Jump to content

Recommended Posts

Posted
కోడిపందేల నిర్వాహకుల వివరాలివ్వండి 
సీఎస్‌, డీజీపీలకు హైకోర్టు ఆదేశం 
పందేలు నిర్వహించి తీరుతామన్న ప్రజాప్రతినిధులపై ఆగ్రహం 
కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేశారు 
వారి సంగతి మేము చూసుకుంటామని ఘాటు వ్యాఖ్య 
అధికారులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పండని ఆదేశం 
సీఎస్‌కు హాజరు నుంచి మినహాయింపు 
ఈనాడు - హైదరాబాద్‌ 
29ap-main10a.jpg

కోర్టు ఉత్తర్వులను కాదని.. కోడిపందేలు నిర్వహించి తీరుతామంటూ టీవీల ముందు ప్రకటన చేసిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు మండిపడింది. ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా సర్పంచ్‌లు మండల స్థాయి ప్రజాప్రతినిధులు టీవీల ముందు ప్రకటనలు చేశారని.. వారందరి వివరాలిస్తే వారి సంగతి మేము చూసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడిపందేలను జాతీయ మీడియా సైతం ప్రసారం చేశాయని.. టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఆ ప్రజాప్రతినిధులెవరో తెలుసుకుంటామని పేర్కొంది. ప్రజాప్రతినిధుల ఒత్తిడికి లోనై తమ ఆదేశాల్ని అమలు చేయకుండా అధికారులు నిస్సహాయులుగా మారినట్లున్నారని వ్యాఖ్యానించింది. సంక్రాంతికి పందేలు నిర్వహించకుండా 144 సెక్షన్‌ విధిస్తే అంతమంది ఎందుకు పందేల వద్దకు చేరగలిగారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గుర్తించిన 809 కోడిపందేల బరుల్లో/మైదానాల్లో పోటీలు నిర్వహించిన వారిపేర్లు, చిరునామా తదితర వివరాల్ని సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) దినేష్‌కుమార్‌, డీజీపీ మాలకొండయ్యలను ఆదేశించింది. తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన తహశీల్దార్లు, ఎస్సైలను గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. మరోవైపు 2017లో సంక్రాంతికి కోడిపందేలను నిలువరించడంలో విఫలమైన 48 మంది ఎస్సైలు, 43 మంది తహశీల్దార్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పేర్కొంది. విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. సీఎస్‌కు తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.  ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. 
2018 సంక్రాంతికి కోడిపందేలను నిలువరించడంలో తీసుకున్న చర్యల వివరాల్ని నివేదిక రూపంలో దాఖలు చేయనందుకు ఏపీ సీఎస్‌ను హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఎస్‌ దినేష్‌కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు. సీఎస్‌, డీజీపీలు వేర్వేరుగా కోర్టుకు నివేదికలు సమర్పించారు. 
సీఎస్‌, డీజీపీల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. తూర్పు గోదావరి జిల్లాలో 136, పశ్చిమ గోదావరి జిల్లాలో 673 మొత్తం 809 కోడిపందేల బరులను గుర్తించారన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేశామన్నారు. వివరాలు సమర్పించేందుకు కొంత గడువు కావాలని ఏజీ కోరారు. 2017నాటి ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకే..2018లోనూ అధికారులకు కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. విచారణను వాయిదా వేసింది. 
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కోడిపందేలు తగ్గాయని సీఎస్‌ నివేదికలో పేర్కొన్నారు.  నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ సంప్రదాయ క్రీడ అనే కారణం చూపుతూ కొన్ని సంస్థలు పందేలు నిర్వహించాయి. పిల్లలు, మహిళలు పాల్గొనడం వల్ల పోలీసు బలగాల్ని వినియోగించలేదు.

Posted
1 hour ago, rrc_2015 said:

Bakrid ki elantidi ediana anamanu ... court ki kuda ocha ....

em matladutunnav nuvvvuuu.... chance ee ledu... bakrid ki gorrelu barrelu vachi line lo nilchuntai... nannu naruku nannu naruku ani tannukuntai... neekem telsu asalu.... aaa uttermost ganni ikkadaku pilavaddu please..

Posted
1 hour ago, rrc_2015 said:

Bakrid ki elantidi ediana anamanu ... court ki kuda ocha ....

Y this taataaku chappudulu, I guess, its for 2019 koodi pandaalu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...