Jump to content

Recommended Posts

Posted
పారిశ్రామికోత్సాహం 
తొలిరోజు రూ.41 వేల కోట్ల ఒప్పందాలు 
ఘనంగా భాగస్వామ్య సదస్సు ప్రారంభం 
ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 
ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్‌ 
విశాఖ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి 
24ap-main1a.jpg

విశాఖలో భాగస్వామ్య సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు సుమారు రూ.41 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మూడు రోజులు జరిగే సదస్సును 
ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సు ప్రారంభోత్సవం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి సురేష్‌ ప్రభు, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు, అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, సీసీఐ అధ్యక్షురాలు శోభన కామినేని పాల్గొన్నారు. దేశవిదేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, వివిధ దేశాల విదేశాంగశాఖ అధికారులు, రాష్ట్ర మంత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హార్బర్‌పార్కులోని ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ప్రాంగణానికి ముఖ్యమంత్రి ఉదయం 11.30 గంటలకే చేరుకున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. తొలిరోజు ప్రధాన సదస్సు ‘నవ భారతాన్ని ప్రపంచశ్రేణి సంస్థలతో అనుసంధానించే వ్యూహరచన’ అన్న అంశంపై జరిగింది. సాయంత్రం ‘సన్‌రైజ్‌ అంధ్రప్రదేశ్‌’ అంశంపై జరిగిన ప్లీనరీ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

24ap-main1b.jpg

రాజధానిలో ప్రాంతంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు 
రాజధాని అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ నిర్మించే అంతర్‌ వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌), రాజధాని ప్రాంతంలోని ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇటలీకి చెందిన అనాస్‌ ఇంటర్నేషనల్‌ ఎస్‌.పి.ఎ. సంస్థ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అనాస్‌ సంస్థకు చెందిన నికొలా చైరా, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రారంభ సదస్సు వేదికపైనే రూ.5700 కోట్ల పెట్టుబడులకు సంబంధించి భారత ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ సంఘం, ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ సంఘంతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు(ఏపీఈడీపీ) ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిశోర్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

మొత్తం 80 ఒప్పందాలు 
మొదటిరోజు సుమారు రూ.41 వేల కోట్ల విలువైన 80 ఒప్పందాలు జరిగాయి. వీటివల్ల లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తొలిరోజు ఆటోమొబైల్‌ రంగంలో రూ.15,224 కోట్లు, పర్యాటక రంగంలో రూ.7,807 కోట్లు, మౌలిక వసతుల రంగంలో సుమారు రూ.12500 కోట్లు, పారిశ్రామిక రంగంలో సుమారు రూ.5645 కోట్ల ఒప్పందాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో రూ.4 వేల కోట్లతో పోర్టు నిర్మాణానికి అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో మైత్రా మొబిలిటీ సంస్థ రూ.7 వేల కోట్లతో, సినర్జీ కాస్టింగ్స్‌ సంస్థ రూ.1,020 కోట్లతో, ఎలక్రికల్‌ మొబిలిటీ, సౌరవిద్యుత్‌, ఆటో కాంపొనెంట్స్‌ రంగాల్లో జేబీఎం గ్రూపు రూ.2,650 కోట్లు, సన్‌ మొబిలిటీ సంస్థ రూ.1,670 కోట్లుతో ఒప్పందాలు చేసుకున్నాయి. తొలిరోజు ఎస్సెల్‌ గ్రూపు, మహేంద్ర హాలీడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, ఐసీ నావల్‌ ఆర్కిటెక్స్ట్‌, గ్రాసెమ్‌ ఇండస్ట్రీస్‌ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. గోల్డ్‌ఫిష్‌ ఎడోబ్‌ సంస్థ రూ.2 వేల కోట్లతో గోల్ఫ్‌కోర్స్‌ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది.

