Jump to content

Recommended Posts

Posted
కళ్లు చెదిరే ఆస్తులు! 
అనిశాకు చిక్కిన వుడా అదనపు సీయూపీ 
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు 
ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువ రూ.40 కోట్ల పైనే.. 
29hyd-crime1a.jpg

29hyd-crime1c.jpgఈనాడు - విశాఖపట్నం: ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన నెల జీతం కేవలం రూ.1,300.. ప్రస్తుతమది రూ.90వేలు.. వారసత్వ ఆస్తులేం లేవు.. ఇప్పుడు మాత్రం ఆదాయానికి మించిపోయాయ్‌! ఆయన గడించిన ఆస్తుల పుస్తక విలువ రూ.4కోట్లయితే.. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.40కోట్ల పైమాటే! 15 బ్యాంకు ఖాతాలు, ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఇంట్లోనే మూడు లాకర్లు,  బంగారు ఆభరణాలు.. ఇదంతా అవినీతి నిరోధక శాఖకు చిక్కిన విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) అదనపు ముఖ్య నగర ప్రణాళిక అధికారి(అడిషనల్‌ సీయూపీ) పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ ఆర్జన. గుంటూరులో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో సంయుక్త సంచాలకులుగా పనిచేస్తూ ఈనెల 2న డిప్యుటేషన్‌పై వుడాలో ఆయన విధుల్లో చేరారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న సమాచారం మేరకు రహస్య విచారణ జరిపిన అనిశా.. ఆంధ్రప్రదేశ్‌ డీజీ ఆర్పీ ఠాగూర్‌ ఆదేశాల మేరకు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రదీప్‌కుమార్‌ నివాసాలతోపాటు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఐదుచోట్ల సోమవారం ఉదయం ఐదింటి నుంచి తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌, అనంతపురం, ఒంగోలు, విజయవాడ, గుంటూరులలోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు. పెద్దఎత్తున స్థిర, చరాస్తులు గుర్తించారు విశాఖలోని వుడా కార్యాలయంలోని ప్రదీప్‌కుమార్‌ ఛాంబర్‌లోనూ తనిఖీలు సాగాయి. వీటికి కృష్ణా జిల్లా అనిశా డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాద రావు ఆధ్వర్యం వహించారు. ప్రదీప్‌కుమార్‌ను అరెస్ట్‌చేసి విజయవాడ అనిశా కోర్డులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.

29hyd-crime1b.jpg

అనిశా గుర్తించిన ఆస్తులు 
* ఇంటి స్థలాలు: 5, ఫ్లాట్లు: 4, సాగు భూములు: 9.20ఎకరాలు. 
* వాహనాలు: మారుతి బ్రిజ్జా (ఏపీ31 డీకే123), రెండు ద్విచక్రవాహనాలు. 
* బంగారం: 2.7కిలోలు (విలువ రూ.70లక్షలు), ప్లాటినం ఉంగరాలు: రెండు, వెండి ఆభణాలు: 12.5 కిలోలు (విలువ రూ. 4 లక్షలు). 
* నివాసంలో గుర్తించిన ఇంటి సామగ్రి ఖరీదు రూ. 21 లక్షలు

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    11

  • Bhai

    7

  • perugu_vada

    4

  • JambaKrantu

    2

Top Posters In This Topic

Posted

Nippu CBN World lo number one corruption free state rule lo,  Real Time Governance Dash Boards kaalam lo how is this possible. This must be fake news. 

