BaabuBangaram Posted February 22, 2018 Report Posted February 22, 2018 Please cry అనంత రూపురేఖలను మార్చేలా.. పుష్కల ఉపాధిని దరి చేర్చేలా.. సీమలోనే అతి పెద్ద పరిశ్రమగా భావిస్తున్న కియా కార్ల తయారీ పరిశ్రమ కొలువుదీరనుంది. కియాను జిల్లాకు తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా అధికారుల కృషి ఎనలేనిది. కియా భారత్ వైపు చూస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. అయినా ముఖ్యమంత్రి తనదైన శైలిలో అన్ని వసతుల కల్పనకు అభయం ఇవ్వడంతో కల సాకారమైంది. ఎలాగైనా కియా అనంతకే రావాలని అధికారులు కూడా శ్రమించారు. కియా యాజమాన్యం తమకు ఫలానా వసతులు కావాలని అడగడమే తరువాయి.. చక్కటి ప్రణాళికతో వీరు పరుగులు పెట్టారు. ఇప్పుడు శరవేగంగా అడుగులు పడి.. గురువారం ఫ్రేమ్ ఇన్‌స్టలేషన్ వేడుకకు సిద్ధమైంది. ఈ క్రతువులో ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా అధ్యక్షుడు పార్క్ పాల్గొనున్నారు. ఈ శుభ తరుణంలో.. కరవు ప్రాంతం, తాగునీటికే కటకటలాడే జిల్లాలో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో కియా పరిశ్రమ ఏర్పాటు కానుండటం, వేల మందికి ఉపాధి దక్కనుండటం, అనుబంధ పరిశ్రమలు బారులు తీరనున్న నేపథ్యంలో.. దీని వెనుక జరిగిన కృషిపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం. నాలుగు రాష్ట్రాల పోటాపోటీ... తొలుత కియా యాజమాన్యం ఏదైనా దేశంలో ఐదో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుచేయాలనుకుంది. ఇందుకు గతంలో దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంతి చంద్రబాబు ఓసారి తమ వద్ద భూములు పరిశీలించాలనీ.. అవసరమైన వసతులు కల్పిస్తామని వారికి చెప్పారు. దీంతో భారత్ వైపు కియా మొగ్గు చూపింది. అయితే కియా మన దేశానికి వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మధ్య పోటీ మొదలైంది. పారిశ్రామికంగా గుజరాత్ అభివృద్ధి చెందటం, ఎక్కువగా ఆటోమొబైల్ పరిశ్రమలు మహారాష్ట్రలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు గట్టిగా ప్రయత్నాలు చేశాయి. ఇదే సమయంలో ఏపీకి వస్తే శరవేగంగా అన్ని అనుమతులు, మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం చంద్రబాబు అభయం ఇచ్చారు. అలాగే సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్, ఏపీఐఐసీ ఎండీ జె.నివాస్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, అప్పటి అనంతపుం కలెక్టర్ కోన శశిధర్‌తో కూడిన బృందం దక్షిణ కొరియాకు వెళ్లి.. కియా యాజమాన్యాన్ని కలిసి కీలక ప్రజంటేషన్ ఇచ్చింది. దీంతో వారు మన రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపారు. ఏపీలో అనువైనదెక్కడ?... ఇక మన రాష్ట్రంవైపు కియా దృష్టి సారించినప్పుడు మూడు జిల్లాల మధ్య పోటీ ఏర్పడింది. తయారైన కార్లను దేశం మొత్తంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన నేపథ్యంలో.. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, నెల్లూరు, చిత్తూరు సరిహద్దులో ఉన్న శ్రీసిటీ వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే సమయంలో అనంతలో కావాల్సినంత భూములు ఇస్తామని కూడా చెప్పారు. చివరకు అనంత వైపు కియా మొగ్గుచూపింది. జాతీయ రహదారికి ఆనుకొని, రహదారి వెంట కనీసం కిలోమీటరున్నర, వెనుకకు కి.