Jump to content

Adhbutha nagaramga Amaravathi


Recommended Posts

Posted
ద్భుత నగరంగా.. అమరావతి
06-03-2018 07:18:49
 
636559175300323006.jpg
 
  • కృష్ణా, గుంటూరుల సరిహద్దులు చెరిపేస్తాం
  • రెండు ప్రాంతాలకు విస్తృత రవాణా సదుపాయాలు
  • జలమార్గానికి లైన్‌ క్లియర్‌.. ప్రాధాన్యాన్ని వివరించిన గవర్నర్‌
  • అత్యద్భుతంగా ఎకనామిక్‌ సిటీ నిర్మాణం
  • ఓడీఎఫ్‌ జిల్లాలుగా కృష్ణా, గుంటూరు
  • గవర్నర్‌ ప్రసంగంలో పునురుద్ఘాటన
 
 
‘192 రోజులలో అసెంబ్లీ, సెక్రటేరియట్‌లకు తాత్కాలిక భవనాలు నిర్మించాం. అక్కడ నిర్మించబోయే ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల కోసం రూ. 45,253 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఇందులో 74 శాతం మేర టెండర్లు పిలిచారు. నలభై రెండు శాతం పనులు అమలులో ఉన్నాయి. మొత్తం 1375 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లు, సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు, రాజభవన్‌, ప్రభుత్వశాఖాధిపతుల భవనాలు, గవర్నమెంట్‌ క్వార్టర్స్‌, అడ్మినిస్ర్టేటివ్‌ భవన నిర్మాణాలు వస్తాయి. ఎనిమిది లక్షల చదరపు అడుగుల అసెంబ్లీ భవనం, బుద్ధుని స్థూపం వాస్తు శైలిలో నిర్మించటం జరుగుతుంది.
 
 
మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. పలు ప్రపంచ శ్రేణి పరిశోధనా వైద్య కేంద్రాలు అమరావతి నగరంలో కొలువు తీరనున్నాయి. ఇప్పటికే విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వెయ్యి మంది విద్యార్థులు ఇప్పటికే చేరారు. వచ్చే ఏడాది నుంచి అమృత యూనివర్శిటీ వంటి మేటి విద్యాసంస్థలు కూడా రాబోతున్నాయి.
 
 
అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అభివృద్ధి పనులన్నీ కీలక దశలో ఉన్నాయి. అమరావతిలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల తరహాలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇవి అమరావతిలో చౌక ధరలకే ఫలహారాలు, భోజనాలను అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే తొలి నీలి హరిత నగరంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాజధానిలో అంతర్భాగాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రవాణా, కీలక సదుపాయాలకు అనేక ప్రణాళికలు ఆచరణలోకి రాబోతున్నాయి. ఈ అంశాలన్నీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసన సభలో చేసిన కీలక ప్రసంగంలో మరోసారి పునరుద్ఘాటించారు.
 
 
విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, నిర్మాణాలు, అభివృద్ధి పనులను అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ తన కీలక ప్రసంగంలో ప్రస్తావించారు. గత నాలుగేళ్లుగా కృష్ణా, గుంటూరు జిల్లాలు విశేష రీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి రెండు జిల్లాల మధ్య ఉండటమే ఇందుకు కారణం. ఈ జిల్లాలను రెండుగా విభజిస్తున్న కృష్ణానదిపై మరిన్ని వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23వ కి.మీ వద్ద ఉన్న దాములూరు - వైకుంఠపురం మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒక బ్రిడ్జి కమ్‌ రిజర్వాయర్‌ రాబోతున్నదని చెప్పారు. కృష్ణానదిపై సూపర్‌ ఐకానిక్‌ బ్రిడ్జి ఏర్పాటుకు డిజైన్లు కూడా తుది దశలో ఉన్నాయి.
 
ఇవి కాక అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఒకటి కంచికచర్ల ఆవల, మరొకటి పెనమలూరు సమీపంలోని చోడవరం దగ్గరలో నిర్మాణం కావలసి ఉంది. గవర్నర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో కృష్ణానదిపై నూతన వంతెనలు నిర్మాణమౌతాయని మరోసారి చెప్పారు. చేనేత రంగానికి ఇటు పెడన, అటు మంగళగిరి కేంద్రాలుగా ఉన్నాయి. రెండు జిల్లాలలో వేల సంఖ్యలో చేనేత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఈ జిల్లాలలో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంది. వాటిని దృష్టిలో ఉంచుకుని గవర్నర్‌ నరసింహన్‌ రెండు జిల్లాలను కలిపి జౌళి, ఆహార ప్రాసెసింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చేనేత, జౌళి ఎగుమతులకు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ‘చేనేత’ కష్టాలు తీరతాయి.
 
జల మార్గానికి లైన్‌ క్లియర్‌..
కెనాల్‌ సిటీగా పేరున్న విజయవాడను కాకినాడ వరకు జల రవాణాకు అనుసంధానం చేయాలని కేంద్రం జల రవాణా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని వల్ల రవాణా చార్జీల భారం తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వేగంగా జరుగుతున్నదని గవర్నర్‌ నరసింహన్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే కాల్వలలో కాలుష్యం తగ్గడంతో పాటు నగరం కూడా అందంగా తయారవుతుంది. బందరు పోర్టు కోసం భూ సమీకరణ, సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 14 పోర్టులను ధీటుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ బందరు పోర్టు విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కూడా భూ సమీకరణ పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తే సహించనని అధికారులను హెచ్చరించారు.
 
 
విమానాశ్రయ విస్తరణ
జక్కంపూడిలో నిర్మితమవుతున్న జెట్‌ ఎకనామిక్‌ సిటీని గవర్నర్‌ ప్రస్తావించారు. ఈ సిటీని లాక్‌ టు వర్క్‌ తరహాలో నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఇక్కడ భూసేకరణ పూర్తి అయింది. ఇటీవల హౌసింగ్‌ కోసం ఏపీ టిట్కో టెండర్లు పిలవగా ఎన్‌సిసి దక్కించుకుంది. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు మరింత వేగవంతం అవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ శాసన సభలో చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో విజయవాడ కూడా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరాలు గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల సంఖ్య మిలియన్‌ ఫిగర్‌ దాటి పోతుందని అంచనా. ఇప్పటికే దేశంలోని అతి ముఖ్య నగరాలైన చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాలకు విమానాలు తిరుగుతున్నాయి. త్వరలో అంతర్జాతీయ టెర్మినల్స్‌ను కూడా ప్రారంభిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
కృష్ణా, గుంటూరు జిల్లాలు పూర్తి బహిరంగ మలవిసర్జిత జిల్లాలుగా ప్రకటించినట్టు గవర్నర్‌ చెప్పారు. రెండు జిల్లాల అధికారులు ఏడాది నుంచి నూరు శాతం లక్ష్యాల కోసం కష్టపడ్డారు. కొన్ని గ్రామాలలో బహిరంగ మలవిసర్జన సంఘటనలు తారసపడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం నూరు శాతం ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉండటం వల్లే చెదురు మదురుగా కొన్ని గ్రామాలలో అసంపూర్తి వాతావరణం ఉంది. మరుగుదొడ్లన్నీ పూర్తి చేయిస్తే మిగిలిన కొద్ది శాతం కూడా ఆగిపోయి చెంబును పాతిపెట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
 
Posted

😂😂😂😂. Adhbutham lo Adh ..poyi butham mathrame undhi headline lo... It resembles present situation of Ap

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...