Posted
అవినీతికి ప్రణాళిక 
అనిశాకు చిక్కిన వుడా అదనపు సీయూపీ 
తెలుగు రాష్ట్రాల్లో 12చోట్ల సోదాలు 
ఆస్తుల విలువ రూ.40 కోట్ల పైనే 
29ap-main5a.jpg

ఈనాడు, విశాఖపట్నం: ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన నెల జీతం కేవలం రూ.1,300.. ప్రస్తుతమది రూ.90వేలు.. వారసత్వ ఆస్తులేం లేవు.. ఇప్పుడు మాత్రం ఆదాయానికి మించిపోయాయ్‌! ఆయన గడించిన ఆస్తుల పుస్తక విలువ రూ.4కోట్లయితే.. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.40కోట్ల పైమాటే! 15 బ్యాంకు ఖాతాలు, ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఇంట్లోనే మూడు లాకర్లు,  బంగారు ఆభరణాలు.. ఇదంతా అవినీతి నిరోధక శాఖకు చిక్కిన విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) అదనపు ముఖ్య నగర ప్రణాళిక అధికారి(అడిషనల్‌ సీయూపీ) పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ ఆర్జన. గుంటూరులో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో సంయుక్త సంచాలకులుగా పనిచేస్తూ ఈనెల 2న డిప్యుటేషన్‌పై వుడాలో ఆయన విధుల్లో చేరారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న సమాచారం మేరకు రహస్య విచారణ జరిపిన అనిశా.. ఆంధ్రప్రదేశ్‌ డీజీ ఆర్పీ ఠాగూర్‌ ఆదేశాల మేరకు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహించింది. ప్రదీప్‌కుమార్‌ నివాసాలతోపాటు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఐదుచోట్ల సోమవారం ఉదయం ఐదింటి నుంచి తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌, అనంతపురం, ఒంగోలు, విజయవాడ, గుంటూరులలోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు. పెద్దఎత్తున స్థిర, చరాస్తులు గుర్తించారు విశాఖలోని వుడా కార్యాలయంలోని ప్రదీప్‌కుమార్‌ ఛాంబర్‌లోనూ తనిఖీలు సాగాయి. వీటికి కృష్ణా జిల్లా అనిశా డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాద రావు ఆధ్వర్యం వహించారు. ప్రదీప్‌కుమార్‌ను అరెస్ట్‌చేసి విజయవాడ అనిశా కోర్డులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.

ఇదీ గత చరిత్ర.. 
ప్రదీప్‌కుమార్‌ విశాఖలోని వాల్తేరు క్లబ్‌ ఎదురుగా నటరాజ్‌ టవర్‌లో ఉంటున్నారు. ఈయన స్వగ్రామం కర్నూలు జిల్లాలోని పోతికొండ మండలంలోని చక్రాల. 1984లో ప్రభుత్వ సేవల్లో చేరిన ప్రదీప్‌కుమార్‌ అనంతపురం జిల్లా గుంతకల్‌లో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టరుగా పనిచేశారు. 1991లో  టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌గా.. 1999లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా.. 2013లో సిటీ ప్లానర్‌(డిప్యూటీ డైరెక్టర్‌)గా.. ఈ ఏడాది టౌన్‌ ప్లానింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ వుడాకు వచ్చారు. 2015-16లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి సిటీప్లానర్‌గానూ పనిచేశారు. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ప్రదీప్‌కుమార్‌ విశాఖలో బాధ్యతలు స్వీకరించిన తక్కువ కాలంలోనే అనిశా దాడుల్లో చిక్కారు.

29ap-main5c.jpg

అక్రమార్జన చాంతాడంత.. (అనిశా అధికారులు వెల్లడించిన మేరకు) 
ప్రదీప్‌ పేరిట.. 
* విశాఖ నగర పరిధి మధురవాడలో 2005లో రూ.2.40లక్షలతో కొన్న 500చ.గ. ఇంటి స్థలం.. 
* విశాఖలోని కిర్లంపూడి లేఅవుట్‌లో 2012లో రూ.40లక్షలతో కొన్న ఫ్లాట్‌ 
* అనంతపురం శివాజీనగర్‌లో 2010లో రూ.19లక్షలతో కొన్న ఇల్లు

