Jump to content

Recommended Posts

Posted

Kurnool-Woman-Sensational-Comments-on-TDP-and-Central-Govt-1518184447-1102.jpg

 

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయం - ఏపీకి ప్రత్యేక హోదా - విభజన చట్టంలోని హామీల అమలు కోసం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ నేపథ్యంలో నేడు ఓ టీవీచానెల్ ఆధ్వర్యంలో లైవ్ డిబేట్ ను నిర్వహించారు. ఆ డిబేట్ లో టీడీపీ - బీజేపీ - వైసీపీలతోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు - సాధారణ ప్రజలు - విద్యార్థులు పాల్గొన్నారు. ఆ డిబేట్ లో కర్నూలుకు చెందిన ఓ మహిళ ప్రసంగించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆమె నిర్మొహమాటంగా ఎండగట్టారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో నాడు కాంగ్రెస్ - నేడు బీజేపీలు ఆడుకున్నాయని  ఆమె చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన నాయకుందరూ మాట్లాడారని ఈ నాలుగు సంవత్సరాల్లో అనేక ప్రసంగాలు వినీ వినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగివేసారి పోయారని - నేడు ఏపీ ప్రజలు రోడ్డుమీద బిచ్చగాళ్లలాగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పార్టీలకతీతంగా చర్చకు వచ్చిచపుడు కేంద్రలోని బీజీపీ - రాష్ట్రంలోని టీడీపీల గురించి మాట్లాడకుండా ఉండడం సాధ్యం కాదని - ఒకవేళ ఆయా పార్టీల నాయకులకు అభ్యంతరం ఉంటే ఇక చర్చే అవసరం లేదని - అందరం ఇళ్లకు వెళ్లపోదామని ఆమె సెటైర్ వేశారు. పార్లమెంటు తలుపులు వేసి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్....దానికి మద్దతిచ్చిన బీజేపీలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దుస్థితికి కారణమన్నారు. వెంకయ్యనాయుడు గారు ఏపీకి 5...కాదు 10 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే....తిరుపతి సభకు వచ్చిన మోదీ గారు....15 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇపుడు ఏపీ ప్రత్యేక హోదా పరిధిలోకి రాదని- రాజ్యాంగ సవరణ చేయాలని - ఆర్థికంగా ఇబ్బందులున్నాయని...ఇలా రకరకాల కారణాలు చెబుతున్న బీజేపీ నేతలకు ఆరోజు ఈ కారణాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 

నాలుగు సంవత్సరాలుగా బీజేపీ - టీడీపీ కల్లబొల్లి కబుర్లను ఆంధ్ర ప్రజలు విన్నారని ఇకపై వాటిని వినడానికి సిద్ధంగా లేరని ఆమె చెప్పారు. నాడు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని నేడు మళ్లీ ఆ పరిస్థితి వచ్చింది కనుక ఆంధ్రలంతా ఢిల్లీ పెద్దలతో పోరాడేందుకు రెడీ అని చెప్పారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అని చంద్రబాబు అన్నారని - ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకోవాలని ప్రజలకు హితవుపలికారని....అటువంటపుడు తిరుపతిలో మోదీ 15 సంవత్సరాలు హోదా ఇస్తాన్నపుడు ఎందుకు వద్దనలేదని ప్రశ్నించారు. తమిళనాడులో ప్రజలందరూ ఐక్యంగా ఉంటారని - జెల్లికట్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం - సుప్రీంకోర్టుతో వారు పోరాడి తమకు కావాల్సింది సాధించుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా పౌరుషంతో తమిళనాడు తరహాలోనే ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే కేంద్రం తప్పక దిగి వస్తుందని అన్నారు. తమిళనాడులో పార్టీల పరంగా ఎన్ని విభేదాలున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వారంతా ఒక్కతాటిపైకి వస్తారని - జెల్లికట్టు విషయంలో పార్లమెంటులో కూడా అన్ని పార్టీల ఎంపీలు సమిష్టిగా పోరాడి సాధించుకున్నారని చెప్పారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారని - కానీ - చంద్రబాబు నాయుడుకు ధైర్యం - సత్తా  ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకొని బయటకు రావాలని.....ఖబడ్దార్ అంటూ ఎన్టీఏను హెచ్చరించాలని ఆమె సవాల్ విసిరారు. 

Posted
Just now, Bhai said:

thurkadi emo kanukko ra babu

Not at all chustunte telisipotondi...

Posted
1 minute ago, Kool_SRG said:

Not at all chustunte telisipotondi...

emo ra babu.. anti bjp ante thurkollu ani edustaru db lo

Posted
50 minutes ago, Bhai said:

thurkadi emo kanukko ra babu

thurkado, budabukkalado edi ayete endi matter correct ga matladina leda bhai

Posted
20 minutes ago, raaajaaa said:

thurkado, budabukkalado edi ayete endi matter correct ga matladina leda bhai

+1

Aame perfect ga matladindi...

Posted
1 hour ago, Bhai said:

thurkadi emo kanukko ra babu

No ikkada inko angle....

jaffa ayyuntundhi....

Posted
1 minute ago, reality said:

No ikkada inko angle....

jaffa ayyuntundhi....

hOzy339.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...