Jump to content

Recommended Posts

Posted

 రాష్ట్ర ప్రయోజనాలపై  రాజీపడేదిలేదన్న ముఖ్యమంత్రి 

2ap-main4a.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబుతో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న ఒక ప్రతినిధి బృందాన్ని దిల్లీ పంపించాల్సిందిగా సూచించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులను చర్చలకు పంపిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పూర్తి సమాచారంతో బృందాన్ని పంపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టంచేశారు. తమ పోరాటం భాజపా మీద కాదని తెలిపారు.. కేంద్రం తీరు ఆశాజనకంగా లేకపోవడం వల్లే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విభజన చట్టంలోని అంశాల్ని, కేంద్ర ప్రభుత్వం హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందేనన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన కొంత సేపటికే అమిత్‌షా నుంచి ముఖ్యమంత్రికి ఫోన్‌ వచ్చింది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహంగా ఉండటం, పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని తెదేపాపా సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమిత్‌షా ఫోన్‌ చేసి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Posted
636556417837182914.jpg
  • చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌
  • ఎల్లుండి ఢిల్లీకి రావాలని పిలుపు
  • సుజన, రామ్మోహన్‌, కుటుంబరావు
  • వస్తారని చెప్పిన ముఖ్యమంత్రి
  • మొన్నటి చర్చల తీరుపై అసంతృప్తి
  • మాటలు మాటలే.. ఒత్తిడి ఒత్తిడే!
  • సభలో తగ్గొద్దని ఎంపీలకు ఆదేశం
  • చిచ్చుపెట్టి రెచ్చగొడతారా?
మాట్లాడదాం రండి
03-03-2018 02:43:04
 
636556417837182914.jpg
  • చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌
  • ఎల్లుండి ఢిల్లీకి రావాలని పిలుపు
  • సుజన, రామ్మోహన్‌, కుటుంబరావు
  • వస్తారని చెప్పిన ముఖ్యమంత్రి
  • మొన్నటి చర్చల తీరుపై అసంతృప్తి
  • మాటలు మాటలే.. ఒత్తిడి ఒత్తిడే!
  • సభలో తగ్గొద్దని ఎంపీలకు ఆదేశం
  • చిచ్చుపెట్టి రెచ్చగొడతారా?
అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఒకసారి అసమగ్రంగా, అసంతృప్తిగా ముగిసిన చర్చలు! ‘కమలం’పై గరంగరంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు! ‘డైనమిక్‌’ నిర్ణయాలకూ సిద్ధమంటూ ప్రకటనలు! సోమవారం నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్‌ సమావేశాలు! ఈ తరుణంలో బీజేపీ అధిష్ఠానంలో కదలిక వచ్చింది. శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి ఫోన్‌ వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘ఐదో తేదీన ఢిల్లీకి రండి. మాట్లాడుకుందాం’’అని అమిత్‌ షా కోరారు.
 
చర్చలకు చంద్రబాబు అంగీకరించారు. అయితే... తమ తరఫున కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు... గురువారం వీరు ఢిల్లీకి వచ్చి కలిసినప్పుడు చర్చలు జరిగిన తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నామని షాతో సూటిగా చెప్పారు. ఐదు నిమిషాలపాటు ఈ ఫోన్‌ సంభాషణ నడిచింది. ఈ విషయాన్ని ఎంపీలకు చంద్రబాబు తెలిపారు. ‘‘చర్చలు చర్చలే... ఆందోళన ఆందోళనే! రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదు. కేంద్రం నుంచి రావాల్సిన సాయం, హోదా ప్రయోజనాలపై పోరాటం ఆపేది లేదు. పార్లమెంటులో గట్టిగా ఉండండి’’ అని ఎంపీలను ఆదేశించారు. సోమవారం చర్చలకు పిలిచిన అమిత్‌షా... గురువారం మాత్రం తన వద్దకు వచ్చిన రామ్మోహన్‌ నాయుడు, కుటుంబరావులతో కఠినంగా మాట్లాడినట్లు తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి వారు వివరిస్తుండగా... ‘‘ఏపీకి ఇప్పటికే చాలా ఇచ్చాం. మీరు వాటి గురించి చెప్పడంలేదే’’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
Posted
4 minutes ago, TOM_BHAYYA said:

Ee drama elechhanla dhaaka common ye ga

ఎక్కడో నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమయిన నాయకుడు 
ఇపుడు ఆంధ్రరాష్ట్రానికి ఆయనిస్తుంది అలాంటి నాయకత్వమే 
దయచేసి మీరలా మాట్లాడకండి 

Posted
Posted
10 minutes ago, TOM_BHAYYA said:

Ee drama elechhanla dhaaka common ye ga

చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ని శంకించాల్సిన అవసరం లేదు 
తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా , పదేళ్లు ప్రతిపక్షనేతగా సమస్యలపైనా తాను పోరాడిన తీరు మనకి స్ఫూర్తిదాయకం 
కేంద్రం ప్రభుత్వం తల తోక లేకుండా , ఇష్టానికి విభజన చేసిన 
మెక్కోంచని దీక్షతో పోరాడుతున్నారు..విభజన చట్టం లో చెప్పినవి అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం గా.. చెయ్యని పక్షం లో తెగదెంపులు అని మన నాయకుడు ముందు నుంచి చెప్తున్నాడు
ఎందుకు మీరింకా ఆలా మాట్లాడతారు ?

Posted
23 minutes ago, Navyandhra said:

చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ని శంకించాల్సిన అవసరం లేదు 
తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా , పదేళ్లు ప్రతిపక్షనేతగా సమస్యలపైనా తాను పోరాడిన తీరు మనకి స్ఫూర్తిదాయకం 
కేంద్రం ప్రభుత్వం తల తోక లేకుండా , ఇష్టానికి విభజన చేసిన 
మెక్కోంచని దీక్షతో పోరాడుతున్నారు..విభజన చట్టం లో చెప్పినవి అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం గా.. చెయ్యని పక్షం లో తెగదెంపులు అని మన నాయకుడు ముందు నుంచి చెప్తున్నాడు
ఎందుకు మీరింకా ఆలా మాట్లాడతారు ?

thankyou CBN

Posted
9 minutes ago, TampaChinnodu said:

thankyou CBN

ధన్యవాదాలు తంప చిన్నోడు గారు 

Posted
1 hour ago, Navyandhra said:

ఎక్కడో నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమయిన నాయకుడు 
ఇపుడు ఆంధ్రరాష్ట్రానికి ఆయనిస్తుంది అలాంటి నాయకత్వమే 
దయచేసి మీరలా మాట్లాడకండి 

Are you Sony kongara outside?

Posted

Will escalate fight with Modi govt on AP promises, says TDP

Posted
8 hours ago, megadheera said:

Are you Sony kongara outside?

Any dought 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...