భార్య లత పేరిట.. 
* విశాఖ మధురవాడలో 2006లో రూ.3,11,110లతో కొన్న 311చ.గ. స్థలం.. అక్కడే 2007లో రూ.7.78లక్షలతో కొన్న మరో ఇంటి స్థలం 
* విజయవాడ దేవినగర్‌లో ప్రదీప్‌, ట్రెండ్‌సెట్‌ బిల్డర్స్‌ మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం పొందిన రూ.56.74లక్షల విలువైన 166చ.గ. స్థలం. 
* కడప జిల్లా మైదుకూరులో 4.08ఎకరాల సాగుభూమి (2005లో రూ.1.37లక్షలకు కొన్నట్లు చూపారు) 
* అనంతపురం మూర్తినగర్‌లో 4.5ఎకరాల సాగుభూమి.(2005లో రూ.2.85లక్షలకు కొన్నట్లు చూపారు) 
* కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరులో 1.07ఎకరాల సాగుభూమి(2007లో రూ.1,60,500కు కొన్నట్లు చూపారు)

తండ్రి పి.వెంకటరాజు పేరిట.. 
* రాజమహేంద్రవరం నరసింహరావుపేటలో 253 చ.గ. ఇంటిస్థలం(2005లో రూ.4.32 లక్షలకు కొన్నట్లు చూపారు)

బావమరిది బి.కృష్ణమోహన్‌ పేరిట.. 
* విశాఖ మధురవాడలో 2006లో రూ.8,98,500తో కొన్న 599 చ.గ. స్థలం

చిన్నాన్న నారాయణరాజు పేరిట.. 
* విశాఖ మధురవాడ ప్రాంతంలో 2017లో రూ.60లక్షలు వెచ్చించి కొన్న 200చ.గ. స్థలం

విదేశాల్లో చదువులు.. స్వదేశంలో వ్యాపారం.. 
* అదనపు చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌ భార్య లత ప్రస్తుతం స్నేహితురాళ్లతో సింగపూర్‌ పర్యటనలో ఉన్నారు. ఇంట్లో మూడు లాకర్లను అధికారులు గుర్తించారు. అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయని, ఆమె వచ్చాక వీటిని తెరిపిస్తామని చెప్పారు. ఖరీదైన పట్టుచీరలు ,అలంకరణ సామగ్రి, తదితరాలను అధికారులు గుర్తించారు. 
* పెద్ద కుమారుడు హేమంత్‌సాయి స్కాట్లండ్‌లో ఇంజినీరింగ్‌.. యూఎస్‌లో ఎంఎస్‌ చదివారని, ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించినట్టు గుర్తించారు. చదువు పూర్తయ్యాక హెచ్‌ఎస్‌ కనస్ట్రక్షన్స్‌ పేరుతో మధురవాడలో వ్యాపారం ప్రారంభించినట్లు అనిశా గుర్తించింది. కిర్లంపూడి ప్రాంతంలో నిర్మించిన అతిథిగృహం అద్దెకిచ్చేందుకు సిద్ధమయింది. హేమంత్‌సాయి పెళ్లికి కల్యాణమండపం అద్దె, భోజన ఖర్చులకే రూ.30 లక్షలు ఖర్చుచేసినట్లు గుర్తించారు. 
* చిన్న కుమారుడు జయంత్‌సాయి మణిపాల్‌ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు గుర్తించిన అధికారులు ఇందుకు ఇప్పటివరకు రూ.10 లక్షలకుపైనే ఖర్చుచేసినట్లు తేల్చారు.