మీ. వరకు ఉండేలా భూమి కావాలని కోరారు. పెనుకొండలోని ఎర్రమంచి వద్ద, సోమందేపల్లి, పుట్టపర్తి, కూడేరు మండలాల్లోని భూములను అధికారులు చూపించారు. వీటన్నింటిలో కియా ప్రతినిధులు మట్టి నమూనాలు తీయించి, పరీక్షలు చేయించారు. చివరకు పెనుకొండ మండలంలోని ఎర్రమంచి భూములపై మొగ్గు చూపారు. కృష్ణమ్మ వస్తుందా?... పెనుకొండ సమీపంలో ఏర్పాటుకు ఆసక్తి ఉన్నా.. గొల్లపల్లి జలాశయంలో చుక్కనీరు లేకపోవడం, అసలు జలాశయమే పూర్తవుతుందా అని కియా ప్రతినిధులు సందేహంతో ఉండేవారు. వారు 2016 ఆగస్టులో తొలుత ఈ జలాశయాన్ని చూసి నీరు వస్తుందా? అని అడిగారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై గొల్లపల్లి పనులు పూర్తిచేయించి, 2016 డిసెంబరుకే నీటిని తీసుకొచ్చారు. ఆ తర్వాత కియా ప్రతినిధులు ఈ నీటి నమూనాలు కూడా తీసుకొని హైదరాబాద్, మరికొన్ని చోట్ల పరీక్షలు చేయించారు. తమ పరిశ్రమకు ఈ నీరు ఉపయోగపడుతుందని తేలడంతో ఇక పూర్తిగా పెనుకొండకే ఓటేశారు. అసౌకర్యమనే ఊసేలేకుండా.. కియా ప్రతినిధులు తొలుత జిల్లాలో భూములు చూసేందుకు వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం పరిశ్రమ పనులు చేస్తున్నప్పుడు కూడా వారికి ఎక్కడా అసౌకర్యమనే మాట రానివ్వకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కియా ప్రతినిధులు జిల్లాకు బెంగళూరుకు విమానంలో వచ్చి, అక్కడి నుంచి జిల్లాకు వచ్చేవారు. వారు విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత సరిగ్గా 60-70 నిమిషాల్లో ఎర్రమంచి భూముల వద్దకు చేరుకునేలా పక్కా ఏర్పాట్లు చేసేవారు. దీంతో ఈ ప్రాంతం బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరే అనే భావన వారిలో వచ్చింది. అలాగే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని చెబితే.. దుద్దేబండ క్రాస్‌లో దాదాపు సిద్ధంగా ఉన్న పర్యాటక శాఖ హోటల్‌ను కియాకు అప్పగించారు. ఇటు చెక్కు.. అటు రిజిస్ట్రేషన్.. కియా పరిశ్రమకు భూములు తీసుకున్నపుడు అక్కడ పట్టా, డీకేటీలు ఉన్న 475 మందికి పరిహారం చెల్లించారు. తొలుత వారంతా తక్కువ పరిహారం వస్తుందనే భావనతో ఉండేవారు. దీంతో అధికారులు చర్చలు జరిపి ఎకరాకు రూ.10.5 లక్షలు ఖరారు చేశారు. ఆ తర్వాత ఆయా భూముల యజమానులతో దాదాపుగా ఒకే రోజు రిజిస్ట్రేషన్ జరిపించారు. పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఒక్కో భూ యజమానికి చెక్కు ఇవ్వగానే.. అక్కడి నుంచి పెనుకొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు రోజు కేటాయించి కియా భూముల రిజిస్ట్రేషన్ మినహా ఇతర రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. అధికారుల విశేష కృషి.. కియా కోసం మన రాష్ట్రంలో ఆయా జిల్లాల మధ్య పోటీ ఉన్నప్పుడు.. అనంతపురం జిల్లా అధికారులు ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేశారు. అప్పటి కలెక్టర్ కోన శశిధర్ నేతృత్వంలో భూసేకరణ మొదలుకొని అనేక అవరోధాలు అధిగమించారు. ఒప్పందం చేసుకున్న మూడు నెలల్లో భూసేకరణ జరిపి, తమకు అప్పగించాలని కియా యాజమాన్యం కోరింది. దీంతో అధికారులు భూసేకరణపై దృష్టిపెట్టారు. పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి చుట్టుపక్కల ఎక్కువగా ప్రభుత్వ, డీకేటీ భూములు ఉండటంతో వీటిపై దృష్టిపెట్టారు. గత ఏడాది ఏప్రిల్‌లో కియా ఉపాధ్యక్షుడు, అమరావతిలో సీఎంను కలిసే నాటికి.. కియా పరిశ్రమతోపాటు, అనుబంధ పరిశ్రమలు, టెస్ట్ ట్రాక్, రైల్వేసైడింగ్, టౌన్‌షిప్‌కు అవసరమైన 1,500 ఎకరాలు సిద్ధంగా ఉంచామని కలెక్టర్ శశిధర్ తెలిపారు. ఈచొరవను సీఎంతోపాటు, కియా ఉపాధ్యక్షుడు కూడా అభినందించారు. కియా ఖరారైన తర్వాత.. ప్లాంట్‌కు అవసరమైన 600 ఎకరాల సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించారు. ఎక్కువగా డీకేటీ ఉండటంతో, తమకు మొక్కుబడిగా పరిహారం ఇస్తారని రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని పార్టీల నాయకులు ఆయా రైతులను కలిసి, మీ వెంట మేమున్నామని చెబుతూ వచ్చారు. దీంతో భూసేకరణలో ఇబ్బందులు వస్తాయేమో అనుకున్నారు. కానీ కలెక్టర్ శశిధర్, అప్పటి సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం, పెనుకొండ ఆర్డీవో రామమూర్తి రైతులతో జాగ్రత్తగా మాట్లాడి.. పట్టా, డీకేటీలకు సైతం ఎకరాకు రూ.10.5 లక్షలు ధర ఖరారు చేశారు. వాస్తవానికి