Hitman Posted February 7, 2018 Report Posted February 7, 2018 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వాస్తవాలు మాట్లాడడంలేదనీ, ఎవరికి వారు అవకాశవాద డైలాగులు వల్లిస్తూండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని.. ఈరెండు ప్రభుత్వాల మధ్య ఉండే పొంతనలేని ప్రకటనలు, వైరుధ్యాల వల్ల ఇద్దరూ కలిసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా క్రియాశీల పోరాటం చేయడానికి ఓ జేఏసీ వంటి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆయన జనసేన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి.. తెలుగుదేశం మీద కూడా నమ్మకం పోయిందనే పవన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఓ తటస్థ వేదిక అవసరం ఉందని ఆయన చెప్పారు. జనసేన బ్యానర్ కింద కూడా కాకుండా తటస్థంగా ఈ వేదికను మేధావులతో రాష్ట్రం మీద శ్రద్ధ ఉన్న పెద్దలతో కలిసి ముందుకు సాగుతాం అని పవన్ వెల్లడించారు. ఇందులో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ్, చదలవాడ శ్రీనివాస్, కమ్యూనిస్టు పెద్దలు వంటి వారికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. తాను వ్యక్తిగతంగా వారందరినీ కలసి ప్రతిపాదించబోతున్నానని.. జనసేన పార్టీ ముసుగు కూడా లేకుండా.. తటస్థ వేదికగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈవేదికలో చిరంజీవికి స్థానంలేదని కూడా పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు తాను గుజరాత్ వెళ్లి కలిసినప్పుడు.. విభజనలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలని మోడీకి చెప్పా అన్నారు. మొదటి ఏడాది ఆయనకు టైం ఇచ్చా.. సంయమనంతో వేచిచూశా అని ఆయన అన్నారు. భాజపా మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా గురించి ప్రకటించి.. తర్వాత మాటతప్పడం జరిగింది. మేనిఫెస్టోలో హోదాను పదేళ్లు ఇస్తాం అని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత.. విభజన హామీలపై వెనక్కి వెళ్లడం వల్ల.. ప్రత్యేకహోదా ఎందుకివ్వరు అని నేను అడగడం ప్రారంభించిన తర్వాత.. నేను తిరుపతిలో ప్రారంభించి.. కాకినాడ వరకు వెళ్లిన తర్వాత.. స్పెషల్ ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ ఏమిటా అనే కన్ఫ్యూజన్ లో ఉండగానే.. ‘‘ఇది చాలా గొప్పది, చాలా అభివృద్ధి చెందుతాం’’ అని నాకు నారా చంద్రబాబునాయుడు కూడా చెప్పారు. అందరూ కలిసి నా పోరాటాన్ని చల్లార్చేశారు అని అన్నారు. ఇవాళ్టి వరకు కూడా కేంద్రంనుంచి వస్తున్నది ఏంటో, ఖర్చవుతున్నది ఏంటో అడుగుతోంటే.. అసలు వాస్తవ పరిస్థితి ఏమిటో రాష్ట్రప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంలేదు అని పవన్ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వాన్ని అడిగితే కన్ఫ్యూజింగ్ గా చెబుతున్నారు. కేంద్రాన్ని అడిగితే మేం మొత్తం ఇచ్చేశాం అంటున్నారు. తెలుగుదేశం మీద, రాష్ట్రప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతోంది. ప్రజలను మరింత కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారు. అందుకే అసలు నిజాలను రాబట్టడానికి మేధావులతో కలిసి ఐక్యంగా ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా.. ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారిని కలుపుకుని ఒత్తిడితేగల ఓ బృందాన్ని తయారు చేయాలని అనుకుంటున్నా అని పవన్ వెల్లడించారు. ఇన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాల వల్ల యువతలో అశాంతికి ఆందోళనకు అది కారణమై టైం బాంబులాగా మారుతున్నదని, ఏదో ఒకరోజున అది పేలడానికి ముందే.. పరిస్థితుల్ని చక్కదిద్దాల్సి ఉన్నదని పవన్ కల్యాణ్ అన్నారు. మొత్తానికి పవన్ నుంచి అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రప్రభుత్వానికి కూడా కాకపుట్టించే ఫైట్ మొదలయినట్టే. కాకపోతే.. ఆ పార్టీలకు మద్దతు ఉపసంహరించుకుంటారా అని అడిగితే మాత్రం.. పవన్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా.. తనది తటస్థ పార్టీ అని, తాను వారి ప్రభుత్వాల్లో లేను కదా అని.. డొంకతిరుగుడు జవాబు ఇవ్వడం గమనార్హం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.