* పేరు: పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ 
* హోదా:   అదనపు ముఖ్య నగర ప్రణాళిక అధికారి 
* ప్రస్తుత విధులు:   విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) 
* అభియోగం:   ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని.. 
* సోదాలు: తెలుగు రాష్ట్రాల్లో 12 చోట్ల..
అనిశా గుర్తించిన ఆస్తులు 
29ap-main5b.jpg
ఇంటి స్థలాలు: 5, 
ఫ్లాట్లు: 4, 
సాగు భూములు: 9.20 ఎకరాలు. 
వాహనాలు: మారుతి బ్రిజ్జా (ఏపీ31 డీకే123), రెండు ద్విచక్రవాహనాలు. 
బంగారం: 2.7కిలోలు (విలువ రూ.70లక్షలు), ప్లాటినం ఉంగరాలు: రెండు, వెండి ఆభణాలు: 12.5 కిలోలు (విలువ రూ. 4 లక్షలు). 
నివాసంలో గుర్తించిన ఇంటి సామగ్రి ఖరీదు:  రూ. 21 లక్షలు
Posted
3 minutes ago, TampaChinnodu said:

Nippu CBN World lo number one corruption free state rule lo,  Real Time Governance Dash Boards kaalam lo how is this possible. This must be fake news. 

T state lo no avineeti no work for ANISHA aa??

 

Leka avasaram ledu ani dora aa dept ne lepesada??

Posted
Quote

పెద్ద కుమారుడు హేమంత్‌సాయి స్కాట్లండ్‌లో ఇంజినీరింగ్‌.. యూఎస్‌లో ఎంఎస్‌ చదివారని, ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించినట్టు గుర్తించారు. చదువు పూర్తయ్యాక హెచ్‌ఎస్‌ కనస్ట్రక్షన్స్‌ పేరుతో మధురవాడలో వ్యాపారం ప్రారంభించినట్లు అనిశా గుర్తించింది.

bl@st

Posted
Just now, Bhai said:

Langa state lo no avineeti no work for ANISHA aa??

 

Leka avasaram ledu ani dora aa dept ne lepesada??

TG lo ledu ani eppudu seppa. 

But World number one corruption free state ani , real time governance ani , dash board lu ani roju ki 100 saarlu goppalu seppdu KCR.

Posted
2 minutes ago, Bhai said:

T state lo no avineeti no work for ANISHA aa??

 

Leka avasaram ledu ani dora aa dept ne lepesada??

No avineeti by others only Dora and co

Posted
1 minute ago, TampaChinnodu said:

TG lo ledu ani eppudu seppa. 

But World number one corruption free state ani , real time governance ani , dash board lu ani roju ki 100 saarlu goppalu seppdu KCR.

kaneesam veellu ikkada pattukuntunnaru.. akkada aithe asalu addresse ledu.. anandapadu.

Posted
2 minutes ago, Idassamed said:

No avineeti by others only Dora and co

Andhrollato patu avineeti kooda poyindanna maata.

 

nice

Posted
9 minutes ago, Bhai said:

kaneesam veellu ikkada pattukuntunnaru.. akkada aithe asalu addresse ledu.. anandapadu.

paisa upayogam ledu pattukunna. government ki karchulu bokka thappa court case lo. 

malli ade job lo join avuthadu konni months lo . court case will drag on for decades. appatiki manishi pothadu. his family will get all the properties. technique which all employees know. 

Posted
15 minutes ago, TampaChinnodu said:

Nippu CBN World lo number one corruption free state rule lo,  Real Time Governance Dash Boards kaalam lo how is this possible. This must be fake news. 

Nippu CBN ruling kabatte..nelaki okadini bayataki teesuku vachi lopala vestunnaru... these guys learned lessons from our late CM and grew  then. now CBN is tackling them one by one...

Posted
1 minute ago, Hitman said:

Nippu CBN ruling kabatte..nelaki okadini bayataki teesuku vachi lopala vestunnaru... these guys learned lessons from our late CM and grew  then. now CBN is tackling them one by one...

good joke. @3$%

Posted
12 minutes ago, Hitman said:

Nippu CBN ruling kabatte..nelaki okadini bayataki teesuku vachi lopala vestunnaru... these guys learned lessons from our late CM and grew  then. now CBN is tackling them one by one...

adi strategy from apara chanakya NCBN and his kid smallbabu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...