SonyKongara Posted March 7, 2018 Report Posted March 7, 2018 On 3/3/2018 at 9:03 PM, Navyandhra said: abhivruddhini chudandi.. Quote
Navyandhra Posted March 7, 2018 Author Report Posted March 7, 2018 Hon'ble CM Sri Nara Chandrababu Naidu launched feeder ambulances (2-wheeler ambulances) in Amaravati on 6th March. A life-saving measure for people of remote tribal villages, which are inaccessible to normal ambulances, across AP. #ArogyaAndhra#SwasthaBharath #WednesdayWisdom Quote
Navyandhra Posted March 7, 2018 Author Report Posted March 7, 2018 In a bid to make Andhra Pradesh 100 per cent green and pollution-free, the state government is aggressively working towards introducing 1 lakh electric vehicles and to create a massive employment of over 1.05 lakh jobs. As a result of the efforts of the government on the project, a first in the country, the Energy Efficiency Services Ltd (EESL) has agreed in principle to invest a capital cost of Rs 10,250 crore in AP with operational investment of Rs 2,000 crore per year for 1 lakh e-cars. Quote
Anthanaistam Posted March 7, 2018 Report Posted March 7, 2018 12 hours ago, SonyKongara said: Ekkada DB lo number of pulka accounts lo na Quote
Navyandhra Posted March 8, 2018 Author Report Posted March 8, 2018 విజయవాడ నగరంలో మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా రూ.75 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. నిధుల సమస్యతో విజయవాడ నగరపాలక సంస్థ సతమతమవుతోంది. సిబ్బంది జీతభత్యాలను చెల్లించే పరిస్థితి లేదని అధికారులు వాపోతున్నారు. దీంతో దీనికి వివిధ పథకాల కింద అందే నిధులను కాకుండా ప్రత్యేకంగా రూ.75 కోట్లు కేటాయింపులు జరిపారు. ఈ నిధులతో నగరం సుందరీకరణ చేయాల్సి ఉంటుంది. కాలువల బ్యూటిఫికేషన్, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పచ్చదనం లాంటి పనలు చేపట్టనున్నారు. అమృత్ పథకం కింద నిధులు అందించనున్నారు. అదేవిధంగా నగరాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఈ ఏడాది రూ.200 కోట్లు కేటాయించారు. దీనిలో విజయవాడ నగరానికి కేటాయించనున్నారు. నగరం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నగరం పరిధిలో మరో 51 పంచాయతీలు చేరనున్నాయి. దీనికి సంబంధించిన నిధులు అమృత్ కింద రానున్నాయి. ఈనాడు, అమరావతి కేంద్రం నుంచి సహకారం లభించకున్నా.. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం పూనింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ)కు భారీగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో రాజధానికి రూ.7,741 కోట్లు కేటాయించింది. గతంలో రూ.వెయ్యి కోట్లు మాత్రమే సర్దుబాటు చేసినా ఖర్చు నామమాత్రంగానే ఉండేది. ఈ ఏడాది నిర్మాణాలకు, మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయించింది. 2019 నాటికి రాజధాని ఒక రూపు రావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ ఏడాది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో నీటి పారుదలకు నిధులు కేటాయించింది. సొంత జిల్లాకు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొన్ని నిధులు సర్దుబాటు చేశారు. మరో విశేషం ఏమిటంటే.. ఈసారి బడ్జెట్లో నిధుల లేమితో సతమతమవుతున్న విజయవాడ నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం. విజయవాడ మెట్రోకు నామమాత్రం భూసేకరణ కోసం నిధులు కేటాయించారు. సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం పట్ల అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు జిల్లాకు నిధులు రానున్నాయని అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి ప్రాధాన్యం! నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. 