Paidithalli Posted February 26, 2018 Report Posted February 26, 2018 Several foreign delegates expressed their interest to invest in Andhra Pradesh on the second day of the CII Partnership Summit-2018. In a series of bilateral meetings held by Chief Minister N Chandrababu Naidu, a delegation from the International Trade and Investment, Spanish Ministry of Economic Affairs and Spanish Embassy evinced interest in extending support in building Tirupati as a smart city. The representatives from the Australian organisation Cooperative Research Centre for Water Sensitive Cities (CRCWSC) signed an agreement with APCRDA to extend support for water management in Amaravati. An MoU was signed with a Finnish company to build a robotics and AI-based University and recreate the Finnish start-up experience. The firm is keen to realise AP’s dream of a Happy City and also develop the ecosystem for gaming in the State. The Chief Minister met with the Ambassador of Czech Republic to India, Milan Hovorka, who was accompanied by businessmen interested to invest in the State. “We are keen to increase our presence in the State, especially in the public transport sector,” the Ambassador informed the CM. Quote
sattipandu Posted February 26, 2018 Report Posted February 26, 2018 bro u @SonyKongara dupe???? Quote
Paidithalli Posted February 26, 2018 Author Report Posted February 26, 2018 తిరుపతి నగరపాలికలో భూగర్భ విద్యుత్ తీగల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తిరుపతి స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతుందన్న నమ్మకంతో విభాగాల వారీగా స్మార్ట్ పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటు పనులు సోమవారం ప్రారంభించింది. శ్రీగోవిందరాజస్వామి దక్షిణ మాడ¿వీధిలో నిర్మిస్తున్న గృహాంతర్గత విద్యుత్ సబ్‌స్టేషన్(ఇండోర్ సబ్‌స్టేషన్) నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన 33కేవీ విద్యుత్‌లైన్‌ను భూమిలోపల నుంచి తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్ఎస్ సుబ్బులక్ష్మీ కూడలి నుంచి గోవిందరాజస్వామి దక్షిణ మాడ¿వీధి వరకు రెండు కిలోమీటర్ల దూరాన్ని భూగర్భ విద్యుత్ తీగలను వేస్తున్నారు. అంతేకాకుండా ఆందంగా ఉన్న రహదారులను తవ్వకుండా ప్రత్యేక యంత్రంతో సొరంగంగా డ్రిల్ చేసి దాని ద్వారా తీగలు అమర్చడానికి చర్యలు తీసుకున్నారు. నగరంలో విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా ఉండడంతో స్మార్ట్‌సిటీలో భాగంగా వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ తీగలను ఏర్పాటుచేసేందుకు రూ.160 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం తిరుపతిలో రూ.20 కోట్ల వరకు వెచ్చించి అధునాతన ఇండోర్ సబ్స్టేషన్లు, భూగర్భ విద్యుత్తీగలను నిర్మిస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ తీగలను ఏర్పాటు చేసేందుకు రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నారు. గృహాంతర్గత విద్యుత్తు ఉపకేంద్రాలు తిరుపతిలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం కోసం ఏపీఏస్పీడీసీఎల్ అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. నగరంలో సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థల సమస్య ఎక్కువగా ఉండడంతో అధికారులు ఇండోర్ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి దక్షిణమాడ¿వీధి, తితిదే పరిపాలన భవనం, తిరుచానూరులోని తోళప్పగార్డెన్స్‌లో ఒక్కో సబ్‌స్టేషన్‌ను రూ.3కోట్లతో ఇండోర్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. వీటితో పాటు మదనపల్లె, చిత్తూరులలో కూడా నిర్మించేందుకు విద్యుత్‌శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లలను భూమిలోపల ఉంచి వాటి నుంచి పైబర్ తీగల ద్వారా అనుసంధానం చేస్తారు. 20్ఠ20 మీటర్ల స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో నగరాల నడిబొడ్డున కూడా తక్కువ విస్తీర్ణంలో వీటిని నిర్మించుకునే సౌలభ్యం ఉంది. Quote
