BaabuBangaram Posted March 7, 2018 Report Posted March 7, 2018 వాషింగ్టన్: అమెరికాలో గతేడాది దారుణహత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో నిందితుడు 52ఏళ్ల ఆడమ్ ప్యూరింటన్ దోషిగా తేలాడు. ఈ కేసులో ఆడమ్‌ను నేరస్థుడిగా తేలుస్తూ కేన్సస్ కోర్టు తీర్పు వెల్లడించింది. అతడికి కనిష్ఠంగా 12ఏళ్ల నుంచి గరిష్ఠంగా 54ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది. గతేడాది ఫిబ్రవరిలో కేన్సన్ నగరంలోని ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్‌లో ఆడమ్ కాల్పులకు పాల్పడి శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసిన విషయం తెలిసిందే. కాల్పులు జరపడానికి ముందు ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ ఆడమ్ పెద్దపెద్దగా అరిచాడు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన మరో యువకుడు అలోక్ మదసాని, అమెరికా పౌరుడు ఇయాన్ గ్రిలియట్ గాయపడ్డారు. ఘటన తర్వాత ఆడమ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తీర్పుపై దివంగత కూచిభొట్ల సతీమణి సునయన దూమల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ తీర్పు నా శ్రీనును తిరిగి తీసుకురాలేదు. కానీ జాతి విద్వేషాన్ని ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఈ తీర్పు బలమైన సందేశాన్నిస్తుంది’ అని సునయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో ఆడమ్ ప్యూరింటన్‌కు మే 4వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.