SonyKongara Posted January 29, 2018 Report Posted January 29, 2018 సంతోష నగరాల సదస్సుకు విద్యార్థులు 29-01-2018 01:24:10 వారి ఆలోచనలు పంచుకునేలా ఏర్పాట్లు సీఆర్డీఏకు చంద్రబాబు ఆదేశం అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్‌లో జరుగనున్న ‘‘సంతోష నగరాల సదస్సు-అమరావతి 2018’’లో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని సీఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆదివారం సీఆర్డీఏ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిని అత్యంత సంతోషకర నగరంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కూడా ఆలోచనలు పంచుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆర్థిక, సాంకేతిక ఫలాలు అందాలని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రజా కేంద్రీకృత వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అమరావతిని సంతోషకర నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. దేశంలో అతి చిన్న వయసున్న అమరావతి నగరం... అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భవిష్యత్ ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా నిలవనుందని, ఇది తనకెంతో సంతోషకరమని సీఎం చెప్పారు. క్లౌడ్ మేనేజ్మెంట్, కృత్రిమ మేధ, డేటా అనాలసిస్, సైబర్ భద్రత, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో అమరావతిని దేశానికి కేంద్రంగా మార్చాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం వెల్లడించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.30-40 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, కమిషనర్ శ్రీధర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, సీఎం ప్రత్యేక సీఎస్ సతీశ్‌చంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీపార్థసారథి తదితరులు పాల్గొన్నారు. Quote
Android_Halwa Posted January 29, 2018 Report Posted January 29, 2018 Ooru kuda nagaram antunaru iyalrepu paithyam ekuvaindi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.