అప్పటికి అక్కడ ఉన్న భూముల ధరలతో పోలిస్తే, అది ఎంతో అధికం. దీంతో రైతులెవరూ దాదాపు అభ్యంతరం చేయకుండా, భూములిచ్చారు. ఇక కియాకు భూములు ఇచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం శరవేగంగా చదును చేసి అప్పగించింది. ఆ భూముల్లో ఉన్న మూడు వాగులు మళ్లించి, విద్యుత్తు లైన్లు తప్పించి, కొండలు, గుట్టలు తొలిచి, లోతైన ప్రాంతాన్ని పూడ్చి సరిగ్గా ఆరు నెలల్లో భూమిని చదును చేసింది. ఈ పనులను ప్రస్తుత కలెక్టర్ వీరపాండియన్ తరచూ పర్యవేక్షిస్తూ, ప్రతి వారం పనుల పురోగతిని డ్రోన్ ద్వారా చిత్రీకరించి సీఎంకు నివేదించేవారు. పలుమార్లు కియా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి ఏఏ వసతులు అవసరమో తెలుసుకొని వాటిని సమకూరేలా చూశారు. అలాగే గత ఏపీఐఐసీ జిల్లా జోనల్ మేనేజర్ రఘునాథ్, ప్రస్తుత పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సుదర్శన్‌బాబు తదితరులు బాగా కష్టపడ్డారు. నేటి సీఎం పర్యటన ఇలా.. కియా పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు గురువారం సీఎం చంద్రబాబు చేరుకొని వివిధ విభాగాల పనులను చూస్తారు. తర్వాత కియా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబు, కియా అధ్యక్షుడు పార్క్ కియా పరిశ్రమ పైనుంచి కనిపించే చిత్రాలు (బర్డ్స్ ఐ వ్యూ) ప్రారంభిస్తారు. ఆపై ఇద్దరూ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఓ ఫ్రేమ్‌పై వారిద్దరూ సంతకాలు చేస్తారు. వెంటనే ఆ ఫ్రేమ్ క్రేన్ సాయంతో పైకిలేపి, ఇన్‌స్టలేషన్ చేస్తారు. అటుపై కియా ప్రతినిధులు, రాష్ట్రప్రభుత్వ అధికారులతో ఫొటోలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సీఎం, కియా అధ్యక్షుడు కొంతసేపు మీడియాతో మాట్లాడతారు. ఈ వేడుకకు కొద్ది మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. వీవీఐపీలు, కొందరు మీడియా ప్రతినిధులతోపాటు, కియాకు భూములిచ్చిన రైతుల్లో 300 మందిని ఆహ్వానించారు. వీరిని ఆరు బస్సుల్లో ఈ కార్యక్రమానికి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుంచి కియా ఎదురుగా జరిగే బహిరంగ సభలో సీఎం, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొంటారు. Quote
aakathaai Posted February 22, 2018 Report Posted February 22, 2018 kia will change the fate of ananthapur and kia is going to invest 13000 cr and it is expected to provide 11000 jobs. good move Quote
Android_Halwa Posted February 22, 2018 Report Posted February 22, 2018 Screenplay bagundi....chaduvutunnantha sepu epudepudu emavutundi, ela avutundi ane utkanta ki tera lepi, finally Kia Anantapur ki vachesindi Next, Anantapur name will be changed as KiAnanthapur ani CBN promise chesadu ...! Quote
Android_Halwa Posted February 22, 2018 Report Posted February 22, 2018 Amaravati emo Emirates amaravati...a anthapur emo Kia Ananthapur...Vizag will be Hyperloop Vizag... Shabash CBN..! Quote
aakathaai Posted February 22, 2018 Report Posted February 22, 2018 Just now, Android_Halwa said: Screenplay bagundi....chaduvutunnantha sepu epudepudu emavutundi, ela avutundi ane utkanta ki tera lepi, finally Kia Anantapur ki vachesindi Next, Anantapur name will be changed as KiAnanthapur ani CBN promise chesadu ...! antha peddha investment ap kl vasthunte endukatta jebulo janthakal nalupukuntunnaav manchi chesthunna kooda thattukolevaa Quote