2018-19 బడ్జెట్లో సీఆర్డీఏ సంస్థకు రూ.7,741 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ నిధులతో రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణాలకే రూ.40వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఇప్పటికే రైతుల నుంచి స్వచ్ఛందంగా తీసుకున్న 34వేల ఎకరాలను అభివృద్ధి చేయడంలో దృష్టి సారించారు. తాత్కాలిక భవనాలను నిర్మాణం చేసి పరిపాలన సాగిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణం ఒక రూపు రావాలనేది సంకల్పంగా ఉంది. గడిచిన నాలుగేళ్లలో సీఆర్డీఏకు కేటాయింపులు తక్కువగానే ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు అందుతాయని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాలేదు. రాజధాని పేరుతో పట్టణాభివృద్ధికి కేటాయించిన రూ.1000 కోట్లు విజయవాడ గుంటూరు నగరాల్లో డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లోనే రూ.7,741కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు కల్పనకు కేటాయిస్తారు. దేనికి ఎంత కేటాయించాలనేది సీఆర్డీఏ నిర్ణయిస్తుంది. సీఆర్డీఏకు పట్టణ ప్రణాళిక, ప్లాట్ల అభివృద్ధి ద్వారా ఆదాయం సమకూరనుంది. దీని ఆధ్వర్యంలో అంతరవలయ రహదారి, బాహ్యవలయ రహదారి, ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజధానిలో ఉద్యోగుల భవనాలను నిర్మాణం చేస్తున్నారు. చింతలపూడికి రూ.378 కోట్లు! కృష్ణా జిల్లాలో 2.1లక్షల ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మాణం చేస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.378 కోట్లు కేటాయించడం పట్ల రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సాగునీటితో పాటు దాదాపు 40 గ్రామాలకు తాగు నీరు కూడా అందించనున్నారు. దీనికి గత ఏడాది సీఎం శంకుస్థాపన చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతనిధి కావడంతో చింతలపూడి ఎత్తిపోతలకు ప్రాధాన్యం ఇచ్చారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. * ఈ ఏడాది సాగునీటి సంఘాలకు (వాటర్ యూజర్స్ అసోసియేషన్) రూ.40.50కోట్లు కేటాయించారు. దీంతో సంఘాల ఆధ్వర్యంలో పలు కాలువల నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉందంటున్నారు. * ప్రకాశం బ్యారేజీ వరద నిర్వహణకు రూ.5లక్షలు మాత్రమే కేటాయించారు. బకింగ్‌హం కాలువ నావిగేషన్ కోసం రూ.95.09లక్షలు కేటాయించారు. * కృష్ణా డెల్టా ఆధునికీకరణ కోసం రూ.101లక్షలు మాత్రమే కేటాయించారు. గత కొన్నేళ్లుగా దీనికి నిధులు కేటాయించడం లేదు. ఇవి డెల్టా కాలువల నిర్వహణ కోసమేనని అధికారులు చెబుతున్నారు. ఇతర పరిపాలన వ్యయం కింద రూ.83.85కోట్లు కేటాయించారని చెబుతున్నారు. * చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.378కోట్లు కేటాయించారు. దీని ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద వచ్చే 2.1 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. * కృష్ణా డెల్టా సిస్టం చీఫ్ ఇంజినీరు పరిధిలో పనులకు రూ.340కోట్లు కేటాయించారు. దీనిలో నిధులను రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేటాయించే అవకాశం ఉంది. