Navyandhra Posted March 14, 2018 Author Report Posted March 14, 2018 అమరావతిలో అందమైన భవంతులు 14-03-2018 09:08:23 వెయ్యి అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం తక్కువ ధర.. ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం లావాదేవీల కోసం కన్సల్టెంట్ నియామకం ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానించిన సీఆర్డీయే అమరావతి: రాజధానిలో అత్యాధునిక... నాణ్యమైన గృహాలను నిర్మించి, పూర్తి పారదర్శక విధానంలో తక్కువ ధరకే ప్రజలకు అందజేయాలనే లక్ష్యంతో ఉన్న ఏపీసీఆర్డీయే ఆ దిశగా అడు గులు వేస్తోంది. ఇందులో అమరావతిలో ఏపీసీ ఆర్డీయే నిర్మించదలచిన 1,000 అపార్ట్‌మెంట్లకు సంబంధించి వినియోగదారులతో తన తరపున లావాదేవీలు సాగించేందుకు కన్సల్టెంట్ సంస్థను నియమించుకోబోతోంది. వ్యాయామ శాలలు, ఈతకొలనులు, నడక మార్గాలు, క్లబ్ హౌస్‌లు తదితర సకల సౌకర్యాలతొ రూపుదిద్దు కోబోతున్న ఈ గృహాల ఖరీదు, చెల్లింపుల విధివిధానాలను సీఆర్డీయేనే ఖరారు చేస్తుంది. వీటిని అనుసరించి ఈ అపార్ట్‌మెంట్ల మార్కె టింగ్, వాటి క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ తదితర లావాదేవీలన్నీ ఈ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించాలి. డిమాండ్ అసెస్‌మెంట్ తర్వాతే కన్సల్టెంట్ అమరావతిలో వివిధ వర్గాలు సొంత ఇంటిని కలిగి ఉండేలా చూడడంలో భాగంగా తొలిదశలో సుమారు 1,000 అపార్ట్‌మెంట్లు నిర్మించాలని సీఆర్డీయే నిర్ణయించింది. వీటిని ఒకేచోట నిర్మించాలా లేక రాజధానిలోని వివిధ ప్రాం తాల్లో కట్టాలా అనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఫ్లాట్లలో ఎన్నెన్ని 2,3, 4 బెడ్‌రూంల అపార్ట్‌మెంట్లు ఉండాలో కూడా తేల్చలేదు. అయితే వెయ్యి అపార్ట్‌మెంట్లు కట్టాలని నిర్ణయించిన సీఆర్డీయే.. వాటిలో ఏ బెడ్ రూం ఫ్లాట్లకు ఎంత డిమాండ్ ఉందో తెలుసుకునేందుకు ‘డిమాండ్ అసెస్‌మెంట్ సర్వే’ చేయించబోతోంది. ఈ సర్వే రెండు మూడు వారాల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఎన్ని బెడ్ రూంలతో ఫ్లాట్లు నిర్మించాలో నిర్ణయానికి వచ్చి.. వాటి ధరలను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియ సాగుతుండగానే అపార్ట్‌మెంట్ల మార్కెటింగ్, అగ్రిమెంట్లు, సేల్ డీడ్లు, డాక్యుమెంటేషన్ తదితర వ్యవహారాలన్నింట్లో సహకరించేందుకు కన్సల్టెంట్‌ను నియమించు కుంటోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్సల్టెంట్‌ను ఎంచుకునే నిమిత్తం ‘ఆర్.ఎఫ్.పి.(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్)’లను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. వీటి స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ అవకాశమిచ్చింది. ఆ తర్వాత రెండు నెలల్లోపు కన్సల్టెంట్‌ను ఎంపిక చేసుకోనుంది. మరోవైపు అపార్ట్‌మెంట్లను నిర్మించే కంపెనీలను గుర్తించేందుకు టెండర్లు పిలిచి, అర్హతలున్న వాటికి బాధ్యతలు అప్ప గిస్తుంది. ఈ దశలన్నీ పూర్తయైు గృహ సముదాయాలు నివాసానికి సిద్ధమయ్యేందుకు ఏడాదికిపైగానే పట్టవచ్చునని తెలుస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్‌లు సైతం.. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించాలనుకుంటున్న సీఆర్డీయే.. కమర్షియల్ కాంప్లెక్స్‌లను కట్టేందుకూ సమాయత్తమవుతోంది. పలు ప్రభుత్వరంగ, కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయ వసతి కోసం అమరావతిలో స్థలాలు కోరుతున్నప్పటికీ తనకున్న పరిమితుల దృష్ట్యా పెద్దసంఖ్యలో వాణిజ్య సముదాయాలను నిర్మించి, వాటిలోని ఆఫీస్ స్పేస్‌లను ఆసక్తి ఉన్న సంస్థలకు ఇవ్వాలనుకుంటోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.