Android_Halwa Posted February 22, 2018 Report Posted February 22, 2018 17 minutes ago, aakathaai said: kia will change the fate of ananthapur and kia is going to invest 13000 cr and it is expected to provide 11000 jobs. good move Gone are the days where automobile units created thousands of jobs...! I bet the job number at 5000 ...However other scenes like ancillary units and services will actually provide more business value and employment to unskilled labor than direct employment by Kia. It’s a win win situation for one of the most backward dry arid district in the country. Quote
Android_Halwa Posted February 22, 2018 Report Posted February 22, 2018 8 minutes ago, aakathaai said: antha peddha investment ap kl vasthunte endukatta jebulo janthakal nalupukuntunnaav manchi chesthunna kooda thattukolevaa Yahan pe pishab karna mana hain Quote
BaabuBangaram Posted February 22, 2018 Author Report Posted February 22, 2018 35 minutes ago, Android_Halwa said: Gone are the days where automobile units created thousands of jobs...! I bet the job number at 5000 ...However other scenes like ancillary units and services will actually provide more business value and employment to unskilled labor than direct employment by Kia. It’s a win win situation for one of the most backward dry arid district in the country. Quote
Kool_SRG Posted February 22, 2018 Report Posted February 22, 2018 1 hour ago, BaabuBangaram said: కియా ప్రతినిధులు జిల్లాకు బెంగళూరుకు విమానంలో వచ్చి, అక్కడి నుంచి జిల్లాకు వచ్చేవారు. వారు విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత సరిగ్గా 60-70 నిమిషాల్లో ఎర్రమంచి భూముల వద్దకు చేరుకునేలా పక్కా ఏర్పాట్లు చేసేవారు. Bangalore airport nunchi Erramanchi is around 130 Kms as per google maps 60-70 mins lo ela vachestaaru vayya, more over it has tolls also...Looks absolutely impossible too much rastunnaru... Quote
BaabuBangaram Posted February 22, 2018 Author Report Posted February 22, 2018 8 minutes ago, Kool_SRG said: Bangalore airport nunchi Erramanchi is around 130 Kms as per google maps 60-70 mins lo ela vachestaaru vayya, more over it has tolls also...Looks absolutely impossible too much rastunnaru... Hyper loop Quote
aakathaai Posted February 22, 2018 Report Posted February 22, 2018 Some more Isuzu motors - nellore Hero motors - chittoor Apollo tyres - chittoor Bharath forge - nellore Quote
Equalirights Posted February 22, 2018 Report Posted February 22, 2018 Why calling re...call cheyyakundane oka mundamopi vachi edustundhi...inko mundamopi rakundane secret ga gajulu pagalkotutuntadi.. Quote
Kontekurradu Posted February 22, 2018 Report Posted February 22, 2018 1 hour ago, Equalirights said: Why calling re...call cheyyakundane oka mundamopi vachi edustundhi...inko mundamopi rakundane secret ga gajulu pagalkotutuntadi.. maa @TampaChinnodu edavdu, oly ee news ee veathadu TG o TRS guruchi matam asalu nws dorakavu, adi golden statte kada anta gold ee Quote
Kool_SRG Posted February 22, 2018 Report Posted February 22, 2018 2 hours ago, BaabuBangaram said: Hyper loop Quote
Kontekurradu Posted February 22, 2018 Report Posted February 22, 2018 22 minutes ago, Kool_SRG said: Maa Jagan Anna vastadu, vachi YSR loop easthadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.