LordOfMud Posted February 3, 2018 Report Posted February 3, 2018 ఉద్యోగం ఒకరికే హెచ్4ఈఏడీ వీసా రూల్ ఎత్తేయాలని ట్రంప్ యోచన హెచ్1బీ వీసా ఉన్న భార్య లేదా భర్తల్లో ఒకరికే జాబ్ అమెరికాలో పనిచేసుకుంటున్న భారతీయ టెకీలకు ఇపుడు మరో ముప్పు వచ్చిపడుతోంది. భార్య లేదా భర్తల్లో ఎవరికైనా హెచ్4 వీసా ఉంటే ఇక వారి కథ ముగసినట్లే.. ఇంటికి పరిమితం కావాల్సిందే! ABN న్యూయార్క్, ఫిబ్రవరి 2: డాక్టర్ పోలవరపు అభిజ్ఞ.... నార్త్ కరోలినా రాష్ట్రంలోని కేరీ అనే పట్టణంలో ఉంటున్నారు. స్టూడెంట్ వీసా మీద అమెరికా వచ్చి- బయో ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ చేశారు.. కంప్యుటేషనల్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త టెకీ.. ఓ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలో అత్యంత నిపుణుడైన సీనియర్ ఉద్యోగి. వారి పిల్లలిద్దరూ అమెరికన్ సిటిజన్లు. వారు కేరీలో సొంతంగా ఓ ఇల్లు కూడా కొనుక్కున్నారు. అభిజ్ఞ, భర్త ఇద్దరి వీసాల కాలపరిమితి ఈ ఏడాది మే నెలలో ముగుస్తోంది. భర్త హెచ్1బీ వీసా మీద ఉన్నాడు, అభిజ్ఞది హెచ్4ఈఏడీ వీసా. 2015లో ఒబామా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో అభిజ్ఞ అక్కడ ఉండగలుగుతోంది. హెచ్1బీ వీసా కలిగి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు, వర్క్ పర్మిట్ మీద వచ్చి హెచ్1బీ వీసాల గలిగిన వారు పెళ్ళి చేసుకున్న పక్షంలో- వారి భార్య లేక భర్తకు- ఈఏడీ (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కింద ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలో నివాసం ఉండే వెసులుబాటే ఈ హెచ్4ఈఏడీ ! డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇపుడే రూల్‌ను ఎత్తేయాలని సంకల్పిస్తోంది. బహుశా ఫిబ్రవరి నెలాఖరుకు ఈ నిబంధనను ఎత్తేయవచ్చు లేదా మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇదే జరిగితే అభిజ్ఞ తన ఉద్యోగాన్ని కోల్పోతుంది. అభిజ్హలాంటి వేల మంది భారతీయ భార్యలు లేదా భర్తలు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్క భారతే కాదు, చైనా నుంచి వచ్చిన వందలమంది కూ డా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇమిగ్రేషన్ వ్యవహారాలు చూసే హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మాత్రం- అధ్యక్షుడి ఆదేశాలను అనుసరించి- అమెరికా ఫస్ట్ ఎజెండా అమలు చేసే క్రమంలో వలస విధానంలో మార్పులు తప్పనిసరి అని, అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ‘‘ఇంత చదివి, ఉద్యోగం కూడా చేస్తూ ఇపుడు ఆకస్మికంగా- వీసా లేదన్న కారణం మీద- అన్నీ కోల్పోయి ఇంట్లో కూర్చోవాలా? ఇందుకేనా నేను చదువుకొన్నదీ, రిసెర్ఛ్ చేస్తున్నదీ?’’ అని ఆవేదనగా ప్రశ్నిస్తోంది అభిజ్ఞ. ఇది హక్కులను కాలరాయడమే అంటోందామె. ‘‘ఈ రూల్ తొలగిస్తే మేం మరో దేశానికి వెళ్లిపోవాలి లేదా ఇండియాకు తిరిగి వెళ్లాలి.. నా కోసం, పిల్లల కోసం ఉద్యోగం వదిలేయాలి’’ అని అంటున్నారు నార్త్ కరోలినాలో ఉంటున్న వసుధా మోరదాని. ఆమె కూడా హెచ్4 వీసా మీద ఉన్నారు. ఇలా హెచ్4 వీసా హోల్డర్లు 1,04,376 మాత్రమే.. మొత్తం హెచ్1బీ, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్యలో వీరిది 3 శాతమే. అందువల్ల వీరి మొర ట్రంప్ ప్రభుత్వం ఆలకిస్తుందా? డౌటే! Andhrajyothy Quote
Captain_nd_Coke Posted February 3, 2018 Report Posted February 3, 2018 Ongomanu ochi lk baals ni Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.