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు ప్రత్యేకంగా 242.95కోట్లు కేటాయించారు. దీంతో కాలువల లైనింగ్ పనులు ఇతర నిర్వహణ పనులు చేపట్టే అవకాశం ఉంది. * ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో ఉన్న పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.70 కోట్లు కేటాయించారు. నిర్వహణ, పునరావాసం కింద నిధులు బకాయిలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నీటిని నిలువ చేయాలంటే తెలంగాణ రాష్ట్రం పరిధిలోని పునరావాస గ్రామాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. * జలవనరుల శాఖకు చెందిన వివిధ కార్యాలయాలు విజయవాడలోనే ఉన్నాయి. వాటి నిర్వహణకు భారీగానే నిధులు కేటాయించారు. భవానీకి రూ.10కోట్లు..! విజయవాడ నగరంలో పర్యాటక కేంద్రం భవానీ ద్వీపానికి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. ఇప్పటికే భవానీ ద్వీపం అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. బృహత్తర ప్రణాళిక రూపొందించి ఏడు ద్వీపాలను అనుసంధానం చేసి అభివృద్ధి చేయనున్నారు. దీనికి ప్రత్యేకంగా భవానీ ద్వీపం అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 2018-19 బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. వాటితో సీలైన్ పార్కు, బర్డ్ పార్కు, అంతర్గత మౌలిక వసతుల ఏర్పాటు, మెరైన్-పడవలు నిలుపు స్థలం ఏర్పాటు, ఇంటి పడవల ఏర్పాటు, ఆరు కాటేజీల నిర్మాణం చేయనున్నారు. భవానీ ద్వీపంలో ఇప్పటికే మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్‌షో ఏర్పాటు చేశారు. పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్లో రూ.290 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇతర కేటాయింపులు..! * అమరావతి నగరం ఆకర్షణీయ నగరాల జాబితో చేర్చారు. ఆకర్షణీయ నగరాల్లో మౌలిక వసతులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రూ.800 కోట్లు కేటాయించారు. తిరుపతి, విశాఖ ఇతర నగరాలతో పాటు అమరావతికి నిధులు రానున్నాయి. * ఏపీ టిడ్కోకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. టిడ్కో ఆధ్వర్యంలో విజయవాడలో పట్టణ గృహనిర్మాణం, జక్కంపూడి ఆర్థిక నగరం నిర్మాణం కానుంది. ఇదే తరహాలో ఇతర నగరాల్లోనూ టిడ్కో నిర్మాణం చేపట్టింది. వీటికి అన్నింటికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. * పురపాలక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు రూ.490 కోట్ల కేటాయింపులు జరిపారు. పలు పట్ణణాలకు వెసులు బాటు రానుంది. * విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.1168కోట్లు కేటాయించారు. ఈ కారిడార్‌లో మచిలీపట్నం అభివృద్ధి కూడా మిళితమై ఉంది. కారిడార్‌లో భాగంగా మచిలీపట్నం ప్రాంతం అభివృద్ధి చెందనుంది. * సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరిగాయి. అన్ని వర్గాలు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రోకు రూ.5కోట్లా..! విజయవాడ నగరంలో నిర్మాణం చేసే మెట్రో ప్రాజెక్టుకు భూసేకరణకు రూ.5కోట్లు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నగర అభివృద్ధిలో భాగంగా భూసేకరణలో మెట్రోకు ఈ నిధులు కేటాయింపులు చేశారు. కానీ ప్రత్యేకంగా అమరావతి మెట్రో ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేవు. గత ఏడాది దాదాపు రూ.100 కోట్లు కేటాయించింది. అంతకు ముందు రూ.300 కోట్లు కేటాయించింది. కానీ ఈ ఏడాది మెట్రోకు రూ.5కోట్లు మాత్రమే భూసేకరణలో చేర్చింది. దీంతో మెట్రో ప్రాధాన్యం తగ్గిపోయింది. పీపీపీ కింద మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయనున్న విషయం తెలిసిందే. దీనికి ప్రస్తుతం డీపీఆర్ తయారు చేస్తున్నారు. Quote
TampaChinnodu Posted March 8, 2018 Report Posted March 8, 2018 Telugu Jaathi pride and culture ni saati seppe idly tower ki funds ichara leda ? Quote
