Jump to content

MR.KTR ... Please learn from CBN and Lokesh


Recommended Posts

Posted
శభాష్‌  తెలంగాణ 
మీ ఆతిథ్యం అద్భుతం 
నాస్కామ్‌కు అభినందనలు 
ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ ముగింపు వేడుకల్లో విట్సా అభినందనలు 
మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు 
వచ్చే సదస్సు ఆర్మేనియాలో 
ఈనాడు - హైదరాబాద్‌ 
21ts-main3a.jpg

‘‘ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సులు ఇప్పటి వరకు 20 జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా, అత్యుత్తమంగా (బెస్ట్‌ ఆఫ్‌ది బెస్ట్‌) హైదరాబాద్‌ సదస్సు జరిగింది. పెద్దఎత్తున ప్రజాదరణ లభించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, నాస్కామ్‌ను మా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీ ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయి. ఆతిథ్యం, సౌకర్యాలు, సమాచారం అన్ని ఎంతో గొప్పగా ఉన్నాయి. మేం ఎప్పటికీ మరిచిపోలేం’’ అని ప్రపంచ ఐటీ, సేవల కూటమి (విట్సా) గౌరవ ఛైర్మన్‌ శాంటియాగో గుటిరెజ్‌ అన్నారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు బుధవారం రాత్రి ఘనంగా ముగిసింది. 40 దేశాలకు చెందిన మూడువేలమంది ప్రతినిధులు హాజరయ్యారు. హెచ్‌ఐసీసీలో బుధవారం జరిగిన ముగింపు వేడుకల్లో శాంటియాగోతో పాటు ఛైర్‌పర్సన్‌ యెవోన్‌ చియు, నాస్కామ్‌ ఛైర్మన్‌, రమణ్‌రాయ్‌, అధ్యక్షుడు చంద్రశేఖర్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. సదస్సు విజయవంతంగా జరిగిందని ఈ సందర్భంగా శాంటియాగో ప్రకటించారు. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన సదస్సుకు అపూర్వ స్పందన లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. దీని నిర్వహణకు పూనుకున్న నాస్కామ్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. మళ్లీ, మళ్లీ తెలంగాణకు రావాలని ఉందన్నారు. నాస్కామ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారం మరవలేనిదని చెప్పారు. మీ ఆతిథ్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సదస్సు గురించి పేర్కొంటూ  అద్భుతం, అచ్చెరువు, మధురానుభూతిని కలిగించింది ఈ ప్రయాణం అని తెలిపారు. వచ్చే ఏడాది మళ్లీ తెలంగాణలో కలుస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఐటీ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంపిక చేయడం తమ అదృష్టమని చెప్పారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న రాష్ట్రమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్మేనియా ప్రతినిధులను పిలిచి సదస్సు నిర్వహణ బ్యాటన్‌ అందించారు. 2019లో ఈ సదస్సు నిర్వహణ వేదికగా ఆర్మేనియా దేశాన్ని ప్రకటించారు. అక్టోబరు 6 నుంచి 9వరకు దీనిని నిర్వహిస్తామని ప్రకటించారు.

21ts-main3b.jpg

మరిన్ని ఆతిథ్యాలకు సిద్ధం: మంత్రి కేటీఆర్‌ 
సదస్సు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నాస్కామ్‌, విట్సాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సు తెలంగాణకు గొప్ప మేలు చేసింది. ప్రపంచ ఐటీ దిగ్గజాల మదిలో హైదరాబాద్‌ సుస్థిరస్థానం పొందింది. విఖ్యాత సంస్థ అడోబ్‌ ఇక్కడ తమ కేంద్రం ఏర్పాటు చేయనుంది. విప్రో సబ్బులు, సౌందర్య సాధనాల పరిశ్రమ స్థాపనకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరో రెండు ఒప్పందాలు చేసుకున్నాం. నాస్కాంతో సంయుక్తంగా ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నాం. ఇవికాక టీహబ్‌ రెండో దశకు సన్నద్ధమవుతున్నారు. టీవర్స్క్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నాం. వీటి ద్వారా తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కనుంది. ఐటీ ద్వితీయ శ్రేణి నగరాలకు చేరనుంది. ఈ నెలలో ఇప్పటికే నాలుగు ప్రపంచ స్థాయి సదస్సులు జరిపాం. గురువారం నుంచి బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. వింగ్స్‌ ఇండియా పేరిట మార్చి 8 నుంచి 11 వరకు వైమానిక సదస్సును నిర్వహించనున్నాం. మార్చి 8న వీహబ్‌ను ప్రారంభిస్తున్నాం’ అని చెప్పారు.

దీపికకు చేనేత కండువా బహూకరణ: ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సుకు హాజరైన దీపికా పదుకొణెకు మంత్రి కేటీఆర్‌ పోచంపల్లి చేనేత కండువాను బహూకరించారు.

21ts-main3c.jpg
  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    8

  • TampaChinnodu

    8

  • psycopathNBK

    5

  • ARYA

    3

Top Posters In This Topic

Posted
Quote

విఖ్యాత సంస్థ అడోబ్‌ ఇక్కడ తమ కేంద్రం ఏర్పాటు చేయనుంది. విప్రో సబ్బులు, సౌందర్య సాధనాల పరిశ్రమ స్థాపనకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరో రెండు ఒప్పందాలు చేసుకున్నాం.

only 2 agreements anta. 

Last 2 years nundi Vizag investors summits lo each year lakhs of crores investments brought CBN and Chinna Bob. Please learn from them. 

Posted
1 minute ago, TampaChinnodu said:

only 2 agreements anta. 

Last 2 years nundi Vizag investors summits lo each year lakhs of crores investments brought CBN and Chinna Bob. Please learn from them. 

You mean IT biggies like Shreyas Soft Inc.? 

Posted
Just now, reality said:

?? Clarity missing...learn what?

only 2 agreements anta summit lo. 

Last 2 years nundi Vizag investors summits lo each year lakhs of crores investments brought CBN and Chinna Bob. Please learn from them. 

Posted
17 minutes ago, TampaChinnodu said:

only 2 agreements anta summit lo. 

Last 2 years nundi Vizag investors summits lo each year lakhs of crores investments brought CBN and Chinna Bob. Please learn from them. 

True 

modhu gorres will never learn 

Posted
2 hours ago, reality said:

You mean IT biggies like Shreyas Soft Inc.? 

Yes. And also thousands of Block Chain companies which are coming to Block Chain capitol of the world Vizag.

Posted

Nasscom is nothing but bloood sucking big mestris assocation.. zero use to society in terms of innovation....

pimps supply pros..titues

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...