Kool_SRG Posted February 14, 2018 Report Posted February 14, 2018 ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చే టైంకి ఆ పంట నాశనం అయితే రైతుకు కలిగే బాధ వర్ణనాతీతం. అలా ఏపీకి చెందిన ఓ 45 ఏళ్ల రైతు కూరగాయల్ని పండించేవాడు. అంతా బాగానే ఉన్నా రైతుకు మాత్రం ఎక్కడో చిన్న అనుమానం తన పంటకు దిష్టి తగిలిందని అందువల్లే పంటపండలేదని అనుకున్నాడు. దీన్ని తట్టుకోలేని ఆ రైతు పంటకు దిష్టి పోవాలంటే ఏం చేయాలని తెగ ఆలోచించాడు. ఆలా ఆలోచించగా ఆ రైతుకు శృంగార తార సన్నిలియోన్ గుర్తుకు వచ్చింది. దిష్టికి .? సన్నీలియోన్ కు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నారా...? అదేం లేదండి . మన ఇంటికి నరదిష్టి పోవాలంటే ఏం చేస్తాం. ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టి పూజ చేస్తాం. దాంతో మన ఇంటికి పట్టిన దిష్టి పోతుందని నమ్ముతాం. అలా ఆ రైతు తన పంటకి దిష్టి నుంచి ఉపశమనం పొందడానికి సన్నిలియోన్ ని ఆస్త్రంగా ఉపయోగించాడు. బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సన్నీ లియోన్ ఆంధ్రపదేశ్ లో ఉన్న రైతుపంటకు నష్టం కలగకుండా చూస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఫోటో చూడండి. సన్నిలీయోన్ తేచ్చే సాహసం చేయలేని ఆ రైతు శృంగార తారను ఫోటో తీసి ఫ్లెక్సీగా తయారు చేయించి ఆ ఫ్లెక్సీలో ఒరేయ్ నన్ను చూసి ఏడవకురా అనే అక్షరాల్ని తన పంటపొలం దగ్గర పెట్టాడు. అంతే ఆ పొలం మీదగా వెళ్లే వాళ్లు వచ్చేవాళ్లు పంటను చూడడం మానేసి పక్కనే బికినీ వేసుకొని ఫోజిస్తున్న సన్నీలియోన్ ను చూడడం మొదలు పెట్టారు. సన్ని ఫ్లెక్సీ పుణ్యమా అంటూ రైతు వేసిన ప్రతీ పంట ఇరగ కాయడం - మంచి లాభాలు రావడంతో మిగిలిన రైతులు కూడా సన్నీలియోన్ ను ఫాలో అవుతున్నారు. పంటపొలాలకు సన్నీ లియోన్ ఫ్లెక్సీలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. తమ పంట పండిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఆ రైతు చేసిన పని ఏపీలో హాట్ టాపిగ్గా మారింది. ఇంకేముంది రైతుల ప్లాన్ సక్సెస్ అయ్యింది. అయినా సన్నీ లియోన్ ని ఇలా కూడా వాడుకోవచ్చా అనే మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న ఈ శృంగారతారను ఈ రకంగా వాడుకోవడం మాత్రం బహుశా ఇది ఫస్ట్ టైం కావొచ్చు. అంతా సన్నీ మహిమ. Quote
aakathaai Posted February 14, 2018 Report Posted February 14, 2018 Koolesh annai nee performance pakka thread lo yesa jara choodu nee sinthakai performance Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.