TampaChinnodu Posted February 3, 2018 Report Posted February 3, 2018 అవినీతి పురుషోత్తముడు హెచ్‌ఎండీఎ ప్రణాళిక విభాగం డైరెక్టర్ అక్రమాస్తులపై అనిశా దాడులు ఈనాడు- హైదరాబాద్, న్యూస్‌టుడే- ఫిలింనగర్: అవినీతి ప్రణాళికలు రచించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించిన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ప్రణాళిక విభాగం సంచాలకుడు కట్టా పురుషోత్తమ్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో ఆయన నివాసం, తార్నాకలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తన కోసం వలపన్నారన్న అనుమానంతో పురుషోత్తమరెడ్డి రెండు రోజుల క్రితమే కుటుంబంతో సహా పరారయినట్లు, బినామీగా వ్యవహరిస్తున్న బావమరిది శ్రీనివాసరెడ్డిని కూడా వెంట తీసుకెళ్లినట్లు అనిశా డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన రూ.5.5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు సంపాదించినట్లు అనిశా అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.25 కోట్లు ఉంటుందని వివరించారు. పురుషోత్తమరెడ్డి, శ్రీనివాసరెడ్డిల ఇళ్లకు తాఖీదులు అంటించామన్నారు. వారు వచ్చాక లేదా రక్త సంబంధీకుల సమక్షంలో తాళాలు తెరిస్తే అక్రమార్జన మరింత పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. అనిశా అదనపు డీసీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీలు అశోక్‌కుమార్, రవికుమార్, ఇన్‌స్పెక్టర్ గౌస్ అజాద్ శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. చిన్నస్థాయి నుంచి.. నల్గొండ జిల్లా రాజాపేట మండలానికి చెందిన పురుషోత్తమ్‌రెడ్డి పురపాలక శాఖలో సెక్షన్ అధికారిగా 1985లో విధుల్లో చేరారు. తనకున్న పలుకుబడితో శాఖాపరమైన అవకాశాలను అందిపుచ్చుకొని 30 ఏళ్లలో హెచ్‌ఎండీఏలో ప్రణాళిక విభాగం సంచాలకుడిగా ఎదిగారు. పట్టణ ప్రణాళిక విభాగంలోకి ప్రవేశించగానే అవినీతికి తలుపులు తెరిచారు. పురుషోత్తమ్‌రెడ్డి అవినీతి వ్యవహారాలు తెలిసినా రుజువులు లేకపోవడంతో 20ఏళ్లైనా పట్టుకోలేకపోయారు. పట్టుబడినా తప్పుకుని.. పురుషోత్తమ్‌రెడ్డి 2009లో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పట్టణ ప్రణాళిక విభాగంలో లంచాలిస్తేనే తప్ప పనులు కావడం లేదని తీవ్రంగా ఆరోపణలొచ్చాయి. అతను అక్రమంగా రూ.4 కోట్లు సంపాదించారంటూ అనిశా లెక్క తేల్చింది. అప్పటికే అక్రమార్జనలో ప్రావీణ్యం సంపాదించిన పురుషోత్తమ్‌రెడ్డి అవన్నీ తాను సంపాదించుకున్న ఆస్తులంటూ లెక్కలు చూపించడంతో ప్రభుత్వం వాటిని అతనికి తిరిగిచ్చింది. అప్పటి నుంచి ఎడాపెడా అక్రమార్జనకు తెరలేపాడు. విలాసవంతమైన విల్లా కొనుగోలు! విలాసవంతమైన జీవనం కొనసాగిస్తున్న పురుషోత్తమ్‌రెడ్డి తన అభిరుచులకు అనుగుణంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మంచిరేవులలో రూ.15 కోట్ల విలువైన విల్లాను కొనేందుకు ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొద్ది నెలల్లో ఈ విల్లాను సొంతం చేసుకోనున్నారని, ఇందుకు సంబంధించిన పత్రాలు లభించాయని అనిశా అధికారులు తెలిపారు. పురుషోత్తమ్ రెడ్డికి హెచ్‌ఎఫ్‌డీసీ బ్యాంక్ సన్‌సిటీ, తిలక్‌నగర్ శాఖల్లో రెండు లాకర్లున్నట్టు గుర్తించారు. శనివారం వాటిని బ్యాంకు అధికారుల సమక్షంలో తెరవనున్నామని చెప్పారు. పరారీలో ఉన్న పురుషోత్తమ్‌రెడ్డి ఆచూకీ కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. ఏడేళ్లలో రూ.25 కోట్లు పురపాలక శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన పురుషోత్తమరెడ్డి 2010 నుంచి ఏడేళ్లలో రూ.25 కోట్ల విలువైన స్థిర చరాస్తులు (మార్కెట్ విలువ ప్రకారం) సంపాదించాడని అనిశా అధికారులు తెలిపారు. Quote
TampaChinnodu Posted February 3, 2018 Author Report Posted February 3, 2018 Quote పట్టుబడినా తప్పుకుని.. పురుషోత్తమ్‌రెడ్డి 2009లో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పట్టణ ప్రణాళిక విభాగంలో లంచాలిస్తేనే తప్ప పనులు కావడం లేదని తీవ్రంగా ఆరోపణలొచ్చాయి. అతను అక్రమంగా రూ.4 కోట్లు సంపాదించారంటూ అనిశా లెక్క తేల్చింది. అప్పటికే అక్రమార్జనలో ప్రావీణ్యం సంపాదించిన పురుషోత్తమ్‌రెడ్డి అవన్నీ తాను సంపాదించుకున్న ఆస్తులంటూ లెక్కలు చూపించడంతో ప్రభుత్వం వాటిని అతనికి తిరిగిచ్చింది. అప్పటి నుంచి ఎడాపెడా అక్రమార్జనకు తెరలేపాడు. Quote
Akkumm_Bakkumm Posted February 3, 2018 Report Posted February 3, 2018 21 minutes ago, TampaChinnodu said: Baga aadadu kada Quote
TampaChinnodu Posted February 3, 2018 Author Report Posted February 3, 2018 4 minutes ago, Akkumm_Bakkumm said: Baga aadadu kada As it as gaa aadadu. Andaru government employees aade laa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.