TampaChinnodu Posted March 3, 2018 Report Posted March 3, 2018 మళ్లీ నగదు కష్టాలు రాష్ట్రంలోని బ్యాంకుల్లో తీవ్రంగా కరెన్సీ కొరత నోట్లరద్దు నాటి పరిస్థితులు 80 శాతం ఏటీఎంలు ఖాళీ నగదు అందించలేక చేతులెత్తేస్తున్న బ్యాంకులు అన్ని వర్గాలపైనా ప్రభావం ఈనాడు - అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పెద్దనోట్ల రద్దు జరిగిన తొలినాళ్లలో నెలకొన్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రాష్ట్రంలోని బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అవసరాలకు తగ్గ స్థాయిలో రిజర్వు బ్యాంకు నుంచి నగదు రాకపోవడం, బ్యాంకుల్లో రోజువారీ జమయ్యే నగదు కంటే ఉపసంహరించుకునే మొత్తమే అధికంగా ఉంటుండటంతో ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. చాలా బ్యాంకుల్లో గతేడాదితో పోలిస్తే డిపాజిట్లు తగ్గడం, ఉపసంహరణలు పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో సేవింగ్స్ ఖాతాల్లో జమచేయడం కూడా తగ్గింది. బ్యాంకుల్లో రోజు వారీ జరిగే లావాదేవీల సామర్థ్యాన్ని బట్టి ఆయా శాఖల్లో రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ నగదు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఏ బ్యాంకు శాఖల్లో చూసినా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు మించి నగదు లభ్యత ఉండటం లేదు. దీంతో బ్యాంకులకు రోజువారీ వచ్చి చేరే నగదును అదే రోజుల్లో ఏటీఎంల్లో పెట్టడానికి, ఖాతాదారులకు ఇవ్వడానికే సరిపోని పరిస్థితి ఉందని ఓ బ్యాంకు ఉద్యోగి వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. రూ.లక్షకు సంబంధించి చెక్కును బ్యాంకులో జమచేస్తే ఆ సొమ్ము చెల్లించడానికి కనీసం వారం నుంచి పది రోజులు పడుతోంది. ఏ జిల్లాలో చూసినా ఇదే దుస్థితి! * ప్రకాశం జిల్లాలో దాదాపు 650 ఏటీఎంలు ఉండగా..దాదాపు 70 శాతం ఏటీఎంల్లో నగదు లభ్యత లేదు.. * కృష్ణా జిల్లాలో విజయవాడ సహా 950 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 60 శాతం వాటిల్లో డబ్బుల్లేవ్. పది రోజుల కిందట రూ.4 వేల కోట్లు కావాలని లెక్కకట్టగా...ఇప్పటివరకూ రూ.257 కోట్లు మాత్రమే వచ్చింది. * గుంటూరు జిల్లాలోని బ్యాంకుల్లో లావాదేవీల కోసం రూ.2 వేల కోట్లు అవసరమని పది రోజుల కిందట అంచనా వేయగా..ఇప్పటివరకూ వచ్చింది రూ.200 కోట్ల లోపే ఉంది. ఈ జిల్లాలో 70 శాతం ఏటీఎంల్లో నో క్యాష్‌బోర్డులే కనిపిస్తున్నాయి. * చిత్తూరు జిల్లాలో 39 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి 610 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో రోజుకు సగటున రూ.1200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి. నగదు కొరత కారణంగా అందులో 45 శాతం మేరే లావాదేవీలు జరుగుతున్నాయి. 680 ఏటీఎం కేంద్రాల్లో గతంలో రోజుకు రూ.70 కోట్లు వరకూ నగదును పెట్టేవారు. ఇప్పుడు అందులో సగం కూడా పెట్టడంలేదు. * పశ్చిమగోదావరి జిల్లాలో 581 బ్యాంకు శాఖలు ఉండగా వీటి పరిధిలో 2 వేల వరకూ ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటిల్లో 90 శాతం కేంద్రాల్లో నగదు అందుబాటులో లేదు. ఈ జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంల్లో రోజుకు రూ.4 వేల కోట్ల వరకూ నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే ఆ స్థాయిలో నగదు బ్యాంకుల్లో అందుబాటులో లేదు. * శ్రీకాకుళం జిల్లాకు రూ.350 కోట్లు కావాలని స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంకులు రిజర్వు బ్యాంకును కోరగా కొద్ది రోజుల కింద రూ.50 కోట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు నగదు కొరతతో గతనెలలో ఇవ్వాల్సిన సామాజిక పింఛన్లు ఇప్పటికీ 20శాతంపైగా బకాయి పడి ఉన్నాయి. దీనితో రూ.వెయ్యి పింఛను కోసం వృద్దులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సొంత పనులపైన ఇటీవల కాకినాడ వెళ్లారు. అత్యవసరమై నగదు కోసం దాదాపు రెండున్నర గంటల పాటు 15 ఏటీఎంలు తిరిగినా పనవలేదు. చివరికి తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేసి అతని దగ్గరున్న సొమ్ము తీసుకుని తాత్కాలికంగా తన అవసరం నుంచి గట్టెక్కారు. రూ.లక్ష అంటే డిజిటల్ లావాదేవీనే! బ్యాంకు నుంచి రూ.లక్ష వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కొంత నగదు చేతికిచ్చి మిగతా మొత్తం మీరు చెప్పిన ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తామన్న సమాధానం ఎదురవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని బ్యాంకుల్లో రూ.లక్ష వెనక్కి తీసుకోడానికి కనీసం నెల రోజుల సమయం పడుతోంది. గుంటూరు జిల్లాలోని కొన్ని బ్యాంకులైతే రూ.