TampaChinnodu Posted March 5, 2018 Report Posted March 5, 2018 పెళ్లి, పిల్లలు వద్దంటున్న యువత రాబోయే రోజుల్లో మాట్లాడాలన్నా మనుషులుండరు.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈనాడు - అమరావతి ‘కుటుంబ వ్యవస్థ మన సొంతం. ఇది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలొస్తే పెద్దలు సరిదిద్దుతారు. చిన్న పిల్లలతో ఆడుకోవడం, మంచి చెడులు చెప్పడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఎదగడానికి వీలవుతుంది’ అని ఉండవల్లిలో ఆదివారం ఆరోగ్య బులెటిన్ విడుదల సందర్భంగా కుటుంబ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడారు. * మానసిక సమస్యలకు ఒంటరితనమే ప్రధాన కారణం. ఇది పోవాలంటే కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. అందరూ కలిసి కూర్చుని భోజనం చేసేప్పుడు మాట్లాడుకుంటుంటే ఎంతో ఆనందం ఉంటుంది. లండన్లో అయితే ఒంటరితనాన్ని నిరోధించడంపై ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. * చైనాలో ఒక బిడ్డకే ప్రాధాన్యమిస్తున్నారు. వారు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే పెద్దలు ఒంటరి అవుతున్నారు. * చాలా మందికి బాగా డబ్బులొస్తున్నాయి. అందుకే పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పిల్లలు వద్దనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో చూస్తే 30 నుంచి 40శాతం మంది పెళ్లి జోలికి వెళ్లడం లేదు. పెళ్లి చేసుకోకుంటేనే ఆనందమని చెబుతున్నారు. మీరూ పెళ్లి చేసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. మాట్లాడాలన్నా మనుషులుండరు ఎక్కువమంది పిల్లలను కనండి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. జనాభా తగ్గిపోతుంది. వృద్ధులు ఎక్కువ అవుతున్నారు. మందులు కావాలన్నా, ఇంట్లో మాట్లాడాలన్నా మనుషులు ఉండరు. చివరకు మనం కూడా జపాన్ మాదిరి రోబోలను తెచ్చుకోవాల్సి వస్తుంది. విలువలతో కూడిన సమాజం, సంతోషం రావాలంటే కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలి. పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి. ఆధార్ చెబితే ఆరోగ్య వివరాలు ‘ప్రజల ఆరోగ్య దస్త్రాలను డిజిటల్ లాకర్లో పెడుతున్నాం. వైద్యుడి వద్దకెళ్లి ఆధార్ నంబరు చెబితే ఆరోగ్య వివరాలు మొత్తం కన్పిస్తాయి. దాన్ని చూసి సరైన వైద్యం అందించే వీలుంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కొందరు వైద్యులు అరకొర పరిజ్ఞానంతో అవసరం లేని మందులు ఇస్తే కొత్త సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలు అందించే అందరి వివరాలు మ్యాపింగ్ చేయాలని సూచించారు. కొన్ని చోట్ల ఆసుపత్రులే అంటువ్యాధుల నిలయాలవుతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఆరోగ్య బులెటిన్లతోపాటు చిన్నారుల ఆరోగ్యం కోసం నిర్వహించే ‘పలకరింపు’ కార్యక్రమాలను ఉండవల్లి ప్రజాదర్బార్ మందిరం నుంచి ఆదివారం చంద్రబాబు ప్రారంభించారు. డబుల్ ఇన్కం.. నో కిడ్స్.. ఎంజాయ్ లైఫ్ ‘అమ్మాయి, అబ్బాయిలకు ఐటీ ఉద్యోగాలొచ్చాయి. సంపద పెరిగింది. వాళ్లేమంటున్నారంటే డబుల్ ఇన్కం.. నో కిడ్స్.. ఎంజాయ్ లైఫ్.. ఇదెక్కడి విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. మీ తల్లిదండ్రులు అదే అనుకుంటే మీరొచ్చేవాళ్లు కాదు కదా? కొంతమంది పిల్లలు కండీషన్లు పెడుతున్నారు. పిల్లలు కావాలంటే నాకు పెళ్లి వద్దంటున్నారు. ఇదో రకమైన వ్యవహారం’ Quote
Idassamed Posted March 5, 2018 Report Posted March 5, 2018 Ee reverse osmosis enti @TampaChinnodu ? Quote
TampaChinnodu Posted March 5, 2018 Author Report Posted March 5, 2018 Just now, Idassamed said: Ee reverse osmosis enti @TampaChinnodu ? visionary CBN seppina maata vinandi andaru. Quote
Quickgun_murugan Posted March 5, 2018 Report Posted March 5, 2018 4 hours ago, TampaChinnodu said: visionary CBN seppina maata vinandi andaru. Mena mama Polikalatho unna Pappuni chusi CBN ippudu repent avutunnademo.. Inkoka kid undi untey vadikaina nara vari telivi ochundedi ani.. Andukey suggesting more kids to youth ... Quote
Raasko Posted March 5, 2018 Report Posted March 5, 2018 1 hour ago, Quickgun_murugan said: Mena mama Polikalatho unna Pappuni chusi CBN ippudu repent avutunnademo.. Inkoka kid undi untey vadikaina nara vari telivi ochundedi ani.. Andukey suggesting more kids to youth ... bidda untey feekay ayinaa seskuntaadu 4th innings Quote
Quickgun_murugan Posted March 5, 2018 Report Posted March 5, 2018 6 hours ago, Raasko said: bidda untey feekay ayinaa seskuntaadu 4th innings Quote
JambaKrantu Posted March 5, 2018 Report Posted March 5, 2018 6 hours ago, Raasko said: bidda untey feekay ayinaa seskuntaadu 4th innings Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.