Jump to content

Amaravathi latest development updates


Recommended Posts

Posted

అమరావతిలో చిప్‌ డిజైన్‌ వర్సిటీ
27-02-2018 04:42:30

విశాఖపట్నం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను ఓ స్టార్టప్‌ కంపెనీలా భావించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అమరావతిలో త్వరలో చిప్‌ డిజైన్‌ తయారీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఏపీలో నూతన పోర్టులు, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సదస్సు మూడో రోజు ‘ద యూనివర్స్‌ ఆఫ్‌ స్టార్టప్స్‌’ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో మూడున్నర ఏళ్లలోనే 12% వృద్ధి సాధించామన్నారు. కాగా, విశాఖలోని మధురవాడలో 19.6 ఎకరాల్లో ఐటీ ట్విన్‌ టవర్లను నిర్మించేందుకు ఏపీ ఐటీశాఖతో వుడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Posted

స్టార్టప్‌ ఏరియాలో సింగపూర్‌ విజిటర్‌ సెంటర్‌, గ్యాలరీ
27-02-2018 08:17:17

అమరావతి: రాజధాని ప్రగతికి పునాదిగా నిలవనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిని చేపట్టనున్న సింగపూర్‌ కన్సార్షియం ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఒక విజిటర్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ గ్యాలరీలను నిర్మించనుంది. ‘ఫేజ్‌ జీరో’ అని సదరు ప్రాంతాన్ని వ్యవహరిస్తున్న ఈ కన్సార్షియం 684 హెక్టార్లలో విస్తరించిన స్టార్టప్‌ ఏరియాను అమరావతి అభివృద్ధి సంస్థతో కలసి సంయుక్తంగా అభివృద్ధి పరచనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా అమరావతిని సందర్శించేందుకు వచ్చే వారు ఈ ప్రాంతం గురించి తెలుసుకునేందుకు వీలుగా 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో అక్కడ విజిటర్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ గ్యాలరీలను ఏర్పాటు చేయనుంది. అమరావతి రాజధాని నగరం అభివృద్ధి చెందే క్రమాన్ని ఎప్పటికప్పుడు సందర్శకుల కళ్ల ముందు ఇవి నిలపనున్నాయి. అంతే కాకుండా వాణిజ్యాభివృద్ధికి తద్వారా అమరావతి ఆర్ధికాభ్యున్నతికి తోడ్పడనుంది. అత్యంత అధునాతనమైన, నాణ్యమైన నగరీకరణకు ఉపకరించే విధానాలతో రాజధాని రూపొందే వైనాన్నీ కళ్లకు కట్టనుంది. రెండు హెక్టార్లకు పైగా సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ నిర్మాణాలు కమ్యూనిటీ హబ్‌గానూ రూపుదిద్దుకుని, స్థానికులు ఆహ్లాదంతోపాటు సామూహిక కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు కల్పించనుంది.

 
Posted
3 hours ago, aakathaai said:

Eeroju nuv duty ekkavaa

@Paidithalli ke warnings paddayi... so , biscuits asthundu TDP batch ke...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...