Hydrockers Posted February 26, 2018 Report Posted February 26, 2018 paper cuttings ese id id marindi chusuko thata Quote
Paidithalli Posted February 26, 2018 Author Report Posted February 26, 2018 స్మార్ట్‌గా జూ అభివృద్ధి! స్మార్ట్‌సిటీ నేపథ్యంలో జంతు ప్రదర్శనశాల విస్తరణ రూ.200 కోట్లతో మాస్టర్‌ప్లాన్ నైట్సఫారీ, ట్రెక్కింగ్ పాయింట్ల ఏర్పాటు న్యూస్‌టుడే, మంగళం(తిరుపతి) స్మార్ట్‌సిటీగా ఎంపికైన తిరుపతి నగరానికి మహర్దశ పట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని సందరనగరంగా తీర్చిదిద్దే వీలు కలిగింది. దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తూనే.. అభివృద్ధికి దారులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే నగరంలోని ఉద్యానవనాలు అభివృద్ధి చేసే పనులు ఇప్పటికే పూర్తిచేశారు. ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వంతు వచ్చింది. జూను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతామంటూ అధికారంలో ఉన్న పార్టీలు ఏళ్లుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇందుకు సంబంధించిన అడుగులు పడ్డాయి. జిల్లాకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జూను అంతర్జాతీయస్తాయిలో తీర్చిదిద్దేందుకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. వీటితో జూకు పూర్తిస్థాయిలో ప్రహరీ నిర్మించడం, జంతు నివాస స్థావరాలను ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దడం, మోనోరైలు ఏర్పాటు, జూ ప్రవేశమార్గాన్ని తీర్చిదిద్దడం వంటి పనులు చేయట్టాలని నిర్ణయించారు. ఆ ప్రయత్నం కొంతవరకు విజయవంతమైనా, పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. ఆ తరువాత మాస్టర్ ప్లాన్‌కు నిధులు మంజూరు కాకపోవడంతో పథకం మరుగున పడిపోయింది. దీంతో సీజెడ్ఏ(సెంట్రల్ జూ అథారిటీ) నిధులు, జూపార్కు ఆదాయంతో జూను కొంతమేరకు అభివృద్ధి చేశారు. తెరపైకి మాస్టర్‌ప్లాన్ స్మార్ట్‌సిటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మాస్టర్‌ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో జూపార్కు అధికారులు రూ.200 కోట్ల వ్యయంతో 1200 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టబోయే అభివృద్ధి పనులతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. జూలోని అన్ని విభాగాలను ఆధునికీకరించడం, విస్తరించడం వంటి పనులను రాబోయే 20 ఏళ్లలో చేపట్టే ప్రణాళికలు రూపొందించారు. ప్రతిపాదనలను ఇటీవలే జూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పనులు ప్రారభించేందుకు సిద్ధంగా ఉన్నారు. నైట్సఫారీ.. ట్రెక్కింగ్.. జూపార్కును మాస్టర్ ప్లాన్‌కు అనువుగా తీర్చిదిద్దేందుకు అధికారులు లేఔట్‌ను రూపొందించారు. ఇందులో ప్రధానంగా సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో నైట్‌సఫారీని డిజైన్ చేశారు. ఎంపిక చేసిన భూభాగంలో అంతర్గత రోడ్లు, వన్యప్రాణుల నివాస స్థావరాలు, సందర్శకులకు అనువుగా వసతి కేంద్రాలు, తాగునీటి శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాత్రి ఆరుగంటల తరువాత నైట్‌సఫారీని ఏర్పాటు చేస్తారు. జూపార్కు అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో సందర్శకులు తిరుగుతూ రాత్రి సంచార జంతువులను చూసే అవకాశం కల్పిస్తారు. మేకలబండ కొండపైకి ట్రెక్కింగ్ అలానే 200 హెక్టార్ల పరిధిలో ఉన్న మేకలబండ కొండపైకి ట్రెక్కింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొండపైకి మార్గాన్ని ఏర్పాటుచేసి, పై భాగంలో హిల్‌వ్యూ కేంద్రం ఏర్పాటు చేస్తారు. కొండపై నుంచి తిరుపతి నగరాన్ని చూసేందుకు వీలుగా టెలీస్కోపులను అందుబాటులో ఉంచుతారు. వీరికి అనువుగా విశ్రాంతి కేంద్రాన్ని నిర్మిస్తారు. దీంతోపాటు మరో రెండు వందల హెక్టార్లలో వివిధ జంతువుల సఫారీలను ఏర్పాటు చేస్తారు. స్మార్ట్‌సిటీకి అనువుగా.. తిరుపతి నగరం ఆకర్షణీయనగరంగా ఎంపికైన నేపథ్యంలో జంతు ప్రదర్శనశాలనూ విస్తరించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాబోయే ఇరవై సంవత్సరాల్లో అభివృద్ధి చేసేందుకు అనువుగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాం. ఇందుకోసం రూ.200 కోట్ల అంచనాలను ప్రభుత్వానికి పంపాం.మాస్టర్‌ప్లాన్ అమలుతో జూ దశ మారనుంది. సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.