలో లోకేష్‌కు ప్రవాసాంధ్రుల స్వాగతం
28ap-state11a.jpg

ఈనాడు, అమరావతి: తొమ్మిది రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్న ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి లోకేష్‌కు డాలస్‌లో ఆదివారం ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత మూడున్నరేళ్లలో ఎన్నో సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. హెచ్‌సీఎల్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌ వంటి సంస్థల రాకతో ఐటీ రంగంలోనూ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున ప్రవాసాంధ్రులంతా ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని మంత్రి సూచించారు.

Posted
లాస్ ఏంజిల్స్‌లో తెలుగు సీఈవోలను కలిసిన లోకేష్
29-01-2018 14:11:09
 
636528318681258308.jpg
 
లాస్‌ఏంజిల్స్: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ లాస్ ఏంజిల్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం వరుసగా తెలుగు సీఈవోలను కలిశారు. అమెరికా వచ్చే వారికి నైపుణ్య శిక్షణ అందించాలని కోరారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని తెలుగు సీఈవోలను ఆయన కోరారు. పిబి సిస్టమ్స్ కంపెనీ సీఈవో వేణు గార్నేని లోకేష్ కలిశారు. సాఫ్ట్‌వేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్సియల్, హెల్త్‌ కేర్‌లో పిబి సిస్టమ్స్ఈ  కామర్స్ సర్వీసెస్‌ను అందిస్తున్నది. ఏపీలో హెల్త్ కేర్, టెలి మెడిసిన్‌లో అవకాశాలు ఉన్నాయని, కార్యకలాపాలు విస్తరించాలని మంత్రి కోరారు.
 
సెంట్రా మెడ్, ప్రెస్ మార్ట్ డిజిటల్ మీడియా కంపెనీ సీఈవో విక్రమ్ తొర్పునూరిని మంత్రి లోకేష్ కలిశారు. ఏపీలోని పాలసీలు, రాయితీలపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని సీఈవో విక్రమ్ అన్నారు. ఇండియాలో విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు. తర్వాత ఐస్పేస్ సీఈవో రాజేష్ కొత్తపల్లిని లోకేష్ కలిశారు. టెక్నాలజీ, కన్సల్టింగ్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్‌, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్, ఐటీ రంగాల్లో ఐస్పేస్ సేవలు అందిస్తున్నది. ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు, రాయితీలు ఇస్తున్నామని లోకేష్‌ తెలుపగా... విశాఖపట్టణంలో కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నామని ఐస్పేస్ సీఈవో చెప్పారు. సాఫ్ట్‌ హెచ్క్యూ సీఈవో క్రాంతి పొన్నం మాట్లాడుతూ ఏపీలో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్నామని, గుంటూరులో కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
 
అడ్వాన్డ్స్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ కంపెనీ సీఈవో రిచర్డ్‌ కెయిన్, వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పాలోమీరాను మంత్రి లోకేష్‌ కలిశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి... నూతన పాలసీలు తీసుకొస్తున్నట్లు మంత్రి వారికి వివరించారు. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడబోతున్నామని, లితియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న...అడ్వాన్డ్స్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ తయారీ రంగాన్ని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్నామని లోకేష్‌ తెలిపారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన రిచర్డ్‌ కెయిన్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వస్తామని అన్నారు. మార్కెట్ అంచనా, పాలసీలు, రాయితీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండియాలో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఏపీలో కంపెనీ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రిచర్డ్‌ కెయిన్ చెప్పారు.
 
సాఫ్ట్‌ హెచ్క్యూ సీఈవో క్రాంతి పొన్నంను మంత్రి లోకేష్‌ కలిశారు. ఎంటర్‌ప్రైస్ స్టాఫ్‌ అగ్యుమెంటేషన్, మేచ్యుర్ మోడల్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ కంట్రోల్, సేర్వేలెన్స్ ప్లాన్ తదితర సేవలను సాఫ్ట్ హెచ్క్యూ అందిస్తున్నది. సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ కోసం ఈ-ప్రగతి ప్లాట్‌ ఫార్మ్ ప్రారంభించామని పొన్నం తెలిపారు. బ్లాక్‌చైన్, బిగ్‌ డేటా, డేటా అనలిటిక్స్, ఫిన్‌టెక్ లాంటి అధునాతన టెక్నాలజీల అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నట్లు లోకేష్‌ చెప్పారు. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
Posted
లాస్‌ ఏంజెల్స్ లో లోకేశ్‌ పెట్టుబడుల వేట

10423929BRK71A.JPG

లాస్‌ ఏంజెల్స్: ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగానూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్ ఏంజెల్స్ లో  ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా  వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.  సిస్ ఇంటెలి సిఈఓ రవి హనుమారతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రవి స్పందిస్తూ.. తక్షణం 100 మంది ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్‌లో సంస్థను ప్రారంభిస్తామని, రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సులభతరంగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన వివిధ పాలసీలను లోకేశ్ వారికి వివరించారు. 