Navyandhra Posted March 14, 2018 Author Report Posted March 14, 2018 గన్నవరంలో అంతర్జాతీయ టెర్మినల్ రెడీ..! 14-03-2018 09:03:42 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఏఏఐ సమాచారం ఇమిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు, కార్యాలయాలు సిద్ధం ఇంటీరియర్ పూర్తి.. అరైవల్, డిపార్చర్ బ్లాక్స్ ముస్తాబు విజయవాడ: అంతర్జాతీయ టెర్మినల్ బిల్డింగ్ సిద్ధమైంది! అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సివిల్ నిర్మాణాలు, ఇంటీరియర్, ఎలక్ర్టికల్, కేబులింగ్ వంటి వాటితో పాటు ప్రధానమైన ఇమిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాలు, వాటి చెకిన్ పాయింట్లు సిద్ధమయ్యాయి. మార్చి నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తామని ముందుగా చెప్పినట్టే చేసి చూపించారు. అరైవల్, డిపార్చర్ బ్లాక్స్ సుందరంగా ముస్తాబయ్యాయి. బ్యాగేజీ చెకిన్ యంత్రాలు సిద్ధమయ్యాయి. లగేజి కౌంటర్లు, ఎయిర్‌లైన్స్ కౌంటర్లు, సెంట్రలైజ్డ్ ఏసీ వంటివన్నీ పూర్తయ్యాయి. రన్‌వే వైపు ల్యాండ్ స్కేపింగ్, టెర్మినల్ లోపల సీసీ కెమెరాలు, డిస్ప్లే బోర్డులు.. అనేకం ఏర్పాటయ్యాయి. చైల్డ్ మిల్క్‌ఫీడ్ రూమ్, స్మోకింగ్ జోన్‌తో పాటు కమర్షియల్‌గా ఎస్టాబ్లిష్ చేయటానికి అనేక ఏర్పాట్లు చేపట్టారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావటమే ఇక మిగిలిన ప్రక్రియ. ఇమిగ్రేషన్ అధికారిగా పోలీసు ఉన్నతాధికారి గజరావు భూపాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్ స్టాఫ్‌కు సంబంధించి శిక్షణ నడుస్తోంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ చెకిన్ పాయింట్లు, కార్యాలయం సిద్ధమైంది. ఇందులో కంప్యూటర్లను సంబంధిత శాఖ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కస్టమ్స్ చెక్ ఇన్ కౌంటర్లు, కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. కస్టమ్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఆ శాఖ ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కస్టమ్స్ శాఖ విజయవాడ ఎయిర్‌పోర్టుపై అంత సీరియస్‌గా దృష్టి సారించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ హోదా వచ్చినా ఆ శాఖ పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వటంలో అంతులేని తాత్సారం నడుస్తోందని చెప్పవచ్చు. కస్టమ్స్ జాప్యం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ విమానాల రాకపోకల మీద ఇది ప్రభావితం చూపే అవకాశం లేదు. ఎలాగూ అంతర్జాతీయ స్థాయితో పాటు ఇమిగ్రేషన్ స్టేటస్ కూడా వచ్చింది కాబట్టి విదేశాలకు విమాన సర్వీసులు నడపటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుగా ఇమిగ్రేషన్ పలకరిస్తుంది. ప్రయాణికుడు అంతర్జాతీయ ప్రయాణానికి అర్హుడో కాదో ఈ శాఖ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రయాణికుడు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు హెల్త్ చెకప్ సెంటర్ ఉంటుంది. మూడవదిగా కస్టమ్స్. ఇది లగేజీని చెక్ చేస్తుంది. మేం సిద్ధం : ఏఏఐ అంతర్జాతీయ విమానాలు నడపటానికి విజయవాడలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు లేఖ రాశారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమానాలు నడపటానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ముంబయికి విమానయాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసును అంతర్జాతీయ సర్వీసుగా కూడా ఉపయోగించాలని నిర్ణయించింది. దుబాయ్, షార్జాలకు విమాన సర్వీసులను ప్రారంభించాలన్న ఆసక్తితో ఈ సంస్థ ఉంది. అంతర్జాతీయ టెర్మినల్ బిల్డింగ్ సిద్ధం కాకపోవటం, ఇమిగ్రేషన్ సాకారం కాకపోవడం వల్ల ఈ రెండు సానుకూలమయ్యే వరకు ముంబయికి మాత్రమే సర్వీసును నడపాలని నిర్ణయించింది. ఇప్పుడు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి కాబట్టి.. అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చన్న సమాచారాన్ని తెలియచేస్తున్నామని అధికారికంగా ఇక్కడి అధికారులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు సమాచారాన్ని అందించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ నుంచి సమాచారం రావాల్సి ఉంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.