24ap-main1e.jpg

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయం 
భాగస్వామ్య సదస్సులో భాగంగా లులు, షరాఫ్‌ గ్రూప్‌, షార్జా ఇస్లామిక్‌ బ్యాంక్‌ వంటి యూఏఈ వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘‘మీకు సాదర స్వాగతం పలుకుతున్నాం. యూఏఈకి మొదటి నుంచి మారాష్ట్రంతో సత్సంబంధాలున్నాయి. లులు, బీఆర్‌షెట్టి సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లాజిస్టిక్స్‌, ఆహారశుద్ధి, చమురు శుద్ధికేంద్రాలు, పునరుత్పాదక ఇంధనం, వైమానిక రంగాల్లో పెట్టుబడులకు ఆ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. లాజిస్టిక్స్‌ రంగంలో రాష్ట్రంలో విస్తృతావకాశాలు ఉన్నాయని వారికి ముఖ్యమంత్రి వివరించారు. వచ్చేఏడాది తాము నిర్వహించే ఎక్స్‌పోలో ఇండియన్‌ పెవిలియన్‌ విభాగాన్ని వినియోగించుకోవాలని దుబాయి వరల్డ్‌ ఎక్స్‌పో ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను అనుకూల ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నందుకు సీఎంను యూఏఈ రాయబారి అహ్మద్‌ ఎ.ఆర్‌.అల్‌బన్నా అభినందనలు తెలిపారు. అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సంస్థ ప్రతినిధులు మిరాన్‌ బ్రిలియంట్‌ సారథ్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఐబీఎం, ఐటీసీ ఇన్ఫోటెక్‌, జీఎంఆర్‌, స్కైమెట్‌ వంటి సంస్థల ప్రతినిధులు బృందంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీరంగం పురోభివృద్ధి తనకు సంతోషం కలిగించిందని బ్రిలియంట్‌ తెలిపారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయం ఏర్పాటు  చేయాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు ఒక అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు ఏర్పాటుకు తాను కృషిచేస్తానన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై అమెరికా సంస్థలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయం తోడ్పడుతుందన్నారు. అలాంటి లక్ష్యంతోనే తాము ఆర్థికాభివృద్ధి బోర్డు ఏర్పాటు చేశామని, దేశంలో అలాంటి సంస్థ మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

24ap-main1c.jpg

24ap-main1d.jpg

24ap-main1f.jpg

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    15

  • mettastar

    8

  • bhaigan

    3

  • reality

    2

Top Posters In This Topic

Posted

AP meedha edupe daily job anukunta kontha mandiki ee db lo .. DB pay chesthunda leka mentality ye antha😀😀

Posted
2 minutes ago, Ekambaram said:

AP meedha edupe daily job anukunta kontha mandiki ee db lo .. DB pay chesthunda leka mentality ye antha😀😀

alage roju top 5 city in the world ani yellow bhajana sese batch ki evaru paying or mentality ye antha aa @3$%

Posted
1 minute ago, TampaChinnodu said:

alage roju top 5 city in the world ani yellow bhajana sese batch ki evaru paying or mentality ye antha aa @3$%

Ha ha aa batch tho samanam anamata ayithe ee edupu batch good going .. so idi kuda edupu post ye anamata .. 😀😀

Posted

aithe ee moodu rojulu nee gaajula gala gala la tho ee db kala kala ladutundanna maata...4th day matham jagulu pagala kottukovala malla..

Posted

Inka siggu raley eelaki. Ee echula dngudu valla special status ivvatle package ivvatle 

 

lol CBN media 

Posted

mythra mobility , 7000 crores investment , electric vehicles , 14000 jobs aa . em company idi ? Google sesina emi results raavatle 

Posted
Quote

Anas International 7000 crore investment. 

Anas International is road construction company based in Italy .

So government gave them contract to build roads in Amaravathi ? And it is counted as investment ? I will be happy to correct my self if someone tells me how is this an investment ? Or If I am missing something here

Posted

inka evadanna special status ani special package ani goadava kani  discussion kani pedithe G lo rod dimpadam ee

Posted
4 minutes ago, bhaigan said:

inka evadanna special status ani special package ani goadava kani  discussion kani pedithe G lo rod dimpadam ee

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...