10424429BRK71B.JPG

అనంతరం అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్  మైక్ పాలో మీరాతోను లోకేశ్ సమావేశమయ్యారు. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ రంగాన్ని , ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వారికి వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి రూపొందించిన నూతన పాలసీలను సంస్థ ప్రతినిధుల దృష్టికి లోకేశ్ తీసుకెళ్లారు. 
త్వరలోనే రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మార్కెట్ అంచనా, పాలసీలు, రాయితీల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్‌లో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని...  
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్ భరోసా ఇచ్చారు. సాఫ్ట్ హెచ్క్యూ సిఈఓ క్రాంతి పొన్నం తోను మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఎంటర్ప్రైస్ స్టాఫ్ అగ్యుమెంటేషన్, మెచ్యూర్‌ మోడల్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ కంట్రోల్, సేర్వేలెన్స్ ప్లాన్ తదితర రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో కాగిత రహిత పాలనకు ప్రయత్నిస్తున్నామని... ఈ-ప్రగతితో పాటు బ్లాక్ చైన్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ ఫిన్ టెక్ లాంటి అధునాతన సాంకేతికతలను ప్రోత్సహిస్తున్న తీరును లోకేశ్ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో తమ కార్యకలాపాలు విస్తరించాలి అనుకుంటున్నట్లు తెలిపిన సీఈవో క్రాంతి పొన్నం.. త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు రానున్నట్లు వెల్లడించారు.

10424929BRK71C.JPG

Posted

bl@stbl@st Jai Balaya bl@stbl@st

Posted

ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగానూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు .

bl@st TESLA's next home... AP..Jai Lokesh...bl@st

Posted

donations roopam lo dollars (black) ni teeskelli..... akkada invest chesinattu chooinchi white cheyadam

lokesh anna 15% commission eskovatam... bhala lokeshanna..bhala

periodical ga US ravadaniki avasaram em undhi?

Posted
7 minutes ago, chicchara said:

donations roopam lo dollars (black) ni teeskelli..... akkada invest chesinattu chooinchi white cheyadam

lokesh anna 15% commission eskovatam... bhala lokeshanna..bhala

periodical ga US ravadaniki avasaram em undhi?

Related image
Posted
5 hours ago, SonyKongara said:
లాస్‌ ఏంజెల్స్ లో లోకేశ్‌ పెట్టుబడుల వేట

10423929BRK71A.JPG

లాస్‌ ఏంజెల్స్: ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగానూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్ ఏంజెల్స్ లో  ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా  వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.  సిస్ ఇంటెలి సిఈఓ రవి హనుమారతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రవి స్పందిస్తూ.. తక్షణం 100 మంది ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్‌లో సంస్థను ప్రారంభిస్తామని, రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సులభతరంగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన వివిధ పాలసీలను లోకేశ్ వారికి వివరించారు. 

10424429BRK71B.JPG

అనంతరం అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్  మైక్ పాలో మీరాతోను లోకేశ్ సమావేశమయ్యారు. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ రంగాన్ని , ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వారికి వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి రూపొందించిన నూతన పాలసీలను సంస్థ ప్రతినిధుల దృష్టికి లోకేశ్ తీసుకెళ్లారు. 
త్వరలోనే రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మార్కెట్ అంచనా, పాలసీలు, రాయితీల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్‌లో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని...  
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్ భరోసా ఇచ్చారు. సాఫ్ట్ హెచ్క్యూ సిఈఓ క్రాంతి పొన్నం తోను మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఎంటర్ప్రైస్ స్టాఫ్ అగ్యుమెంటేషన్, మెచ్యూర్‌ మోడల్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ కంట్రోల్, సేర్వేలెన్స్ ప్లాన్ తదితర రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో కాగిత రహిత పాలనకు ప్రయత్నిస్తున్నామని... ఈ-ప్రగతితో పాటు బ్లాక్ చైన్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ ఫిన్ టెక్ లాంటి అధునాతన సాంకేతికతలను ప్రోత్సహిస్తున్న తీరును లోకేశ్ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో తమ కార్యకలాపాలు విస్తరించాలి అనుకుంటున్నట్లు తెలిపిన సీఈవో క్రాంతి పొన్నం.. త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు రానున్నట్లు వెల్లడించారు.

10424929BRK71C.JPG

238xew.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...