లక్ష అడుగుతుంటే రూ.20 వేలు చేతిలో పెట్టి ప్రస్తుతానికి సరిపెట్టుకోమంటున్నాయి. * ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన సొమ్ములను మిల్లర్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. ఆ సొమ్ము తీసుకోవడం వారికి ప్రహసనంగా మారుతోంది. రైతులు తాము తీర్చాల్సిన అప్పులను తీర్చుదామంటే చేతిలో నగదు ఉండటం లేదు. అలాగని సంబంధిత వ్యక్తుల ఖాతాలకు ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేద్దామంటే అవతలి వ్యక్తులు అందుకు అంగీకరించడం లేదు. నగదు కొరత నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్, కాళేశ్వరరావు మార్కెట్ తదితర ప్రాంతాల్లో లావాదేవీలు 70 శాతానికి పైగా పడిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో కొన్ని ఏటీఎంలు నెలలు తరబడి మూతపడగా... మరికొన్ని చోట్ల నగదు పెట్టిన గంటల వ్యవధిలోనే ఏటీఎం ఖాళీ అయిపోతోంది. దీంతో అత్యవసరంగా నగదు కావాల్సిన వారు 40 కి.మీ. దూరాన ఒడిశాలోని పర్లాఖెమొండికి వెళ్లి అక్కడ ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. నగదు లేదు.. నెల గడిచేదెలా? ప్రస్తుతం కొత్త నెల ప్రారంభమైంది. ఉద్యోగుల వేతనాలు ఇతర అవసరాలకు మరింత నగదు అవసరం ఉంటుంది. ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు మొదటి వారంలో ఎక్కువగా నగదును వారు తమ ఖాతాల నుంచి తీస్తారు. ఆ స్థాయిలో బ్యాంకుల దగ్గర నగదు అందుబాటులో లేకపోవడంతో నెల గడిచేదెలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రైవేటు డెయిరీలు పాడిరైతులకు చెల్లించాల్సిన సొమ్మును పదిహేను రోజులకోసారి చెక్కుల రూపంలోనో లేదా వారి బ్యాంకు ఖాతాలకు జమచేయడమో చేస్తున్నాయి. రెండు నెలలుగా రైతులు బ్యాంకుల నుంచి ఆ సొమ్ము తీసుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.5 వేల కోట్లు కావాలని సీఎం కోరినా... రాష్ట్రంలో తీవ్ర నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడి లావాదేవీల కోసం రూ.5 వేల కోట్లు నగదు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిజర్వు బ్యాంకుకు పది రోజుల కిందట లేఖ రాశారు. ఇప్పటికీ రిజర్వు బ్యాంకు నుంచి మాత్రం నగదు రాలేదు. Quote
TampaChinnodu Posted March 3, 2018 Author Report Posted March 3, 2018 nijam gaane intha goram gaa vunda situation Quote
Idassamed Posted March 3, 2018 Report Posted March 3, 2018 18 minutes ago, TampaChinnodu said: nijam gaane intha goram gaa vunda situation last year aithe darunam man thu denamma, janalu papam Quote
BaabuBangaram Posted March 3, 2018 Report Posted March 3, 2018 1 hour ago, TampaChinnodu said: nijam gaane intha goram gaa vunda situation yes nenu sankranthiki intiki poyinappudu 3 days no momney in ATM's oke ATM lo money pettadu kilometer queue vunde....adhi kuda only 1000 per card isthunde...daggara vundi security guard gaadu money enter chesthunnadu manam chesgthe ekkuva pettestham emo ani Quote
boeing747 Posted March 3, 2018 Report Posted March 3, 2018 actually towns lo little better, small areas lo problem ekkuva..cousin vallu tenali lo untar, hes saying the same..atm's lo kuda limited amounts dispensing annadu Quote
perugu_vada Posted March 3, 2018 Report Posted March 3, 2018 Asalu enduku ani undatledu banks lo ? Are ppl drawing morethan they used to withdraw before demonetisation ? Asalu vati analysis/numbers emanna release chesthonda rbi ? How can they sit so silently over this big issue ? Quote
BaabuBangaram Posted March 3, 2018 Report Posted March 3, 2018 2 hours ago, perugu_vada said: Asalu enduku ani undatledu banks lo ? Are ppl drawing morethan they used to withdraw before demonetisation ? Asalu vati analysis/numbers emanna release chesthonda rbi ? How can they sit so silently over this big issue ? janalu dabbulu veyyadam ledhu Quote
BaabuBangaram Posted March 3, 2018 Report Posted March 3, 2018 2 hours ago, boeing747 said: actually towns lo little better, small areas lo problem ekkuva..cousin vallu tenali lo untar, hes saying the same..atm's lo kuda limited amounts dispensing annadu vizag aa emina small village aa saami....sankranthiki literal ga rakthakannere....no money...bonus vesina thisukoleni paritsthithi.... Quote
TampaChinnodu Posted March 3, 2018 Author Report Posted March 3, 2018 2 hours ago, BaabuBangaram said: janalu dabbulu veyyadam ledhu And big people loans eggottesthunaru loans theesukoni. Double rod. Quote
BaabuBangaram Posted March 3, 2018 Report Posted March 3, 2018 40 minutes ago, TampaChinnodu said: And big people loans eggottesthunaru loans theesukoni. Double rod. aa loans entha le ....maha aithe 2 lakh crores vuntaayi anthe ga..... Quote
SilentStriker Posted March 3, 2018 Report Posted March 3, 2018 Hyderabad la no issue..easy Ga dorkutunnayi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.