cryptokababs Posted February 11, 2018 Report Posted February 11, 2018 కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ ముఖ్యకారదర్శి, ఇతర ప్రముఖులు ప్రధాన మంత్రి మోదీతో సమావేశమయ్యారు. బడ్జెట్ గురుంచి చర్చ జరిగాక, బడ్జెట్ ప్రతులు పరిశీలించిన మోదీ " ఈసారి బడ్జెట్ బాగుంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇక సవరణలు ఏం లేవు. ఇదే ఫైనల్ చేయండి జైట్లీ గారు" అని అమిత్ షా వైపు చూసి "మీకు కూడా సమ్మతమే కదా షా జి? " అని అడిగారు. హా, మనం అనుకున్న బడ్జెట్ ఇదే కదా? కానీ... అని అమిత్ షా నసుగుతుంటే , చెప్పండి ఏదైనా సమస్య ఉంటే అడిగారు మోదీ. పక్కనే ఉన్న ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కల్పించుకుని , "సార్, అంతా బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం కేటాయించలేదు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా,రైల్వేజోన్...... ఇలా దేని మీదా బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనిమీద వ్యతిరేకత వస్తుందేమో అని "..... అని జైట్లీ వైపు చూడగా నాదేముంది అంతా మీ దయ అన్నట్టు మోదీ వైపు చూసాడు జైట్లీ. మోదీ చిద్విలాసంగా నవ్వి" మనం ఆంధ్రాకి బడ్జెట్ కేటాయించడం ఏంది? మనమే ఆంధ్రాని అప్పు అడగాలనుకుంటున్నాం " అని తన పీఏ వైపు చూసి "అవి తీసుకురా" అన్నాడు. పీఏ లోపలికెళ్లగా , మిగతా అందరూ క్వశ్చన్ మార్క్ మొహాలతో చూస్తున్నారు. కొన్ని క్షణాల్లో పీఏ ఒక పెద్ద పేపర్ల కట్ట తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందరూ వాటి వైపు చూడగా అవి " ఈనాడు, ఆంధ్ర జ్యోతి" పేపర్లు. "తీసి చదువు" అన్నారు మోదీ. పీఏ ఒక్కో పేపర్ తీసి చదవసాగాడు. వైజాగ్ సదస్సులో పది లక్షల కోట్ల పెట్టుబడులు . త్వరలో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న చైనా. సోమాలియా దేశం నుండి పెట్టుబడుల వరద, సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా. దవోస్ నుండి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తేనున్న చంద్రబాబు. అమెరికాలో లోకేష్ పెట్టుబడుల వేట, ఐదు లక్షల కోట్లు తరలి రానున్నట్టు వినికిడి. అంగారక గ్రహం నుండి .....అని పీఏ చెప్పబోతూంటే "ఆపమన్నట్టు" చెయ్యి ఎత్తాడు మోదీ. మిగతా వారంతా డిస్కవరీ ఛానెల్లో కప్పల్లాగా నోరు తెరచి అలానే ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు అయ్యాయి? అడిగాడు మోదీ. కాస్త ఆలోచించి "యాభై లక్షల కోట్లు సార్ " చెప్పాడు జైట్లీ. మన బడ్జెట్ ఎంత? ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే ఆంధ్రా పెట్టుబడుల్లో సగం మన బడ్జెట్ అన్నమాట. ఇక మనం ఏం ఇవ్వగలం వాళ్లకి? ఆ పెట్టుబడుల్లో వాళ్ళు అంతర్జాతీయ రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం పూర్తి చేయొచ్చు, ఇక ప్రత్యేక హోదా అంటారా.... అది ఏ వనరులు లేని బీద రాష్ట్రానికి. లక్షల కోట్ల పెట్టుబడులు, కోటి ఉద్యోగాలు, అరవై ఐటి కంపెనీలు,అద్బుతమైన రాజధాని..... ఇన్ని ఉన్న రాష్ట్రానికి మనమేం చేయగలం? ఏం ఇవ్వగలం? చెప్పండి అన్నాడు మోదీ. ఏం చేయలేము సార్" ముక్తకంఠంతో అన్నారు అందరూ. సో, ఇదే ఫైనల్ చేయండి" అని పైకి లేచాడు మోదీ. "అన్నట్టు షా జి, నాయుడు గారికి ఫోన్ చేసి పది లక్షల కోట్లు పంపమని చెప్పండి, అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి " అని వెళ్లిపోయారు. అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు మన ఆంధ్రా నాయకుల్లాగా. Source: messenger Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.